ఎడమ చంక కింద, ఎడమ చెంపపై మచ్చ ఉంటే ఏమవుతుంది, మచ్చలను బట్టీ మీ ఆర్థిక సామర్థ్యం తెలుసుకోండి


ప్రతి ఒక్కరి శరీరంపై ఎక్కడో చోట మచ్చలుంటాయి. ఎవరికైనా ఏదైనా కలిసొస్తే నీకు ఎక్కడో మచ్చ ఉందిరా అని అంటారు. అవును కొన్ని చోట్ల మచ్చలుంటే మన దిశ తిరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక శాస్త్రం కూడా ఉంది. మచ్చలను బట్టీ వారి ఆర్థిక సంబంధిత విషయాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఎక్కడ మచ్చ ఉంటే ఎలాంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటారో తెలుసుకోండి.

ఎడమ బుగ్గపై మచ్చ ఉంటే..

కొందరికి ఎడమ చెంపపై మచ్చ ఉంటుంది. అలా మచ్చ ఉన్నవారు ఆర్థికంగా బాగా ఎదుగుతారు. వాళ్లకు సంపాదన బాగుంటుంది. వీళ్లు ఎంత సంపాదిస్తారో అంతకన్నా ఎక్కువ పొదుపు కూడా చేసే గుణం కలిగి ఉంటారు. ఎడమ చెంపపై మచ్చ ఉన్నోళ్ల ప్రత్యేకత ఇదే. అలాంటి అమ్మాయి భార్యగా వచ్చినా, అబ్బాయి భర్తగా వచ్చినా మీ జీవితం జిల్ జిల్ జిగేల్.

కింది పెదవి కింద..

కొందరికి కింది పెదవి కింద మచ్చ ఉంటుంది. ఇలాంటి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వీరికి సరైనా సమయానికి డబ్బు దొరకదు. సంపాదన ఉన్నా కూడా ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతుంటారు.

ఎడమ అరచేతిలో

ఎడమ అర చేతిపై మచ్చ ఉన్న వ్యక్తులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా డబ్బును మేనేజ్ చేయగల కెపాసిటీ కలిగి ఉంటారు. ఒక్క రూపాయి పుట్టని చోట కూడా వీళ్లకు డబ్బు పుడుతుంది. అందువల్ల వీరికి ఎప్పుడు కూడా డబ్బు సమస్య అనేదే ఉండదు.

ఎడమ కాలిపై

ఎడమ మోకాలు కింది భాగంలో మచ్చ ఉంటే వారికి డబ్బను ఎలా ఖర్చు చేయకూడదో తెలిసి ఉంటుంది. వీరు అవనసరంగా డబ్బును అస్సలు ఖర్చు చేయరు. వీరు వెచ్చించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది.

చూపుడు వేలి కింద

చూపుడి వేలి కింద కొందరికి మచ్చ ఉంటుంది. అలా ఉన్న వాళ్లు జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. వీరు తరుచూ ఆర్థికంగా ఇబ్బందిపడుతుంటారు.

ఎడమ చంక కింద మచ్చ

ఎడమ చంక కింద మచ్చ ఉంటే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్లు ఎక్కువగా అనారోగ్యాల బారినపడే అవకాశం ఉంటుంది. దీంతో వారి వద్ద ఉన్న డబ్బునంతా వ్యాధుల బారి నుంచి బయటపడేందుకు ఖర్చు చేస్తారు. దీంతో వీరి చేతిలో ఎక్కువగా డబ్బు నిలవదు.

Read More About: life predictions moles facts

Have a great day!
Read more...

English Summary

Moles On These Body Parts Reveal Financial Crisis