జీవితంలో ఎన్నో బంధాలు పుట్టుకతోనే వస్తాయి, కానీ మనం ఇష్టపడి, మనసారా ఎంచుకునే ఏకైక బంధం స్నేహం. ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా (ఫ్రెండ్ షిప్ డే) జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం 2026 ఆగస్టు 2వ తేదీన ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటున్నారు.స్నేహితులు లేని జీవితం, రంగులు లేని ఇంద్రధనస్సు లాంటిది.

Advertisement

మన కష్టాల్లో తోడుగా ఉంటూ, మన బాధలను సగానికి తగ్గించి, సంతోషాన్ని రెట్టింపు చేసే అద్భుత శక్తి ఒక్క స్నేహానికే ఉంది. బంధువులతో కూడా చెప్పుకోలేని ఎన్నో రహస్యాలను, భావోద్వేగాలను ఏ భయం లేకుండా పంచుకునే ఏకైక ఆత్మీయులు మన మిత్రులే. ఈ ఆగస్టు 2న దూరాన ఉన్నా, దగ్గరగా ఉన్నా మీ దోస్తుల ముఖంలో చిరునవ్వులు పూయించడానికి, వారి వాట్సాప్ కు పంపడానికి ఇక్కడ కొన్ని అద్భుతమైన, హృదయాన్ని హత్తుకునే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు ఇక్కడ చూడండి.

Advertisement

ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి

-కష్టసుఖాల్లో తోడుండే నీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

-నా ప్రియమైన స్నేహితుడికి,స్నేహితురాలికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

-నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే.

-నా ముఖంలో చిరునవ్వుకు కారణమైన నీకు హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే.

-ఎన్ని జన్మలెత్తినా నీ స్నేహమే కావాలి. ఫ్రెండ్‌ షిప్ డే శుభాకాంక్షలు.

-నా ప్రతి అడుగులో నాకు ధైర్యాన్నిస్తూ, నన్ను ముందుకు నడిపిస్తున్న నా ప్రాణ స్నేహితుడికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

-రోజు మాట్లాడుకోకపోయినా, కలవకపోయినా, నా మనసులో నీ స్థానం ఎప్పటికీ పదిలం. హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే.

Advertisement

-పరిచయం కొంత కాలమే అయినా, నువ్వు నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయ్యావు. హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే.

-డబ్బు పెడితే దొరకనిది, ప్రాణం ఇస్తేగాని నిలవనిది మన స్నేహం. హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే మిత్రమా.

-దేవుడు నాకు ఇచ్చిన వరం మన స్నేహం. ఈ జన్మకు ఇది చాలు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

-కారణం లేకుండా పెదవులపై వచ్చే చిరునవ్వు, ఎప్పటికీ అంతం కాని ఆ కబుర్లు.. అదే స్నేహంలోని మాయాజాలం. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే మిత్రమా.

-జీవితంలో ప్రతి క్షణం ప్రత్యేకమైనది కాదు, పూల సువాసన ఎల్లప్పుడూ ఉండదు. కానీ మన కలయిక విధి నిర్ణయం, లేకపోతే నీలాంటి అద్భుతమైన స్నేహితుడు నాకు దొరికేవాడు కాదు. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.

Advertisement

-స్నేహం అనేది సుఖదుఃఖాల గాథ. ఇది నిరంతర చిరునవ్వుకు రహస్యం. ఇది క్షణికమైన బంధం కాదు, జీవితాంతం నిలిచే వాగ్దానం. నా ఆత్మీయ మిత్రునికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం?

బెస్ట్ ఫ్రెండ్స్ కోసం సరదా విషెస్

-అరేయ్ మామా, నువ్వు లేకపోతే నా లైఫ్ బోర్ రా.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే.

-ఎన్ని తిట్లు తిట్టుకున్నా, మళ్లీ కలిసిపోయే పిచ్చి స్నేహం మనది. హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే మచ్చా.

-పరీక్షల్లో కాపీ కొట్టడం నుంచి, లైఫ్ లో సెటిల్ అయ్యే వరకు తోడున్న నా బెస్ట్ ఫ్రెండ్ కి శుభాకాంక్షలు.

Advertisement

-ట్రీట్ ఎప్పుడిస్తావో తెలీదు కానీ, హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే రా.

-నేను చేసే ప్రతి పిచ్చి పనిలో నాకు సపోర్ట్ చేసే నా పిచ్చి ఫ్రెండ్‌కి హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే.

-పాకెట్ మనీ లేనప్పుడు ఆదుకునే ఆపద్బాంధవుడివి నువ్వే రా.. ఫ్రెండ్‌ షిప్ డే శుభాకాంక్షలు.

-నా సీక్రెట్స్ అన్నీ తెలిసిన ఏకైక బ్లాక్ మెయిలర్ నువ్వే.. అయినా సరే హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే.

-రోజులు మారినా, సంవత్సరాలు మారినా, మన గ్యాంగ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి.

-ఎప్పుడూ నన్ను విసిగిస్తూ, అయినా నా మీద ప్రేమ చూపించే నీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

Advertisement

-నువ్వు నా స్నేహితుడివి కాదు రా, నా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే.

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా..

ఎమోషనల్, మనసుకు హత్తుకునే విషెస్

-అమ్మ తర్వాత అమ్మలా ఆదరించేది ఒక స్నేహితుడు మాత్రమే. హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే.

-బాధలో ఉన్నప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్పే నా ప్రాణ స్నేహితుడికి శుభాకాంక్షలు.

-దూరం మన శరీరాలకే కానీ, మన మనసులకు కాదు. హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే.

-ఆస్తులు, అంతస్తులు కాదు, నీలాంటి ఫ్రెండ్ ఉంటే చాలు జీవితం సంతోషంగా గడిచిపోతుంది.

-నా తప్పులను క్షమించి, నన్ను ఎప్పుడూ సరైన దారిలో నడిపించే నీకు ఫ్రెండ్‌ షిప్ డే శుభాకాంక్షలు.

-మాటలు లేకపోయినా మనసు అర్థం చేసుకునే బంధమే స్నేహం. హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే.

-ప్రపంచమంతా నన్ను వదిలేసినా, నా వెన్నంటి నిలిచే నా దోస్త్‌ కు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

-నీ తోడుంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలను. హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే మై డియర్ ఫ్రెండ్.

-బంధువులు దూరం కావచ్చు, ప్రేమ దూరం కావచ్చు, కానీ నిజమైన స్నేహం ఎప్పటికీ దూరం కాదు.

-నా ప్రతి సంతోషంలో, ప్రతి కన్నీటిలో పాలుపంచుకునే నీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

హృదయాన్ని హత్తుకునే కోట్స్

-దేవుడు భూమి మీద కనిపించడని కొందరు అంటారు, బహుశా అలాంటి వాళ్లకు నీలాంటి అద్భుతమైన స్నేహితుడు దొరికి ఉండడు.

-స్నేహం చాలా ప్రత్యేకమైనది; ప్రతి క్షణం విలువైనది. జీవితంలో నీలాంటి నిజమైన స్నేహితుడు దొరికితే, ప్రతిరోజూ స్నేహ దినోత్సవంలాగే ఉంటుంది.

-నీరు లేకపోతే నదుల వల్ల ప్రయోజనం ఏమిటి? కన్నీళ్లు లేకపోతే కళ్ల వల్ల ఉపయోగం ఏమిటి? నీలాంటి ప్రాణ స్నేహితుడు లేకపోతే ఈ జీవితానికి అర్థం ఏముంది.

వాట్సాప్, సోషల్ మీడియా స్టేటస్ లు

-మన స్నేహం ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాల కలయిక లాంటిది. నా కష్టకాలంలో నువ్వు సారథివైతే, నీ విజయ తీరాన్ని నేను. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.

-జీవితంలో మీకు ఒక్క నిజమైన స్నేహితుడు ఉంటే చాలు, అప్పుడు మీకు సంపద లేదా హోదా ఏమీ అవసరం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ కు స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు.

-ప్రతి ఒక్కరూ కాలంతో స్నేహం చేస్తారు, కానీ కాలం మారినా, పరిస్థితులు మారినా మారని వాడే నిజమైన స్నేహితుడు. నా స్నేహితులందరికీ హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.

-నిజమైన స్నేహం ఎప్పటికీ వాడిపోని ఓ అందమైన పువ్వు లాంటిది. ఈ ఆగస్టు 2న మీ పాత స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడండి, ఈ అందమైన సందేశాలతో మీ మనసులోని ప్రేమను పంచుకోండి. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.