వ్యక్తిగత పరిశుభ్రత ఎందుకు అవసరం మరియు మెరుగుపరుచుకోవడానికి చిట్కాలు


ఆరోగ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎల్లప్పుడూ మనచేతిలో ఉంటుంది. ఒకవేళ మీరు సరైన పరిశుభ్రతను పాటించని పక్షంలో, మీరు మరింత తరచుగా జబ్బుపడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం అనేది అవసరం మాత్రమే కాదు, అయితే సంపూర్ణ స్వస్థతకు మూలాధారం కూడా.

Advertisement

మీ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మూలంగా బాక్టీరియా మరియు వైరస్లు శరీరం మీద దాడి చేయకుండా నిరోధించగలుగుతుంది. క్రమంగా ఇది అస్వస్థత మరియు సంక్రామ్యతలకు దారితీస్తుంది. అదేవిధంగా, వ్యక్తిగత పరిశుభ్రత అనేక మానసిక ఆరోగ్య ప్రయోజనాలకు కూడా మూలకారణంగా ఉంటుంది. క్రమంగా మీరు మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిగి ఉండగలరు.

Advertisement

తరచుగా స్నానమాచరించని వారు, చెడు శ్వాసను కలిగి ఉంటారు మరియు అపరిశుభ్ర వాతావరణాన్ని కలిగి ఉంటారు.

వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఏమిటి?

వైద్య, ప్రజారోగ్య విధానాలలో విస్తృతంగా అమలవుతున్న భావన ఇది. వ్యక్తిగత పరిశుభ్రత అనేది మీ శరీర పరిశుభ్రతను పాటించడంగా ఉంటుంది. మరియు అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

వ్యక్తిగత పరిశుభ్రతలో రకాలు :

1. నోటి పరిశుభ్రత

2. శరీర పరిశుభ్రత

3. చేతుల పరిశుభ్రత

4. వేళ్ళు మరియు కాలిగోళ్ళ పరిశుభ్రత

5. ముఖం పరిశుభ్రత

6. జుట్టు పరిశుభ్రత

7. చెవి పరిశుభ్రత

8. బట్టల పరిశుభ్రత

9. పాదాల పరిశుభ్రత

10. చంకల పరిశుభ్రత

11. బహిష్టుకాలంలో పరిశుభ్రత

వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ప్రయోజనాలు :

1. ఆరోగ్యవంతమైన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలను రూపొందిస్తుంది :

మీరు అపరిశుభ్రంగా ఉన్న పక్షంలో, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీతో మాట్లాడటానికే కాకుండా, మీ దగ్గరకు వచ్చేందుకు కూడా ఆలోచన చేసేలా ఉంటుంది. క్రమంగా మీ నుండి దూరంగా ఉండేలా నియంత్రణా ధోరణిని అవలంభించుకునే ఆస్కారం ఉంది. ఇది మీ సామాజిక జీవితాన్ని వ్యక్తిగతంగానూ, లేదా కార్యాలయాలలోను ప్రభావాన్ని కలిగి ఉండేలా చేస్తుంది. కాబట్టి, సామాజిక అడ్డంకులను నివారించేందుకు మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఉత్తమంగా ఉంటుందని గుర్తుంచుకోండి.

Advertisement

2. మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది :

తరచుగా స్నానం చేయడం మరియు చేతులను శుభ్రం చేసుకోవడం మూలంగా బ్యాక్టీరియా మరియు వైరస్ మూలంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ మరియు అనారోగ్యాలను నివారించగలుగుతుంది. సరైన పరిశుభ్రతను పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన చర్మం యొక్క pH నిర్వహించడానికి సహాయపడుతుంది. అదేక్రమంలో భాగంగా వివిధ రకాల చర్మ వ్యాధులను కూడా నిరోధించగలుగుతుంది.

వ్యక్తిగత పరిశుభ్రత కొరకు చిట్కాలు :

మీ సంక్రామ్యతలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలను తక్కువ చేయడం, మరియు మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడం కొరకు, పురుషులు మరియు మహిళలిద్దరికీ వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపరుచుకోవడానికి సూచించదగిన కొన్ని చిట్కాల గురించిన మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

Advertisement

1. క్రమం తప్పకుండా స్నానం చేయడం :

మీ శరీరాన్ని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మీ దేహం, అనేక కాలుష్యకారకాల ప్రభావాల కారణంగా నిరంతరం మృత చర్మాన్ని పెంచుకుంటూ ఉంటుంది. తరచుగా మీ దేహాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా, దీనిని వీలైనంతవరకు తొలగించడానికి ఆస్కారం ఉంది. అలా లేని పక్షంలో చర్మంపై పేరుకునిపోయిన మురికి అనేక అనారోగ్యాలకు కారణంగా మారుతాయి. అదేవిధంగా, మీ జుట్టును శుభ్రం చేసుకోవడం కూడా, వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ఉంటుంది. ఇది మీ జుట్టును శుభ్రంగా ఉంచుతుంది మరియు చర్మ రంధ్రాలలో మురికి పేరుకోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మృతచర్మం పేరుకోకుండా, చర్మ రంధ్రాలను నిర్వహిస్తుంది.

Advertisement

2. చేతులు కడుక్కోవడం :

మీ చేతులు అత్యధికంగా క్రిములకు ప్రభావితమవుతాయి. ఎందుకంటే, రోజంతా చేతులతో చేయని పని అంటూ ఉండదు. క్రమంగా క్రిములకు ఎక్కువ బహిర్గతమయ్యే అవయవాలలో చేతులు ప్రధానంగా ఉంటాయని మీకు కూడా తెలుసు. మీ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడమనేది, మీ వ్యక్తిగత పరిశుభ్రతలో ప్రధానమైన అంశంగా చెప్పబడుతుంది. ఆహారం తయారు చేయడానికి, లేదా తినేందుకు ఉపక్రమించే ముందు, లేదా బాత్రూమ్ పనులను ముగించుకున్న తర్వాత, మీ చేతులను కడుక్కోవడం మూలంగా బ్యాక్టీరియా మరియు వైరస్ల వ్యాప్తి నిరోధించగలుగుతుంది.

3. బ్రషింగ్ :

ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడటం మరియు రోజులో ఒకసారి ఫ్లాసింగ్ చేయడం మూలంగా చెడు శ్వాసను దూరంగా ఉంచగలుగుతారు. మరియు దంతఫలకం యొక్క పెరుగుదలను కూడా నివారించవచ్చు. బలమైన పళ్లు మరియు చిగుళ్లకు దోహదపడడమే కాకుండా, గమ్ వ్యాధులు మరియు పంటి సమస్యలను దూరంగా ఉంచడంలో కూడా మీకు మీరు సహాయపడవచ్చు. అంతేకాకుండా స్వీట్లు లేదా ఆమ్ల ఆధారిత ఆహారాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ మరియు కెఫీన్ ఆధారిత పదార్ధాలను తీసుకున్న తరువాత మీ దంతాలను బ్రష్ చేయడం లేదా పుక్కిలించడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే అటువంటి ఆహార పదార్ధాలు పంటి ఎనామిల్ ను దెబ్బతీస్తుంది.

Advertisement

4. శుభ్రమైన వస్త్రాలను ధరించడం :

శుభ్రమైన మరియు తాజా దుస్తులను ధరించడం అనేది వ్యక్తిగత పరిశుభ్రతలో ప్రధానమైనభాగంగా చెప్పబడుతుంది. మీ దుస్తులను తరచుగా మార్చడం, మరియు మీకు ఉపశమనం కలిగించేలా కాటన్ అండర్ గార్మెంట్స్ ధరించడం ఏంతో ఉత్తమంగా సూచించబడుతుంది. మూడు లేదా నాలుగు సార్లు వాటిని ధరించిన తర్వాత మీ అండర్ గార్మెంట్స్ తరచుగా ఉతుకుతున్నారని నిర్ధారించుకోండి.

5. మీ గోళ్ళను ట్రిమ్మింగ్ చేయడం

పొడవైన మరియు మురికిగా ఉండే గోళ్లు అపరిశుభ్రంగా మరియు ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి. కావున చేతి మరియు కాలి వేళ్ళ గోళ్ళను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలని గుర్తుంచుకోండి. ఒక క్రమప్రాతిపదికన మీ గోళ్లను తరచుగా ట్రిమ్ చేయడం, మరియు వాటిని శుభ్రం చేసుకోవడం ద్వారా, అనేక అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు. ఉదాహరణకు అమీబియాసిస్ వంటి రోగాలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు.

6. మీ ప్రైవేట్ పార్ట్స్ శుభ్రం చేయడం అన్నిటికన్నా ముఖ్యమైన అంశం :

మీ ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకోవడం అనేది వ్యక్తిగత పరిశుభ్రత సంబంధించిన మరో ప్రధానమైన కోణంగా చెప్పబడుతుంది. మీ ప్రైవేట్ పార్ట్లను తరచుగా అన్ సెంటెడ్ సోప్లు మరియు వైప్లతో శుభ్రం చేసుకోవడం ద్వారా, క్రిములు మూత్రనాళాలలోనికి ప్రవేశించకుండా నిరోధించవచ్చు. మీ పీరియడ్స్ సమయంలో ప్రతిరోజూ మీ ప్యాడ్లు మరియు టాంపన్స్ మార్చడం ద్వారా, బ్యాక్టీరియా పెరుగకుండా జాగ్రత్త పడవచ్చు.

7. డియోడరెంట్లను వాడడం :

మంచి శరీర వాసన అనేది ఒక ముఖ్యమైన వ్యక్తిగత పరిశుభ్రత చిట్కాగా చెప్పబడుతుంది. ఆల్కహాల్ నిక్షేపాలు అంతగాలేని డియోడరెంట్ ఉపయోగించడం మూలంగా, చెమట మూలంగా కలిగే చెడు శరీర దుర్వాసనలను కప్పి ఉంచడంలో సహాయపడుతుంది. మరియు రోజంతా మీరు తాజాగా ఎటువంటి దుర్వాసనలను దరికిరాకుండా చూడగలుగుతుంది. పర్ఫ్యూమ్ ఎంచుకునే విధానాల గురించిన సమగ్ర వివరాలను ఇది వరకు బోల్డ్స్కై వ్యాసాలలో పొందుపరచడం కూడా జరిగింది.

సాధారణ వ్యక్తిగత పరిశుభ్రతలో తెలియకుండాచేసే కొన్ని తప్పులు :

1. తుమ్మేటప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు మీ నోటిని కవర్ చేయకపోవడం.

2. పోస్ట్ వర్కౌట్ తర్వాత స్నానం చేయకపోవడం.

3. మీ పళ్ళకు ఫ్లాసింగ్ అనుసరించకపోవడం.

4. వాష్ రూమ్ ఉపయోగించిన తర్వాత చేతులను శుభ్రం చేయకపోవడం.

5. మీ నాలుకను శుభ్రపరచడానికి టంగ్ క్లీనర్ వినియోగించకపోవడం.

6. చాలాకాలం పాటు మీ టూత్ బ్రష్ మార్చకపోవడం... మొదలైనవి..

చివరిగా...

ఎల్లప్పుడూ వ్యక్తిగత పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయరాదు, ఎందుకంటే ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే, చర్మ సంబంధిత రోగాలైన గజ్జి, తామర వంటి వాటితో పాటుగా, తలలో పేలు, ప్యూబిక్ పేలు, డయేరియా, అథ్లెట్ ఫీట్, స్విమ్మర్స్ యియర్, మరియు హాట్ టబ్ రాష్ వంటి సమస్యలకు కూడా దారితీయవచ్చు.

మీ అంతట మీరు ఆరోగ్యవంతంగా ఉండేలా, మరియు ఎటువంటి అస్వస్థతలు తలెత్తకుండా చూసుకోవడానికి ఈ వ్యక్తిగత పరిశుభ్రత సంబంచించిన చిట్కాలను పాటించడం కనీస బాధ్యతగా ఉంటుందని గుర్తుంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

Keeping your body clean helps prevent bacteria and viruses from attacking the body which leads to illnesses and infection. Also, personal hygiene has its own mental health benefits because you feel good about yourself. Bathing regularly, washing your hands, trimming your nails, using deodorants, and cleaning your hair are some personal hygiene tips.