గడువు చెల్లిన ఆహారప దార్ధాలను పారేస్తున్నారా? వాటి పునర్వినియోగానికి ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

గడువు చెల్లిన ఆహారపదార్ధాలను పారవేస్తున్నారా ? వాటి పునర్వినియోగానికి ఈ చిట్కాలు అనుసరించండి.


మీ రిఫ్రిజిరేటర్లో లేదా మీ ఇంట్లో మిగిలిపోయి ఉన్న ఆహార పదార్ధాలను పారవేయదలచారా? అయితే ఒక్క క్షణం ఆగి, ఈ వ్యాసం పూర్తిగా చదివాక నిర్ణయం తీసుకోండి.

Advertisement

మీ ఫ్రిడ్జిలో లేదా మీ ఇంటిలో మిగిలిపోయిన లేదా ఎక్స్పైర్ అయిన కొన్ని ఆహార పదార్ధాల పునర్వినియోగం కొరకు, ఈ తెలివైన మరియు ఊహకు అందని మార్గాల్ని అనుసరించండి

Advertisement

ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్ధాల కన్నా, బయట షాపుల్లో, హోటళ్ళలో కొనుగోలు చేసిన ఆహార పదార్దాలలో మిగిలిపోయిన భాగాన్ని ప్రయత్నించి చూడవచ్చు.


ఒక్కోసారి పరిమితిని దాటి లేదా గడువు దాటిపోయిన ఆహార పదార్ధాలు మిగిలిపోయి, మిమ్ములను నిరాశకు గురి చేస్తుంటుంది. కానీ కొన్ని సృజనాత్మక మార్గాలు, వృధా అన్న భావనను పక్కకు నేట్టేస్తాయి.

కాలం చెల్లిన లేదా తాజా కాని బ్రెడ్ ఉందా, అయితే బ్రెడ్ క్రంబ్స్ లేదా క్రౌటన్లుగా మార్చండి:

మిగిలిపోయిన బ్రెడ్ చెడిపోయి బూజు పట్టలేదని నిర్దారించుకోండి. తాజాగా లేని బ్రెడ్ పునర్వినియోగానికి తెలివైన మార్గం క్రౌటాన్స్ లేదా బ్రెడ్ క్రంబ్స్ డిష్ తయారు చేయడం. చిన్న చిన్న చతురస్రాకృతుల్లో బ్రెడ్ ను కత్తిరించి, వాటిపై ఆలివ్ నూనెను చల్లండి. ఒవెన్లో బంగారు గోధుమ రంగు వచ్చే వరకు బేక్ చేసి, సర్వ్ చేయండి.

అరటి తొక్కలతో మీ లెదర్ బూట్లను పాలిష్ చేసుకోవచ్చు :

షూ పాలిష్ అయిపోయిందా ? లేక షూ పాలిష్ అందుబాటులో లేదా ? మీ ఇంట్లో అరటి పండ్లు ఉండే చాలు, మీ సమస్య తీరిపోయినట్లే. టుడే రిపోర్ట్ ప్రకారం అరటి పండులో పొటాషియం నిల్వలు పుష్కలంగా ఉంటాయి, మార్కెట్లో దొరికే షూ పాలిష్లలో కీలకమైన పదార్ధంగా పొటాషియం ఉంటుంది. అరటి తొక్క లోపలి భాగాన్ని ఉపయోగించి, షూ పాలిష్ చేసి, ఒక పొడి గుడ్డతో శుభ్రపరచండి. అత్యవసర సమయాల్లో ఈ చిట్కా మీకు మంచి సహాయకంగా ఉంటుంది.

Most Read:బరువు తగ్గడంలో చెరకు రసం సహాయపడుతుందనడానికి గల 7 ప్రధాన కారణాలు

కోడి గుడ్డు పెంకులు మీ తోటలో ఎరువుగా :

గుడ్లను వినియోగించిన తర్వాత దాని పై పెంకులను పారవేయకుండా, మీ తోటలో ఎరువుగా వినియోగించండి. ఇవి సహజ సిద్దమైన ఎరువులుగా ఉపయోగపడగల లక్షణాలను కలిగి ఉంటాయి, మరియు మీ మొక్కలకు పట్టే చీడలను తొలగించడంలో ప్రయోజనకారిగా ఉంటుంది.

మీ ఇంటిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగించండి :

మీరు మీ అల్మారాలో గడువు ముగుస్తున్న, బేకింగ్ సోడాను కలిగి ఉన్న ఎడల, వృధాగా పారవేయనవసరం లేదు. ఎటు తిరిగీ ఎక్స్పెయిర్ అవుతున్న ఈ బేకింగ్ సోడాను, వంటలలో వినియోగించలేరు. కానీ బాత్రూమ్ మరియు వంట గదిలోని కఠినమైన మరకలను వదిలించుకోవడానికి ఈ బేకింగ్ సోడాను క్లీనింగ్ ఏజెంట్ వలె ఉపయోగించవచ్చు.

బేకింగ్ సోడా మీ కుళాయిలకు, పాత్రలను తిరిగి వాటి సహజ రూపాన్ని తీసుకుని రావడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా మీ కుండలు మరియు పాన్స్ మీద ఏర్పడే మొండి మరకలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది.

Most Read:ఆమెను కలిసేందుకు భర్తనే సహకరించేవాడు, అతనికి అసలు విషయం తెలిసి కలవకుండా చేశాడు #mystory300

పుల్లటి పాలను మజ్జిగ బదులుగా ఉపయోగించండి :

మీరు తృణధాన్యాలు, లేదా అన్నం మొదలైన వాటిలో పుల్లని పాలను మజ్జిగకు బదులుగా వినియోగించడం జరగదు. కానీ, పుల్లటి పాలను బేకింగ్ రెసిపీలలో మజ్జిగకు బదులుగా వినియోగించవచ్చు. అయినప్పటికీ, ఇది పాశ్చరైస్డ్ పాలకు మాత్రమే వర్తిస్తుంది. ముడి పాలకు కాదు.

ఉదాహరణకు పాన్ కేక్ లేదా బిస్కట్స్ తయారీలో పుల్లని పాలను వినియోగించవచ్చు.

మీ కొవ్వొత్తి సువాసనను పునరుద్ధరించడానికి సుగంధద్రవ్యాలను ఉపయోగించండి :

మీ ఇంట్లో గడువు దాటిన సుగంధ ద్రవ్యాలు ఉన్న ఎడల, వాటిని మీ కొవ్వొత్తుల పరిమళానికి వినియోగించవచ్చు.

మీరు చేయాల్సిందల్లా కొవ్వొత్తుల మైనాన్ని, కరిగించి మీకు నచ్చిన సుగంధ ద్రవ్యాలలో కలిపి కొవ్వొత్తులుగా తయారు చేయడమే. కొవ్వొత్తుల తయారీకి అనుసరించవలసిన పద్దతుల గురించిన అనేక వీడియోలు యూట్యూబ్ వంటి స్ట్రీమింగ్ చానెళ్ళలో అనేకం అందుబాటులో ఉన్నాయి కూడా.

Most Read:పట్టెమంచంపైనే ఫస్ట్ నైట్, నాకు ఏమేమీ కావాలో అన్నీ చేసింది, నన్ను మైమరిపించింది #mystory299

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

Use these clever and unexpected ways to repurpose food in your fridge that you planned to throw awayAs good as you may try be with the food you buy, at some stage, it’s inevitable that something will spoil before you get a chance to finish it.