ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం పట్టిపీడుస్తుంది, వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోఉండకూడని మొక్కలు,చెట్లు

కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో పత్తి మొక్కలను ఉంచుకుని ఉంటారు. పత్తితో పాటు సిల్కీ పత్తి మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే మంచిది. ఉత్తర దిశల


చాలామందికి మొక్కలంటే బాగా ఇష్టం ఉంటుంది. రకరకాల మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఇది మంచి విషయమే. కానీ కొన్ని రకాల మొక్కల్ని ఇళ్లలో పెంచడం వల్ల మీ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.

Advertisement

దీంతో మీరు ఏ పని తలపెట్టినా ఆటంకాలే ఎదురవుతాయి. అందువల్ల అలాంటి మొక్కలు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఇంటికి కొన్ని వైపులా చెట్లు కూడా ఉండకుండా చూసుకోవాలి. కొన్ని దిశల్లో చెట్లు ఉంటే మిమ్మల్ని దరిద్రం పట్టిపీడుస్తుంది.

Advertisement

ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉండకూడదు

వాస్తు ప్రకారం ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉండకూడదు.. ఏ దిశల్లో చెట్లు ఉండకూడదో తెలుసుకోండి. ఫెంగ్ షుయ్ ప్రకారం కూడా కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. మరి అవి ఏమిటో చూడండి.

Magical Indoor Plants To Attract Love, Joy And Prosperity || ఈ మొక్కలు మీరు ఇంట్లో పెంచారో!!
కాక్టస్

కాక్టస్ లేదంటే దాని సంబంధిత మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోకండి. అవి మీ ఇంట్లో మిమ్మల్రి దరిద్రం పట్టిపీడుస్తుంది. అయితే గులాబీ కూడా కాక్టస్ జాతికి చెందినదే. ఆ మొక్క తప్ప కాక్టస్ జాతికి చెందిన మొక్కల్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకండి.

బోన్సాయ్

బోన్సాయ్ మొక్కలను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. వాటిని ఇంట్లో ఉంచుకోవడం అస్సలు మంచిది కాదు. అయితే వాటిని ఇంటి మందు ఖాళీ స్థలంలో లేదంటే గార్డెన్ లో పెంచుకుంటే మంచిది.

Most Read :ధనస్సులో మారుతున్న గురుగ్రహం, గురుడి అనుగ్రహం ఉంటే అన్నీ ఆనందాలే, మీ రాశిపై ఉందో లేదో చూసుకోండి

చింత, గోరింటాకు చెట్లు

చాలా మంది చింత, గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు. అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. మీరు నివసించే ఇంటికి మరీ దగ్గర్లో అవి ఉండే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది.

చనిపోయిన మొక్కలు

కొందరి ఇళ్లల్లో చనిపోయిన మొక్కలు పూల కుండీల్లో దర్శనం ఇస్తుంటాయి. వాటిని అలాగే ఇంట్లో పెట్టుకోకండి. వాటిని అలాగే ఉంచితే మిమ్మల్ని దురదృష్టం పట్టిపీడుస్తుంది. అందుకే అలాంటి మొక్కల్ని వీలైనంత వరకు తీసిపారేయండి.

బాబుల్ చెట్లు

బాబుల్ చెట్లను కూడా ఇంట్లో పెంచకూడదు. కొందరు ఇంటి ప్రాగణంలో వీటిని పెంచుతుంటారు. వీలైనంత వరకు ఇలాంటి చెట్లను ఇంట్లో ఉంచుకోకండి.

Most Read :చీరకట్టులో సూపర్బ్, పాదాల వైపు చూశా, మెట్టెలు కనిపించగానే బాధేసింది, ఆమె నా జీవితాన్నే మార్చేసింది

పత్తి

కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో పత్తి మొక్కలను ఉంచుకుని ఉంటారు. పత్తితో పాటు సిల్కీ పత్తి మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే మంచిది.

ఉత్తర దిశలో మొక్కలు

వీలైనంత వరకు మీ ఇంటికి ఉత్తర దిశలో మొక్కలు ఉంచుకోకుండా చూడండి. అలాగే తూర్పు వైపు కూడా మొక్కలు లేకుండా చూసుకోండి.

ఈశాన్యంలో

చాలా మంది ఇళ్లలో పెద్దపెద్ద చెట్లు ఉంటాయి. ముఖ్యంగా ఈశాన్య దిశలో ఇలాంటి పెద్ద చెట్లు ఉంటే అస్సలు మంచిది కాదు. దాని వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అందువల్ల ఒకవేళ చెట్లు ఉంటే వాటిని తొలగించుకోండి.

Most Read :రాజుగారి మనువరాలు బస్సులో నాతో పాటే, అబ్బా ఏం అందంరా బాబు, చూసి తట్టుకోలేకపోయా

~

English Summary

Feng Shui tips 7 plants that bring bad luck to your home