రాశి చక్రాల ప్రకారం వినాయకుని విగ్రహం మరియు నైవేద్యాన్ని ఎంచుకోవడం ఎలా?


భాద్రపద మాసంలో శుక్ల పక్షo నాలుగవ రోజు చవితి నాడు, గణేష్ చతుర్థి వస్తుంది. దీనినే వినాయక చవితి అనికూడా అంటారు. ఈ సంవత్సరం ఇది సెప్టెంబర్ 13, 2018 న వస్తుందని హిందూ కాలెండర్ ప్రకారం చెప్పబడింది. చవితి నుండి చతుర్ధశి వరకు పదిరోజులను వినాయకునికి కేటాయించబడింది. అతిధి సత్కారాలను స్వీకరించి చతుర్ధశినాడు నిమజ్జనం ద్వారా తిరిగి కైలాసగిరిలోని తల్లిదండ్రుల వద్దకు చేరుతాడని భక్తుల ప్రఘాడ నమ్మకం.

హిందూ మతంలోని అనేక కథలలో, వినాయకుడు తన భక్తులను కరుణించే అనేక మార్గాల గురించి వివరించబడినది. అంతేకాకుండా, ఎన్నో సద్గుణాలను తన భక్తులకు వారసత్వంగా ఇచ్చినట్లు చెప్పబడింది. ఉదాహరణకు, తల్లితండ్రుల చుట్టూ చేసిన ప్రదక్షిణం, మొత్తం విశ్వాన్నే చుట్టడంతో సమానం అని చెప్పి, తన తల్లిదండ్రుల పట్ల తన భక్తి ప్రపత్తులను చాటుకుని భక్తులకు ఆదర్శంగా నిలిచాడు వినాయకుడు. నిజమైన అంకితభావానికి ఇది ఉదాహరణగా చెప్పవచ్చు.

శివపార్వతుల కుమారుడైన, వినాయకుడు ప్రతి కార్యమును విఘ్నాలు లేకుండా విజయం సాధించడంలో బాధ్యత వహిస్తాడు. క్రమంగా ఏ కార్యం తలపెట్టాలనుకున్నా గణేషుని ప్రార్ధన చేయకుండా ప్రారంభం కాదు. వినాయక చవితి వార్షిక ఉత్సవంగా ఉంటుంది. మరియు వినాయకునికి ప్రార్ధనలు చేసే అత్యంత పవిత్రమైన సమయంగా చెప్పబడింది. జ్యోతిష్కులు వినాయక చవితి పండుగ సందర్భంగా మన రాశిచక్రం ఆధారంగా ప్రార్ధనకై విగ్రహాన్ని ఎన్నుకోడానికి మార్గాలను సూచించారు. అంతేకాకుండా, భక్తుల రాశిచక్రం ప్రకారం ఎటువంటి నైవేద్యాన్ని అర్పించవలసి ఉంటుందో కూడా వివరించారు.

మేషం: మార్చి 21 - ఏప్రిల్ 20

మేషరాశి అంగారకుని చేత పాలించబడుతుంది. అంగారక గ్రహం మంగళ దేవుని ఆధ్వర్యంలో ఉంటుంది. మేష రాశి వ్యక్తులు ఎరుపు రంగు వినాయక విగ్రహాన్ని పూజించవలసినదిగా సూచించడమైనది. నైవేద్యంగా లడ్డూలను సమర్పించవలసి ఉంటుంది. క్రమంగా వారి కోరికలను నెరవేర్చడానికి దోహద పడుతుంది.

వృషభం: ఏప్రిల్ 21 - మే 21

వృషభ రాశి శుక్ర గ్రహం చేత పాలించబడుతుంది. ఈ శుక్ర గ్రహం శుక్రుని ఆధ్వర్యంలో పాలించబడుతుంది. కావున వృషభ రాశిచక్రానికి చెందిన వ్యక్తులు ఎర్రటి పగడాలతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని పూజించాలని సూచించడమైనది. నెయ్యి మరియు మిష్రీలను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. క్రమంగా వీరి కోరికలన్నింటినీ నెరవేర్చడానికి సహాయపడే మార్గంగా చెప్పబడింది.

మిధునం : మే 22 – జూన్ 21

మిధునరాశి బుధ గ్రహం చేత పాలించబడుతుంది,. ఈ బుధ గ్రహం, బుధుని ఆద్వర్యంలో ఉంటుంది. కావున ఈ రాశిచక్రంతో ఉన్నవారు తెలుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని పూజించాలని సూచించడమైనది. పెసలతో చేసిన మూంగ్-దాల్ లడ్డును నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. వీరు లక్ష్మీ దేవిని కూడా పూజించవలసి ఉంటుంది. వీరి కోరికలన్నింటినీ నెరవేర్చడానికి సహాయపడే ఉత్తమ మార్గంగా చెప్పబడింది.

కర్కాటకం : జూన్ 22 - జూలై 22

కర్కాటక రాశి చంద్ర గ్రహం చేత పాలించాబడుతుంది. చంద్ర గ్రహానికి అధిపతి చంద్రుడు. కావున స్వేతర్క మొక్కతో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని పూజించడం మంచిదిగా చెప్పబడింది. ఖీర్ మరియు మఖాన్ నైవేద్యంగా సమర్పించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందగలరని కూడా సూచించబడినది.

సింహం : జూలై 23 - ఆగస్టు 21

సింహ రాశి సూర్యుడిచే పాలించబడుతుంది. సూర్య గ్రహానికి అధిపతి వ్యక్తిత్వానికి మారుపేరైన సూర్యదేవుడు. కావున ఎరుపు రంగు వినాయక విగ్రహానికి ప్రార్ధనలు చేయవలసినదిగా సూచించడమైనది. మోతిచోర్ లడ్డును నైవేద్యంగా సమర్పించడం మంచిదిగా సూచించబడింది.

కన్య: ఆగస్టు 22 - సెప్టెంబరు 23

కన్యారాశి బుధగ్రహంచే పరిపాలించబడుతుంది. ఈ గ్రహం బుధుని ఆధ్వర్యంలో ఉంటుంది. కన్యారాశి వారు లక్ష్మీ, గణేషుని ముందు ప్రార్ధనలు చేయవలసి ఉంటుంది. మూంగ్-దాల్ (ఆకుపచ్చ పెసలు) లడ్డును నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది.

తుల: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులా రాశి శుక్రగ్రహం చేత పాలించబడుతుంది. ఈ గ్రహం పాలక దేవుడు శుక్రుడు. ఈ రాశిచక్రం కలిగిన వారు గోధుమ రంగు వినాయక విగ్రహాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది. నైవేద్యంగా కొబ్బరిని సమర్పించవలసి ఉంటుంది.

వృశ్చికం: అక్టోబరు 24 - నవంబర్ 22

వృశ్చిక రాశి అంగారక గ్రహం చేత పాలించబడుతుంది మరియు ఈ అంగారకుని పాలక దేవుడు మంగళ దేవుడుగా ఉన్నాడు. ఈ రాశి చక్రంలోని వ్యక్తులు ఎరుపు రంగు పగడాలతో చేసిన వినాయక విగ్రహాన్ని పూజించడం మంచిదిగా సూచించబడినది. నైవేద్యంగా బేసన్ లడ్డును ఎంపిక చేసుకోవడం మంచిదిగా సూచించబడినది.

ధనుస్సు: నవంబర్ 23 – డిసెంబర్ 22

ధనుస్సు రాశి, బృహస్పతి గ్రహం చేత పాలించబడుతుంది. బృహస్పతిని గురుడు అని కూడా పిలుస్తారు. గురుగ్రహం పాలక దేవడు బృహస్పతి. కావున పసుపు రంగుతో కూడిన వినాయక విగ్రహానికి ప్రార్ధనలు చేయడం మంచిదిగా సూచించబడినది. మరియు నైవేద్యంగా బేసన్ లడ్డు సూచించబడింది.

మకరం : డిసెంబర్ 23 - జనవరి 20

మకర రాశి శని గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. శని గ్రహం పాలక దేవుడు శని దేవుడు. మకర రాశి వారు, నీలం రంగు వినాయకుడు విగ్రహాన్ని పూజించవలసి ఉంటుంది. నల్లనువ్వుల లడ్డును వినాయక విగ్రహానికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరని చెప్పబడింది.

కుంభం: జనవరి 21 - ఫిబ్రవరి 19

కుంభ రాశి కూడా మకర రాశి వలె శని గ్రహంతో సంబంధం కలిగి ఉంది. శనిగ్రహం పాలకదేవుడు శని దేవుడు. నల్లరాతితో చేసిన, లేదా నీలం రంగు వినాయకునికి పూజించడం మంచిదిగా సూచించడమైనది. మరియు ఆకుపచ్చ రంగు పండ్లను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది.

మీనం: ఫిబ్రవరి 20 - మార్చి 20

మీనరాశి గురు గ్రహం చేత పాలించబడుతుంది మరియు గురు గ్రహం పాలక దేవుడు గురుడు(బృహస్పతి). కావున ఆకుపచ్చ రంగు వినాయక విగ్రహానికి పూజలు చేయడం మంచిదిగా సూచించబడినది. మరియు నైవేద్యంగా తేనె మరియు కుంకుమ పువ్వును అందించవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈవ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Have a great day!
Read more...

English Summary

Ganesha Chaturthi 2018 will be observed on September 13, 2018. Worshipping Ganesha during this ten-day festival is considered to be very auspicious. The bestower of perfection and the remover of obstacles visits the homes of his devotees during these days, in the month of Bhadrapad. One should choose an idol as well as offer Bhoga to him as per zodiac sign.