బుుతుస్రావం సమయంలో మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యంత అవసరం. లేదంటే ఇన్‌ఫెక్షన్లు, చికాకు, దురదతో పాటు గర్భాశయ సమస్యలూ తలెత్తుతాయి. ఈ క్రమంలో నెలసరి రోజుల్లో బ్లీడింగ్‌ లీక్‌ అవ్వకుండా రకరకాల శానిటరీ ప్యాడ్‌లు, కప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్యాడ్‌లు కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎలాంటివి కొనుగోలు చేస్తున్నారనేది ఎప్పుడైనా గమనించారా.? ప్యాడ్‌ కొనుగోలు విషయంలో చేసే పొరపాట్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

మహిళలు శానిటరీ ప్యాడ్‌లు కొనుగోలు చేసేటప్పుడు సాధారణంగా అవి ఎంతవరకు రక్తస్రావాన్ని పీల్చుకుంటాయి.. ఎంతసేపు లీక్‌ అవ్వకుండా ఉండగలవనే విషయాలను పరిశీలిస్తారు. సదరు కంపెనీలు కూడా తమ వాణిజ్య ప్రకటనల్లో అవే అంశాలను ప్రస్తావిస్తాయి. అయితే కేవలం వీటిపైనే దృష్టి సారిస్తే సరిపోదని ప్యాడ్‌లు కొనుగోలు చేసేటప్పుడు పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్యాడ్‌ ప్యాకెట్‌లో ఏ పదార్థాలు వాడుతున్నారో దాని లేబుల్‌పైన కచ్చితంగా చెక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు

ఈ విషయాలు తప్పనిసరి

శానిటరీ ప్యాడ్‌ తయారీలో ఉపయోగించే పదార్థాలు, తయారీ విధానంపై మహిళలు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఎందుకంటే గంటల తరబడి శరీరంపైన ఉండే ఈ ప్యాడ్‌ల ద్వారా చికాకు, దురద, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి. స్కిన్‌ అలెర్జీలు, చికాకు ప్రమాదాన్ని తగ్గించేలా తయారైన, సురక్షితమైన ప్యాడ్‌లను ఎంచుకోవాలి. అదే విధంగా గాలి ప్రసరించే, సువాసన లేని ప్యాడ్‌లకు నేడు మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతోంది.

ఈ క్రమంలో ఆయుర్వేద గుణాలున్న పలు మొక్కల నుంచి లభించే సహజ మూలకాల ద్వారా తయారుచేసిన ప్యాడ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని గుర్తించి అలాంటి వాటిని కొనుగోలు చేసి ఉపయోగించడం ద్వారా చర్మం సురక్షితంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

మోరింగా ఫ్లేవర్‌

ఆయుర్వేద వైద్యంలో మోరింగా- అంటే మునగాకుకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెట్లు, సహజ సమ్మేళనాల ద్వారా ఎన్నో రోగాలకు సంజీవనిలా పనిచేస్తోంది. అందుకే దీనిని దివ్య ఔషధంగా పిలుస్తారు. ఈ క్రమంలో ఇటీవల 'ఫ్రాంటియర్స్ ఇన్ ఫార్మకాలజీ' అనే జర్నల్‌లో దీనిపై ఒక సమీక్ష విడుదలైంది.

నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి!

మునగాకులోని కెరోటినాయిడ్లు, టోకోఫెరోల్స్, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, విటమిన్లు ఉన్నాయి. ఈ మూలకాలకు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అధ్యయనం తెలిపింది. ఇంకా, మునగాకుని సప్లిమెంట్‌గా లేదా వంటకాల్లో ఉపయోగిస్తున్నాం. ఈ క్రమంలో మునగాకు ఇప్పుడు శానిటరీ ప్యాడ్‌ల్లోకి సైతం ప్రవేశించింది.

Advertisement

శానిటరీ ప్యాడ్‌లలో కొన్ని కంపెనీలు మునగాకు సారాన్ని కలుపుతున్నాయి. ఎందుకంటే ఇది రక్తాన్ని పీల్చుకోవడమే కాకుండా.. చర్మాన్ని మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. సహజ సంరక్షణ ప్రయోజనాలను అందించేలా ఈ ఆధునిక ప్యాడ్‌లలో ఉపయోగిస్తున్నారు.

మునగాకు ఆయుర్వేద ప్రయోజనాల దృష్ట్యా శానిటరీ ప్యాడ్‌లలో దీని ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే మహిళలూ మీకూ ఇలాంటి ప్యాడ్స్‌ అందుబాటులో ఉంటే లేబుల్‌ చెక్‌ చేసి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు రోజులో ప్యాడ్‌ను ఎక్కువసేపు ఉంచుకోకుండా అసౌకర్యంగా అనిపించినా, బ్లీడింగ్‌ ఎక్కువగా అవుతున్నా.. తప్పనిసరిగా మార్చుకోవాలి.