కొవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోం కల్చర్ ఎక్కువగా నడుస్తోంది. ఈ క్రమంలో మీటింగ్స్, జాబ్ ఇంటర్వ్యూలు కూడా ఎక్కువగా వర్చువల్ విధానంలోనే జరుగుతున్నాయి. అయితే ఇంటి వాతావరణానికి, ఆఫీస్ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి నుంచి పనిచేస్తున్న ఓ మహిళ మీటింగ్‌లో హాజరైనప్పుడు చోటుచేసుకున్న ఓ ఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది.
వర్క్ ఫ్రం హోంలో ఎక్కువగా ఆన్‌లైన్ మీటింగ్ కాల్స్ జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఇంట్లో వాతావరణం కారణంగా పిల్లల అల్లరి, కుటుంబీకులు మాట్లాడుకునే శబ్దాలు వినపడటం కామన్. ఈ డిస్టర్బెన్స్ లేకుండా పనిచేసుకునేందుకు ప్రత్యేకంగా గది కేటాయించుకుంటారు. అయితే ఇక్కడ ఓ మహిళ చేసిన పని మాత్రం ఎవరికైనా విపరీతంగా నవ్వు తెప్పిస్తోంది. అందేంటంటే..
ఒక జెన్ జెడ్ ఉద్యోగి ఆన్‌లైన్ లైవ్ మీటింగ్ సమయంలో చేసిన పని తమ బాస్‌ను, తోటి ఉద్యోగులనే కాదు.. నెటిజన్లని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఒక్కరు తప్ప
వీడియోలోని వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే ఆఫీస్ వర్చువల్ మీటింగ్ జరుగుతోంది. ఒక్కరు మినహా మిగతా ఉద్యోగుల కెమెరా ఆన్‌లో ఉంది. మేనేజర్ తన టీమ్‌తో కనెక్ట్ అయి మాట్లాడుతూ ఉండగా.. కెమెరా మ్యూట్ చేసిన ఉద్యోగినిని అన్‌మ్యూట్ చేయాలని మేనేజర్ కోరారు. అయితే ఉద్యోగిని సంకోచించి కెమెరా ఆన్ చేయదు. చివరికి మేనేజర్ పట్టుబట్టడంతో కెమెరాను ఆన్ చేసింది.
వీడియోలో కెమెరా ఆన్
అంతే ఒక్కసారిగా మిగతా స్టాఫ్ స్టన్ అయ్యారు. స్కీన్‌పైన దృశ్యాన్ని చూసి మేనేజర్‌తో పాటు తోటి ఉద్యోగులు నివ్వెరపోయారు. సదరు ఉద్యోగిని ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుని ఉంది. దీంతో మేనేజర్ అభ్యంతరం చెబుతూ ఇది భోజన విరామ సమంలో చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగిని ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.
ఉద్యోగిని సమాధానం
ఆ ఉద్యోగిని చాలా కూల్‌గా భోజన సమయం 15 నిమిషాలు మాత్రమే ఇస్తున్నారు. ఫేస్ ప్యాక్ ఆరడానికి 20 నిమిషాల సమయం తీసుకుంటుందని సమాధానం ఇవ్వడంతో మేనేజర్ కూల్ అయ్యారు. మేనేజర్ అనుమతి తీసుకుని కెమెరా ఆఫ్ చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది అనవసరం.. పని పట్ల అంతితభావంతో ఉన్నారా లేదా అనేది ముఖ్యమని కొందరు కామెంట్ చేశారు. మేనేజర్లు ఎందుకు కెమెరా ఆన్ చేయాలని మొండి పట్టు పడతారో అర్థం కావడం లేదని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. వ్యూస్ కోసం కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
More Articles
- తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో
- విహార యాత్రలో భయానక అనుభవం.. ఏకంగా 20 కి.మీ బైక్‌పై వెంబడించి రాడ్లతో దాడి.. వైరల్ వీడియో.!
- అమ్మ పెళ్లి కుదిర్చిందని గుండు గీయించుకున్న యువతి.. నెట్టింట వైరల్.. పుకారా, నిజమా.?
- సెలవు రోజున ఆఫీస్ కు రమ్మన్న మేనేజర్..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మహిళా ఉద్యోగిని..వీడియో చూడండి
- Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు!
- చిల్ అవ్వడానికి చోటు ఏదైతేనేం.. భారీ వర్షంలోనూ ‘సిట్టింగ్’.. మందుబాబుల వైరల్ వీడియో.!