ప్రపంచంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందో తెలుసా?


ప్రపంచంలోనే, గాజుతో తయారుచేసిన వంతెనలకు చైనా ప్రసిద్ధి చెందింది. మరియు ఇవి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలుగా కూడా ఉన్నాయి. యోగా ప్రదర్శనల దగ్గర నుండి, వివాహ కార్యక్రమాల వరకు అనేక సంఘటనలు కూడా గతంలో ఈ వంతెనలపై చోటుచేసుకున్నాయి.

Advertisement

చైనా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనను నిర్మించింది. ఈ ఏడాది మొదట్లో తూర్పు చైనాలోని, జియాంగ్సూ ప్రావిన్స్ లో హుయాక్జీ వరల్డ్ అడ్వెంచర్ పార్క్ వద్ద స్థానికులు మరియు పర్యాటకులకోసంగా ఈ వంతెనను ప్రారంభించడం జరిగింది.

Advertisement

చైనా ప్రెస్ ప్రకారం, ప్రజలు ఒక అసాధారణమైన వాంటేజ్ పాయింట్ (దృశ్యాలను ఖచ్చితత్వంతో ఆస్వాదించదగిన ప్రదేశం) నుండి ఆకుపచ్చని చెట్లతో నిండిన లోయ యొక్క దృశ్యాలను ఆస్వాదించడానికి వీలుకలుగుతుంది. వంతెన ప్రారంభోత్సవానికి ముందుగానే ప్రజలందరూ బారులుతీరి నిలుచున్నారు అంటే, దీనికోసం వారు ఎంతగా ఎదురుచూశారో వేరే చెప్పనవసరం లేదు.

ఈ వంతెన భూమికి 100 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో వేలాడుతున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ వంతెన పొడవు 518 మీటర్లు కాగా, ఇది 3.5 సెం.మీ మందంతో ప్రత్యేకించి రూపొందించిన గ్లాస్ తో తయారు చేసినట్లుగా చెప్పబడింది.

Advertisement

ఈ వంతెనలో ఉపయోగించిన గాజు ఫలకాలు గరిష్టంగా 4.7 టన్నుల బరువును కలిగి ఉండగలవని చెప్పబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు పొడవైన గ్లాస్ బాటం రోడ్డు కలిగి ఉన్న వంతెనగా కూడా పరిగణించబడుతుంది. ఈ వంతెన ఖరీదు సుమారు 3,400,000 డాలర్ల వరకు ఉంటుందని అంచనా.

ఈ ప్రత్యేకమైన గ్లాస్ స్ట్రక్చర్, జేమ్స్ కామెరూన్ మూవీ ' అవతార్ ' సినిమాకు స్ఫూర్తిగా నిలిచింది. దీనిని ఇజ్రాయిల్ వాస్తుశిల్పి హైమ్ డోటాన్ రూపొందించారు. ఈ పొడవైన వంతెన గురించి అత్యంత నమ్మశక్యంకాని వాస్తవం ఏమిటంటే, ఇది ఒకే సమయంలో 2,600 మంది బరువును మోయగలదు.

Advertisement

ఈ వంతెనకు సంబంధించి, మరొక అద్భుతమైన అంశం కూడా ఉంది. ఎవరైనా, ఈ వంతెన మీదకు ఎక్కినప్పుడు, దీనిపై గాజు పగిలిన ధ్వనులు వినిపిస్తాయి, అంతేకాకుండా కొన్ని దృశ్యప్రభావాల కారణంగా మీ గుండె కొద్దిగా తటపటాయించవచ్చు.

దీని మీద పర్యాటకులు నడుస్తున్నప్పుడు, గాజు వంతెన పగిలిపోయినట్లు అనిపించే స్పెషల్ ఎఫెక్ట్స్ రూపొందించారు. క్రమంగా, ఇదొక థ్రిల్లింగ్ అనుభూతికి లోనుచేస్తుంది.

ఈ భయానక వంతెన, అనుభవపూర్వకంగానే ఎన్నో విశిష్టతలను చూపగలదు. క్రమంగా అనతికాలంలోనే, ఈ అనుభూతిని పొందడానికి అనేక వేలమంది టూరిస్టులు సందర్శించడం కారణంగా, ఈ ప్రదేశం ఒక హాట్ టూరిస్ట్ ప్లేస్ గా మారింది.

Advertisement

భయం మరియు వింత అనుభూతికి లోనవుతూ, మిశ్రమ భావోద్వేగాలతో కూడిన పర్యాటకుల పలు వీడియోలు, చిత్రాలు అంతర్జాలంలో హల్చల్ చేస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు మొత్తం అనుభవాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుండగా, ఇతరులు కిందకు చూడటానికి కూడా భయపడడం కనిపిస్తుంటుంది.

ఎట్టి పరిస్థితులలోనూ ఈ వంతెన హృద్రోగులకు సరికాదని చెప్పబడుతుంది; మీకు ఈ వంతెనను ఎదుర్కోడానికి ధైర్యసాహసాలు ఉన్నాయని భావిస్తే, ఈ సారి ట్రిప్ ప్రయత్నించి చూడండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~
Read More About: insync

English Summary

China is known for glass-made bridges and these are popular tourist attractions. Events like yoga demonstrations and even weddings have taken place on these tourist attractions in the past.China has now built the world's longest glass bridge. This bridge was opened to the locals and tourists at Huaxi World Adventure Park,