జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు


జీడిపప్పు, వెన్న లాంటి రుచిని కలిగి ఉండే గింజల రకానికి చెందినదిగా ఉంటుంది. భారతదేశంలో జీడిపప్పును, నల్ల ఉప్పుతో కలిపి స్నాక్స్ వలె తీసుకునే అలవాటు ఉంటుంది. జీడిపప్పు దట్టమైన పోషకాలతో కూడుకుని, అనేక ఆరోగ్య ప్రయోజనాల గనిగా ఉంటుంది.

Advertisement

జీడిపప్పు స్వీట్ ఫ్లేవర్ను కూడుకుని, స్థిరమైన సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఇవి వైవిధ్యమైన గింజలుగా చెప్పబడుతాయి. ఎందుకంటే వీటిని పచ్చిగా లేదా కాల్చి, ఉప్పును జోడించి, లేదా ఉప్పు జోడించకుండా, ఏరూపంలోనైనా తీసుకోవచ్చు. అంతేకాకుండా, జీడిపప్పుతో పాలు, సోర్ క్రీమ్, జీడిపప్పు వెన్న, మరియు క్రీమ్ సాస్ వంటి ఇతర డైరీ ప్రత్యామ్నాయాలను తయారుచేయడానికి కూడా ఈ గింజలను వినియోగించడం జరుగుతుంది.

Advertisement

ఔషధ మరియు పారిశ్రామిక ఉపయోగాలకు వినియోగించే జీడిపప్పు మొక్కల భాగాలు, ఈ క్రింది విధంగా ఉన్నాయి :

జీడిపప్పు చెట్టు (ముంతమామిడి చెట్టుగా వ్యవహరించడం జరుగుతుంది) బెరడు మరియు ఆకు -

వీటిని డయేరియా మరియు వంటి నొప్పుల చికిత్సలో ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకించి, ముంతమామిడి ఆకుసారాన్ని రక్తంలోని చక్కెరలను తగ్గించడానికి, మరియు బెరడును నోటి పూతల చికిత్సలో ఉపయోగించడం జరుగుతుంది.

జీడిపప్పు పెంకులోని ద్రవం -

దీనిలో ఔషధ మరియు యాంటీ బయాటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. మరియు కుష్టు(లెప్రసీ), మొలలు, స్కర్వీ, గొంతు అల్సర్లు, మరియు తామర వంటి చికిత్సలో ఉపయోగించడం జరుగుతుంది.

జీడిపప్పు విత్తనాలు మరియు కాండం -

పగిలిన మడమలను నయం చేయడానికి జీడిపప్పు విత్తనాల నూనెను విరివిగా వాడడం జరుగుతుంది. జీడిమామిడి కాండం నుంచి సేకరించిన గమ్ ను పుస్తకాలకు, చెక్కకు వార్నిష్ గా వినియోగిస్తారు.

ముంత మామిడి పండు -

ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను అత్యధికంగా కలిగి ఉండే పండ్లుగా ఉంటాయి. మరియు కడుపులో అల్సర్ల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముంత మామిడి పండు నుండి సేకరించిన రసాన్ని స్కర్వీ చికిత్సలో వాడడం జరుగుతుంది.

జీడిపప్పులోని పోషక విలువలు :

100 గ్రాముల పచ్చి జీడిపప్పులో 5.20 గ్రాముల నీరు, 553 కిలో కాలరీల శక్తి ఉంటాయి. అంతేకాకుండా...

• 18.22 గ్రాముల ప్రోటీన్
• 43.85 గ్రాముల కొవ్వు
• 30.19 గ్రాముల కార్బోహైడ్రేట్
• 3.3 గ్రాముల పీచు
• 5.91 గ్రాముల పంచదార
• 37 మిల్లీగ్రాముల కాల్షియం
• 6.68 మిల్లీగ్రాముల ఇనుము
• 292 మిల్లీగ్రాముల మెగ్నీషియం
• 593 మిల్లీగ్రాముల భాస్వరం
• 660 మిల్లీగ్రాముల పొటాషియం
• 12 మిల్లీగ్రాముల సోడియం
• 5.78 మిల్లీగ్రాముల జింక్
• 0.5 మిల్లీగ్రాముల విటమిన్ సి
• 0.423 మిల్లీగ్రాముల థయామిన్
• 0.058 మిల్లీగ్రాముల రైబోఫ్లేవిన్
• 1.062 మిల్లీగ్రాముల నియాసిన్
• 0.417 మిల్లీగ్రాముల విటమిన్ B6
• 25 మైక్రోగ్రాముల ఫోలేట్
• 0.90 మిల్లీగ్రాముల విటమిన్ E
• 34.1 మైక్రో గ్రాముల విటమిన్ k

జీడిపప్పులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు:

1. బరువు నిర్వహణలో సహాయం :

ఒక అధ్యయనం ప్రకారం, అరుదుగా గింజలను తీసుకునే మహిళలు, వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు గింజలను తీసుకునే మహిళల కంటే ఎక్కువ బరువును కలిగి ఉన్నట్లుగా తేలింది. మీరు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఒక క్రమప్రాతిపదికన గింజలను తీసుకోవడం ఉత్తమంగా సహాయపడగలదని మరొక అధ్యయనంలో కూడా తేలింది. ఎందుకంటే అవి మీ పొట్టను నిండుగా ఉంచి, శరీరంలో వేడి ఉత్పత్తికి దోహదం చేయగలవని చెప్పబడుతుంది. క్రమంగా జీవక్రియల వేగం పెరుగుతుంది.

2. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో :

జీడిపప్పులో మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు మరియు పాలీశాచ్యురేటెడ్ కొవ్వులు రెండూ ఎక్కువగానే ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను తగ్గించడానికి మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ గింజలు కూడా మెగ్నీషియం యొక్క ఘనమైన వనరుగా చెప్పబడుతుంది. ఇది గుండె కండరాలను రిలాక్స్ చేస్తుంది మరియు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచడంలో :

ఎముకలు మరియు దంతాల ఆరోగ్యవంతమైన అభివృద్ధి కొరకు జీడిపప్పులోని మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం మరియు విటమిన్ కె లు అత్యావశ్యకంగా ఉంటాయి. ఎముకల నిర్మాణంలో మెగ్నీషియం కూడా ప్రధానపాత్రను పోషిస్తుంది, ఎందుకంటే ఇది ఎముకలలోని కాల్షియం శోషణలో సహకరిస్తాయి. క్రమంగా ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4. మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి :

జీడిపప్పు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదిగా సూచించడం జరుగుతుంది. జీడిపప్పు మొక్క భాగాలలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని, జీడిపప్పు విత్తనాల సారం ఇన్సులిన్ రెసిస్టెన్స్, మరియు గ్లూకోజ్ క్రమబద్దీకరణతో ముడిపడివుందని ఒక అధ్యయనంలో కూడా తేలింది.

5. క్యాన్సర్ ను నివారిస్తుంది :

జీడిపప్పుతో సహా ఇతర చెట్టు కాయలను తరచూ తీసుకోవడం మూలంగా కేన్సర్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పబడుతుంది. ఎందుకంటే, ఇవి టోకోఫెరాల్స్, అనాసార్డిక్ ఆమ్లాలు, కార్డానోల్స్, కార్డోల్స్ వంటి ఫినోలిక్ సమ్మేళనాల వంటి అనామ్లజనకాలకు మంచి వనరుగా ఉంటాయి, ఇవి జీడిపప్పు యొక్క కంకులలో నిల్వ చేయబడతాయి. ఈ అనామ్లజనకాలు ఆక్సిడేటివ్ ఒత్తిడికి కారణమయ్యే ఫ్రీ రాడికల్ నష్టం నుండి శరీర కణాలను రక్షిస్తాయి. ఈ ఆక్సిడేటటివ్ స్ట్రెస్ అనునది, కణ ఉత్పరివర్తనం, DNA నష్టం మరియు కేన్సర్ కణితి ఏర్పడటానికి దారితీస్తుంది.

6. మెదడు పనితీరుకు సహాయకంగా ..

జీడిపప్పులోని న్యూరోట్రాన్స్మిటర్లు, సినాప్టిక్ ట్రాన్స్ మిషన్ మరియు మెదడు ద్రవాల (మెంబ్రేన్ ఫ్లూయిడ్స్) ప్రవాహాన్ని క్రమబద్దీకరించడం ద్వారా ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు, మరియు పలు మెదడు ప్రక్రియలకు మద్దతును ఇవ్వగలుగుతుంది. అంతేకాకుండా జీడిపప్పులో ఆరోగ్యకర కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. అధిక గింజలను తీసుకోవడం అనేది మహిళల్లో మరింత మెరుగ్గా, మేధోపరంగా ముడిపడి ఉన్నదని ఒక అధ్యయనం తెలియజేస్తుంది

7. పిత్తాశయ రాళ్లను నివారిస్తుంది :

అధిక కొలెస్ట్రాల్ కారణంగా పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడం జరుగుతుంటుంది. ఈ సమస్య తలెత్తినప్పుడు, జీడిపప్పులను తరచుగా సేవించడం మూలంగా పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని తక్కువ చేస్తుందని చెప్పబడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, జీడిపప్పు వినియోగం మహిళల్లో కోలెసిస్టెక్టమీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

8. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది :

జీడిపప్పులో గణనీయమైన మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి కీలకంగా ఉండడమే కాకుండా, అనీమియా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నరాలు, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ఐరన్ కూడా అవసరంగా ఉంటుంది.

9. కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది :

జీడిపప్పులో ల్యూటీన్ మరియు జీయాక్సాంథానిన్ అధికంగా ఉంటాయి, ఈ రెండు సమ్మేళనాలు ఫ్రీరాడికల్స్ మూలంగా కళ్ళకు తలెత్తే, సెల్యులర్ డ్యామేజ్ నిరోధిస్తుంది. సెల్యులర్ డామేజ్ అనునది మాక్యులర్ డీజనరేషన్ మరియు కంటిశుక్లాల వంటి కంటి వ్యాధులకు దారితీస్తుంది.

10. ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి ఉత్తమంగా సహాయపడుతుంది :

చర్మం ఆరోగ్యవంతంగా ఉండటానికి మరియు అకాల వృద్ధాప్య చాయలను నిరోధించడానికి అవసరమైన ఆరోగ్యవంతమైన కొవ్వులను శరీరానికి అందివ్వడంలో జీడిపప్పు చక్కటి వనరుగా పనిచేస్తుంది. దీనిలో కనిపించే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్ చర్మం సాగుదలను మరియు స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయని చెప్పబడుతుంది.

గమనిక : మీకు నట్స్ అలెర్జీ ఉంటే మాత్రం, మీరు జీడిపప్పుకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఒక్కోసారి ఈ అలర్జీలు, తీవ్ర పరిస్థితులకు దారితీయడం లేదా ప్రాణాంతకంగా మారడం జరగవచ్చు.

మీరు మీ ఆహారంలో జీడిపప్పును జోడించదగిన మార్గాలు :

మీరు జీడిపప్పులను, ఇతర గింజల మిశ్రమాలతో కలిపి హోంమేడ్ మిక్స్చర్స్ తయారుచేసుకోవచ్చు. మీ వెజ్ లేదా నాన్వెజ్ సలాడ్లలో కూడా జీడిపప్పును జోడించుకోండి. జీడిపప్పును బ్లెండింగ్ చేయడం ద్వారా మీరే స్వంతంగా జీడిపప్పు వెన్నను తయారు చేసుకోవచ్చు. చేప, కోడి మరియు డెజర్ట్స్ వంటి ప్రధాన వంటకాలను గార్నిష్ చేయడానికి తరిగిన జీడిపప్పును ఉపయోగించండి. మీకు పాలతో కూడిన అలర్జీ ఉంటే, జీడిపప్పు పాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. మీరు జీడిపప్పు పేస్ట్ను వెజ్ మరియు నాన్వెజ్ కూరలు మరియు సూపులలో ఉపయోగించవచ్చు.

జీడిపప్పుతో రెసిపీలు :

జీడిపప్పు పాలు రెసిపీ :

కావలసిన పదార్ధాలు :

• 1 కప్పు ముడి జీడిపప్పు

• 4 కప్పుల కొబ్బరి నీరు లేదా ఫిల్టర్ చేసిన నీరు

• 1/4 టీస్పూన్ సముద్రపు ఉప్పు

• 2 నుండి 3 ఖర్జూరాలు (ఐచ్ఛికం)

• 1/2 టీ స్పూన్ వెనీలా (ఐచ్ఛికం)

తయారుచేయు పద్ధతి :

జీడిపప్పును నీటిలో నాలుగు గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. నీటిని బయటకు తీసి, జీడిపప్పును బ్లెండర్ మరియు ప్యూరీలో కలిపి మృదువుగా అయ్యేవరకు కలపండి. అంతే జీడిపప్పు పాలు రెడీ.

కానీ దీనిని 3 నుండి 5 రోజుల లోపునే సేవించాలని గుర్తుంచుకోండి.

జీడిపప్పు వెన్న :

కావలసిన పదార్ధాలు :

• 2 కప్పుల జీడిపప్పు

• నువ్వుల నూనె తగినంత

• రుచికి సముద్రపు ఉప్పు(ఆప్షనల్)

తయారుచేసే విధానం : ఒక ఫుడ్ ప్రాసెసర్లో అన్ని పదార్థాలను కలిపి, మృదువుగా వచ్చేవరకు బ్లెండ్ చేయాలి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

Cashew nuts have a sweet flavour and a soft consistency. They are versatile nuts because they can be eaten in both raw, roasted, salted or unsalted form. Cashew nuts are used to make cashew milk, sour cream, cashew-based cheese and cream sauces. The health benefits of cashews include protecting heart and bone health, preventing cancer, helping in weight loss, etc.