చీరకట్టులో సూపర్బ్, మెట్టెలు కనిపించగానే బాధేసింది, ఆమె నా జీవితాన్నే మార్చేసింది #mystory397

సాయంత్రం ఇద్దరం ఇళ్లకు వచ్చేసాం. తర్వాత తను సిటీకి వెళ్లిపోయింది. తన మొబైల్ నంబర్ గానీ, కనీసం పేరుగానీ తెలుసుకోలేకపోయాను. అసలు నాకు అవి అడగాలని కూడా అనిపించలేదు. తనను వెతుక్కుంటూచాలాసార్లు గుర్తుక


రాజుగారి మనువరాలు బస్సులో నాతో పాటే, అబ్బా ఏం అందంరా బాబు, చూసి తట్టుకోలేకపోయా అనే స్టోరీకి ఇది కంటిన్యూ కథ. #mystory396.

Advertisement

రాజుగారి మనువరాలితో జర్నీ మాత్రం నా జీవితంలో మరిచిపోని ఒక మధుర జ్ఞాపకం. తను నాకు అన్ని డిటేల్స్ చెప్పిన తర్వాత తను మీరు ఏం చేస్తుంటారు అని అడిగింది.

Advertisement

"నాది ఈ ఊరే అండి. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను. ప్రస్తుతం సిటీలో జాబ్ చేస్తున్నానండి. రాజుగారు అంటే ఊర్లో అందరికీ తెలుసండి. ఆయనంటే అందరికీ చాలా గౌరవం అండీ" అంటూ ఆమెతో మాటలు కలిపాను.

బైక్ పై డ్రాప్ చెయ్యనా

ఇంతలో ఊరొచ్చింది. బస్ స్టాప్ లో దిగగానే నాకోసం మా తమ్ముడు బైక్ వేసుకుని వచ్చి వెయిట్ చేస్తున్నాడు. "ఏమండీ మీ తాతయ్యవారి ఇళ్లు చాలా దూరంకదండీ. మీరు అంతదూరం నడిచి వెళ్తారా. నేను బైక్ పై డ్రాప్ చెయ్యనా" అన్నాను.

బైక్ పై ఎక్కించుకుని

మొహమాటపడుకుంటూనే సరే అంది. మా తమ్ముడిని అక్కడే ఉండమని చెప్పి నేను తనను బైక్ పై ఎక్కించుకుని బయల్దేరాను. ఇక ఊర్లో అందరూ మా ఇద్దరినీ చూసి.. వీడు పట్నంలో ఎవరో మాంచి క్లాస్ అమ్మాయినే పటాయించి ఊరికి తీసుకొస్తున్నాడని అనుకున్నారు. ఆమెను వాళ్ల తాతయ్య ఇంటి దగ్గర దించేసి వచ్చాను.

ముగ్గులు వేస్తూ ఉన్నారు

మకర సంక్రాంతి రోజు మా వీధిలోని అందరమ్మాయిలు ఇళ్ల ముందు ముగ్గులు వేస్తూ ఉన్నారు. నా ఫ్రెండ్స్ తో కలిసి వారి ముగ్గులు చూసుకుంటూ సరదాగా కామెంట్ చేస్తూ అలా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఎదురుగా ఆ అమ్మాయి వచ్చింది. అదేనండి రాజుగారి మనువరాలు.

Most Read :ఈ ఐదు అదృష్ట రాశిచక్రాల వారు 2019 లో ప్రేమలో మునిగితేలుతారు, వాళ్లే జీవిత భాగస్వాములు అయ్యే అవకాశం

పొలాల దగ్గరకు తీసుకెళ్తావా

మీరేంటండీ ఇలా వచ్చారు అన్నాను. మా ఇంట్లో చెప్పి, మీ ఇంటిఅడ్రస్ అడిగి వెతుక్కుంటూ వచ్చాను. నాకు కాస్త హెల్ప్ చేస్తావా అంది. చెప్పండి అన్నాను. ఏం లేదు నీ బైక్ పై కాస్త మా తాతయ్యగారి పొలాల దగ్గరకు తీసుకెళ్తావా అంది. సరే అన్నాను. ఇక ఆమె పొలంలోకి వెళ్లి కాస్త మట్టి, తర్వాత పొలంలో వేసిన పైర్లలో కొన్ని మొక్కలను పీకి ఒక కవర్ లో వేసుకుంది.

మొక్కలు పీకడానికి

ఇక మొక్కలు పీకడానికి తనకు నేను కూడా సాయం చేశాను. అలా ఆ రోజు ఉదయం నుంచి తిండీ తిప్పల్లేకుండా చెట్లవెంబడి, పుట్టలవెంబడి తిరుగుతూ గడిపాను.

ఇద్దరం ఇళ్లకు వచ్చేసాం

సాయంత్రం ఇద్దరం ఇళ్లకు వచ్చేసాం. తర్వాత తను సిటీకి వెళ్లిపోయింది. తన మొబైల్ నంబర్ గానీ, కనీసం పేరుగానీ తెలుసుకోలేకపోయాను. అసలు నాకు అవి అడగాలని కూడా అనిపించలేదు.

Most Read :రక్తంశుద్దికావాలంటే ఈ ఎనిమిది రకాల ఆహారాలు తినాలి, రక్తం పెరగాలన్నా రోజూ అవే తినాలి

తనను వెతుక్కుంటూ

చాలాసార్లు గుర్తుకొచ్చేది. తనను వెతుక్కుంటూ ఎన్నోసార్లు అగ్రికల్చర్ యూనివర్సిటికీ వెళ్లాను. కానీ కనిపించలేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఏడాది సంక్రాంతికి ఊరెళ్లాను. అక్కడ ప్రత్యక్షమైంది తను.

చీరకట్టులో భలే అందంగా

కానీ ఈసారి తన పక్కన ఒక అబ్బాయి కూడా కనిపించాడు. చీరకట్టులో భలే అందంగా ఉంది. డౌట్ వచ్చి తన పాదాల వైపు చూశాను. మెట్టెలు కనిపించాయి. ఎందుకో నాకు కాస్త బాధగా అనిపించింది. తనను నేనేమీ అంత పిచ్చిగా ప్రేమించలేదు కానీ ఏదో తెలియని వెలితి నాకు అనిపించింది.

వాళ్ల ఆయన్ని పరిచయం చేసింది

తను నన్ను చూడగానే చిరునవ్వుతో పలకరించింది. మా ఆయన అంటూ తన హజ్బెండ్ ను పరిచయం చేసింది. నా గురించి ఆయన చాలా బాగా చెప్పింది. తర్వాత అతను ఏం చేస్తున్నావు అంటూ ఆరా తీశాడు. తర్వాత నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

Most Read :ఈ ఐదు రాశులపై గ్రహణాల ప్రభావం, అంతా అశాంతే, అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి

ఒక రేంజ్ లో ఉన్నానంటే..

అతను పని చేసే ఆఫీస్ లో మంచి పొజిషన్ తో జాబ్ ఇప్పించాడు. అయినా దారిలో ఏర్పడిన పరిచయాలు శాశ్వతంగా ఉండవని ఎప్పుడూ అనుకునేవాణ్ని. కానీ నాకు ఆ అమ్మాయితో ఏర్పడిన పరిచయం నా జీవితాన్నే మార్చేసింది. ఈ రోజు ఒక రేంజ్ లో ఉన్నానంటే తన పరిచయమే కారణం.

~

English Summary

How an Unexpected Friendship Changed My Life