బెల్లం తింటే ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా? అధిక బరువును అట్టే అధిగమించొచ్చు

బెల్లంలో ఎలాంటి రసాయనాలు దాదాపుగా కలవవు. అందువల్ల చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీన్ని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవొచ్చు. బెల్లంలో ప్రోటీన్లు, ఫైబర్స్, మినరల్స్, కేలరీలు సమృద్ధిగా ఉంటాయి. బెల్లం చెరుకు నుంచ


చక్కెర కంటే బెల్లం అన్ని రకాలుగా మేలు. తియ్యదనంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
బెల్లంలో ఎలాంటి రసాయనాలు దాదాపుగా కలవవు. అందువల్ల చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీన్ని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవొచ్చు.

Advertisement

బెల్లంలో ప్రోటీన్లు, ఫైబర్స్, మినరల్స్, కేలరీలు సమృద్ధిగా ఉంటాయి. బెల్లం చెరుకు నుంచి దీన్ని తయారు చేస్తారు కాబట్టి రుచి కూడా బాగా ఉంటుంది. ఇందులో సుక్రోజ్ 50%, 20% తేమ, 20% చక్కెర, పోషకాలు ఉంటాయి.

Advertisement

బరువు తగ్గడానికి బెల్లం ఎలా ఉపయోగపడుతుంది

అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారా? అయితే రోజూ బెల్లం తింటూ ఉంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు బెల్లం చాలా ఉపయోగపడుతుంది. బెల్లం రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలు, మలినాలు బయటకు వెళ్లేలా చేస్తుంది. అధిక బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

1. శరీరంలో నీరు ఉండడం

కొందరికి బాడీలో నీరు ఉంటుంది. దీంతో శరీరం మొత్తం కూడా ఉబ్బినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. బెల్లంలో పొటాషియంతో పాటు మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ శరీరం నీరు బయటకు వెళ్లేలా చేస్తాయి. దీంతో అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు.

2. జీవక్రియ మెరుగవుతుంది

బెల్లంలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఎలక్ట్రోలైట్ సమతుల్యత ఉండేలా చేస్తాయి. అలాగే జీవక్రియ మెరుగవుతుంది.

బరువు తగ్గేందుకు బెల్లం వంటకాలు

బరవు తగ్గేందుకు బెల్లంతో తయారు చేసే కొన్ని రకాల వంటకాలను రోజూ తినడం మంచిది. మంచి రుచితో పాటు వెయిట్ లాస్ కు ఉపయోగపడే రెండు ప్రధాన వంటకాల గురించి తెలుసుకోండి.

1. బెల్లంతో తయారు చేసే స్వీట్ కాండీ (చిక్కి)

దీన్ని ముఖ్యంగా శీతాకాలంలో తయారు చేసుకుని తింటే మంచిది. దీని బెల్లం ద్వారా అన్ని రకాల ప్రయోజనాలు పొందొచ్చు.

కావాల్సినవి :

బెల్లం ముక్కలు

కొన్ని పొట్టు తీసిన వేరుశెనగలు

నువ్వు గింజలు

కాసింత నెయ్యి

Most Read :ప్రేమలో నిజాయితీ ఉంటే పెళ్లయిన అమ్మాయినీ ప్రేమించొచ్చు, ఒకడితో కాపురం చేసొచ్చినా

తయారు చేయడం ఇలా :

1. ఒక పాన్ లో నువ్వుల విత్తనాలను వేసి బాగా కాల్చండి. తర్వాత అవి చల్లగా అయ్యేంత వరకు పక్కకు ఉంచండి.

2. నాన్ స్టిక్ ప్యాన్ లో బెల్లం వేసి కాసేపు స్టవ్ పై ఉంచి వేడి చేయండి. బెల్లం కరగడానికి కేవలం 2 నిమిషాలు పడుతుంది.

3. వెంటనే స్టవ్ బంద్ చేయండి. మీకు బెల్లం పాకం రెడీ అవుతుంది.

4. బెల్లంపాకంలో కాసిన్ని కాల్చిన నువ్వులు వేరుశనగలను కలపండి.

5. ఇక దాన్నంతా ఒక ప్లేట్లో పోయండి.

6. తర్వాత కత్తితో వాటిని పీసులు మాదిరిగా కత్తిరించండి.

అంతే బెల్లం పాకంతో నువ్వులు, వేరుశనగలు కలగలిపిన స్వీట్ తయారవుతుంది. దీన్ని రోజూ తింటూ ఉంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

2. బెల్లం టీ :

బెల్లం టీ తయారు చేసుకోవడం చాలా సులభం.

కావాల్సినవి : డికాషన్, బెల్లం

తయారు చేయడం :సాధారణంగా మనం తయారు చేసుకునే టీ మాదిరిగానే బెల్లం టీని తయారు చేసుకోవొచ్చు. అయితే చక్కెర బదులుగా బెల్లం వేస్తే సరిపోతుంది.

చాలా రకాల ప్రయోజనాలు

బెల్లం టీని రోజూ తాగితే చాలా రకాల ప్రయోజనాలున్నాయి. మీ శరీరంలో క్యాలరీలు కరిగించడానికి బెల్లం టీ ఉపయోగపడుతుంది. చక్కెరలో ఉండే హానికరమైన గుణాలు బెల్లంలో ఉండవు కాబట్టి మీ ఆరోగ్యం బాగుంటుంది.

బరువు తగ్గేందుకు బెల్లం ఎంత తినాలి ?

బెల్లం తింటే బరువు తగ్గుతామని చెప్పి రోజూ అదేపనిగా బెల్లం తినడం సరికాదు. రోజూ 2 స్పూన్ల బెల్లం లేదా బెల్లం పొడి తింటే చాలు.

Most Read :నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు

హెచ్చరిక

బెల్లన్ని అతిగా తింటే బరువు తగ్గడం బదులుగా బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే డయాబెటిక్ రోగులు బెల్లం తినడం మంచిది కాదు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎక్కువగాకాకుండా.. తక్కువగాకాకుండా మీడియంలో బెల్లం తింటే చాలా మంచిది. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

~

English Summary

jaggery how does it help you to lose weight