నిద్రలేమి కారణంగా ఆరోగ్యంపై 11 దుష్ప్రభావాలు


ఆరోగ్యకరమైన జీవనశైలిని కాపాడుకోవటంలో పోషకాహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. జీవనశైలి అలవాట్లు సక్రమంగా లేకపోవడం, సకాలంలో భోజనం చేయకపోవడం మరియు వ్యాయామం చేయకపోవడం మూలంగా అనేక వ్యాధులు తలెత్తడంతో పాటుగా, తగినంత నిద్ర కూడా లభించదు. క్రమంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజులో దైనందిక కార్యక్రమాలను సవ్యంగా నిర్వహించడానికి, మరియు దేహం ఆరోగ్యవంతంగా ఉండటానికి రోజులో కనీసం ఆరు గంటలపాటు కనీస నిద్ర అవసరంగా ఉంటుందని చెప్పబడుతుంది.

Advertisement

పడుకునే ముందు క్రమం తప్పకుండా మద్యం సేవించే అలవాటును కలిగి ఉండడం, లేదా కెఫిన్ ఆధారిత పానీయాలు తీసుకోవడం వంటివి కూడా నిద్రలేమికి అత్యంత సాధారణ కారణాలుగా చెప్పవచ్చు. ఒక్కోసారి, కొన్ని రకాల థైరాయిడ్ రీప్లేస్మెంట్ ఔషధాలు, కొన్ని ఆస్తమా ఔషధాలు, పెయిన్ కిల్లర్స్, కొన్ని విటమిన్స్ మరియు ఖనిజాల అనుబంధాలను కలిగి ఉంటాయి. ఇవి ఉత్తేజిత లక్షణాలను ప్రదర్శిస్తూ, నిద్రపై ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని సందర్భాలలో, సాధారణ జలుబు జ్వరాలకు తీసుకున్న ఔషధాలు కూడా నిద్రలేమికి కారణాలుగా ఉంటాయి. క్రమంగా మీరు మెలకువగా ఉన్న కారణాన, అవిశ్రాంత నిద్రను పొందవచ్చు.

Advertisement

మీరు నిద్రలోకి జారుకోవడానికి ఐదు నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే పడుతుందా ? ఒకవేళ నిజంగా అవును అయితే, మీరు కొద్దిగా నిద్రలేమి సమస్యతో భాదపడుతున్నారనే అర్ధం. నిద్రలేమి లేదా తగినంత నిద్ర లేకపోవడం అనేవి కేవలం నైట్ షిఫ్ట్లుపనిచేసే ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేకం కాదు. స్లీప్ అప్నోయా లేదా ఇతర నిద్ర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుంది. ఆధునిక జీవనశైలి, పని సరళితో నిద్రలేమి అనేది నేటి సమాజంలో అత్యంత సాధారణ సమస్యగా మారింది.

మీరు మరోసారి రాత్రివేళల్లో ఇలా నిద్రలేని సమస్యను ఎదుర్కొంటున్న ఎడల, మీ ఆరోగ్యం పట్ల ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుందని గమనించండి. ఇప్పుడు, మీ ఆరోగ్యంపై నిద్రలేమి ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తుందో తెలుసుకుందాం.

నిద్రలేమి వలన కలిగే దుష్ప్రభావాలు :

పని కోసమో, చదువులకోసమో, లేదా కేవలం ఎంటర్టైన్మెంట్(గేమ్స్, సినిమా మొదలైనవి) కోసమో నిద్రవేళలను ప్రజలు తరచూ రాజీపడుతుంటారు. కానీ మనం గ్రహించలేని విషయం ఏమిటంటే, ఈ విధానం ప్రతికూల దీర్ఘకాలిక ప్రభావాలను కలుగజేయవచ్చు. క్రమంగా మీ ఆరోగ్యంపై ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు.

1. ఊబకాయం :

నిద్రలేమి యొక్క వివిధ శారీరక దుష్ప్రభావాలలో, అతి సాధారణమైన సమస్యగా ఊబకాయం ఉంటుంది. ఈ నిద్రలేమి లెప్టిన్ హార్మోన్ యొక్క స్థాయిలని తగ్గించడానికి కారణమవుతుంది, వాస్తవానికి ఈ లెప్టిన్ హార్మోన్, ఒకరి ఆకలి తీర్చబడిందని మెదడుకు తెలియజేస్తుంది; అటువంటి హార్మోన్ మీద ప్రభావం చూపితే, ఆకలి తీరినట్లు మెదడుకు సంకేతం అందక, అధికంగా తినేందుకు కారణంగా మారుతుంది. అదనంగా, ఆకలిని పెంచే ఘ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా, నిద్రలేమి ఇన్సులిన్ స్థాయిలని పెంచడంలో తీవ్రప్రభావాన్ని చూపుతుంది. దీని ఫలితంగా కొవ్వు నిల్వలు పెరుగుతాయి.

2. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ :

ప్రొటెక్టివ్ సైటోకైన్స్ మరియు ఇన్ఫెక్షన్ ఫైటింగ్ యాంటీబాడీస్ ఉత్పత్తి తగ్గడం మూలంగా, మీ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ రాజీ పడుతుంది. నిద్ర సమయంలో, మానవ శరీరం దాని రోగనిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది, తద్వారా బాక్టీరియా మరియు విషాల నుండి రక్షణ చేకూరుతుంది. కానీ నిద్రలేమి మూలంగా మీ శరీరానికి ఆ అవకాశం ఉండదు. క్రమంగా మానవ శరీరం అనేక వ్యాధులకు, హార్మోనుల అసమతుల్యానికి, ఇన్ఫెక్షన్లకు, ముఖ్యంగా శ్వాస మరియు మూత్రపిండాల వ్యవస్థకు మరింత హాని చేకూరుస్తుంది. జలుబు, ఫ్లూ వంటి సమస్యలు కూడా తరచుగా తలెత్తవచ్చు, కొన్ని సందర్భాల్లో నిద్రలేమి మూలంగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి.

3. మెదడుకు నిస్సత్తువ :

సరైన నిద్రలేకపోవడం అనేది న్యూరాన్లకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. క్రమంగా మెదడు ఉద్దీపనకు లోనవుతుంది. విశ్రాంతి లేకపోవడం మూలంగా న్యూరాన్స్ దెబ్బతినడానికి కారణంగా మారుతుంది. తద్వారా మీ మేధోపరమైన విధులను కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా సృజనాత్మక ఆలోచనలు తగ్గడానికి, మరియు వేగంగా, స్మార్ట్ గా నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని చంపడానికి కారణంగా మారుతుంది. అంతేకాకుండా, వ్యక్తి తరచుగా మూడ్ స్వింగ్స్ లోనవడం జరుగుతుంది.

4. నరాల రుగ్మతలకు దారితీస్తుంది :

నిద్రలేమి మూలంగా భావోద్వేగ రుగ్మతలు తలెత్తడం మాత్రమే కాకుండా, తీవ్రమైన మానసిక మరియు నరాల వ్యాధులకు కూడా కారణంగా మారుతుంది. వీటిలో ఉన్మాదం, భ్రాంతి, దీర్ఘకాలిక వ్యాకులత, పారానోమియా మరియు అసమర్ధత ప్రవర్తన ఉంటాయి.

5. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలు :

ఇది సాక్ష్యాలతో నిరూపితమైన వాస్తవం. నిద్ర లేకపోవటం అనేది దీర్ఘకాల ప్రాతిపదికన, ఒక వ్యక్తి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలను పొందే అవకాశాలను పెంచుతుంది. అధిక రక్తపోటు, స్ట్రోక్, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు. తగినంత నిద్రను పొందని వారిలో ఇది అత్యంత సాధారణమైన విషయంగా ఉంటుంది.

6. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు :

నిద్రలేమి కూడా ఆకలి విపరీతంగా పెరగడానికి గల ప్రధాన కారణంగా ఉంటుంది. నిద్రలేని రాత్రులలో మిమ్మల్ని మీరు యాక్టివ్ గా ఉంచడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా అనారోగ్యకరమైన స్నాక్స్, అకాల ఆహారపు అలవాట్లు మొదలైనవి ఉంటాయి. ఇటువంటి చర్యలు కూడా హార్మోన్ స్థాయిల హెచ్చుతగ్గులపై ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

7. వంద్యత్వ సమస్యలు (సెక్స్ లైఫ్ ప్రభావితం) :

పురుషులు మరియు మహిళలలో ఒత్తిడి మరియు ఆందోళనలు, లిబిడో మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా లైంగిక జీవితం మీద ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది నిద్రలేమితో ముడిపడి ఉండవచ్చునని చెప్పబడుతుంది.

8. చర్మ రుగ్మతలు :

నిద్రలేమి కారణంగా కార్టిసాల్ హార్మోన్ అధికంగా విడుదల కాబడుతుంది. క్రమంగా అది మీ చర్మ ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కార్టిసాల్ స్కిన్ ప్రోటీన్ అయిన కొల్లాజన్ను విచ్ఛిన్నం చేస్తుంది. కొల్లాజెన్, మన చర్మాన్ని సున్నితంగా ఉంచడంలో దోహదపడుతుంది. నిద్రలేని రాత్రులు మీ కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ పెరగడానికి కారణంగా మారుతాయి. దీర్ఘకాలిక నిద్రలేని రాత్రులు, వయసుతో సంబంధం లేకుండా పొడి చర్మం మరియు ముడుతలకు కారణంగా మారవచ్చు.

9. గుండె జబ్బులు :

గుండె వ్యాధులు మరియు అధిక రక్తపోటు వంటి హృదయ సంబంధిత రుగ్మతలు నిద్రలేమితో భాదపడే వ్యక్తులలో అత్యంత సాధారణమైన విషయంగా ఉంటుంది. రోజులో సరిపడా నిద్ర లేకపోవడం అనేది రక్తపోటు సమస్య ఉన్న రోగులలో తీవ్ర రక్తపోటుకు, క్రమంగా స్ట్రోక్ సమస్యకు కారణమవుతుంది.

10. జ్ఞాపకశక్తి క్షీణించడం :

మీ శరీరం సరైన మోతాదులో నిద్రను పొందలేనప్పుడు, కేంద్ర నాడీ వ్యవస్థ ఒత్తిడి లోనవడానికి కారణమవుతుంది. ఇది మీ మెదడు యొక్క పనితీరు మీద తీవ్ర పరిణామాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా నిద్రలేమి అనేక మందిలో జ్ఞాపకశక్తి బలహీనతలకు దారితీస్తుందని అధ్యయనాల్లో తేలింది కూడా.

11. సర్కాడియన్ రిథమ్ మీద ప్రభావం చూపుతుంది :

మన శరీరం రోజంతా పనిచేసి రాత్రికి విశ్రాంతిని పొందేలా రూపొందించబడింది. దీనికి, పగలు-రాత్రి, పనివేళలు వంటి అనేక అంశాలు కారణాలుగా ఉండవచ్చు. ఈ దైనందిక జీవన విధానంలో అస్తవ్యస్థ పోకడలు తలెత్తిన నేపధ్యంలో, దేహం మొత్తం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అసమతుల్యమైన సర్కాడియన్ రిధమ్స్ శరీరం పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యకరమైన నిద్రా విధానాలు, అలవాట్లును అలవరచుకోవాలి. దీనిని ప్రివెన్షన్ స్లీప్ హైజీన్ అని కూడా పిలుస్తారు. నిద్రలేమి ద్వారా మిమ్మల్ని మీరు తీవ్రంగా ప్రభావితం కాకుండా నిరోధించడానికి ఇది అత్యుత్తమ సాధనంగా చెప్పబడుతుంది. ఎలక్ట్రానిక్స్ మరియు పని సంబంధిత విషయాలను పడకగదిలో విడిచిపెట్టండి. మీ పడకగది చీకటిగా మరియు చల్లటి వాతావరణాన్ని కలిగి ఉండేలా నిర్వహించండి. మీ నిద్రకు, నిద్రలేచే సమయానికి హెచ్చుతగ్గులు కలిగి ఉండకుండా చూసుకోండి. పడక ముందు కనీసం మూడు గంటల పాటు భోజనం ఎక్కువగా కలిగి ఉండలేదని నిర్ధారించుకోండి. నిద్రకు ఉపక్రమించడానికి కనీసం ఎనిమిది గంటల ముందు కెఫిన్ ను నివారించండి. నిద్రించే ముందు ఆల్కహాల్ సేవించకూడదని గుర్తుంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

Adequate sleep is as important as having nutritious food when it comes to maintaining a healthy lifestyle. The way poor lifestyle habits, untimely meals and lack of exercise cause many diseases, lack of enough sleep can also cause serious health problems. Sleep impairs cognitive functioning, decision-making, hasten the effects of ageing.