కొన్ని డర్టీ పదాలకు అర్థాలే ఉండవు!


'కాక్చఫర్ లేదా సెక్సంగాల్' వంటి పదాలు వినడానికి అభ్యంతరకరమైనవిగా కనిపిస్తుంటాయి. క్రమంగా వీటిని వినియోగించడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. కానీ వీటి అర్థం తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించారా?

Advertisement

కాక్చఫర్ అంటే యూరోపియన్ ప్రాంతాలలోని, మెలోలోంథ జాతికి చెందిన, కీటక రకం(బీటిల్స్). ఇవి వృక్షాలను, పంటలను నాశనం చేస్తుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే, ఆకుతినే పురుగు జాతికి చెందినదిగా చెప్పబడుతుంది. మరోవైపు, సెక్సంగాల్ అంటే జ్యామితి(జామిట్రీ) లేదా షడ్భుజి(హెక్సగాన్) అని అర్ధం. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.

Advertisement

కొన్ని పదాల కలయికగా ఉన్న కారణంగా, అందులో మీకు ద్వంద్వార్ధాలు లేదా చెడు అర్ధాలు కనపడే ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఇటువంటి పదాలు మన నిఘంటువులో అనేకం ఉన్నాయి. వీటిని ఉచ్చరించడానికి ఆలోచిస్తున్న కారణంగా అవి అనేకమందికి తెలియడం లేదు కూడా. అటువంటి చెడు అర్ధాలను గోచరించే కొన్ని మంచి పదాల జాబితాను ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

ఆస్సాపానిక్ :

అమెరికాలో "ఎగిరే ఉడుత" కు గల మరో పేరు ఇది. ఈ పదాన్ని తొలుత 1606 లో వలస నాయకుడైన కెప్టెన్ జాన్ తన జర్నల్లో ఉపయోగించాడు.

ఆక్టాషిటే :

ఆక్టాషిటే రష్యాలోని ఒక గ్రామం పేరు 1968 సంవత్సరంలో మొదటిసారిగా కనుగొనబడింది. ఈ పదాన్ని ఆర్సెనిక్, కాపర్, మెర్క్యురీ ఖనిజాలకు సంబంధించిన అరుదైన ఖనిజ ఎరువులకు కూడా వాడడం జరుగుతుంది.

బూబైయల్లా :

ఉత్తర టాస్మానియాలో ఒకప్పటి షిప్పింగ్ రేవు పేరు బూబైయల్లా. అదే విధంగా, ఈ పదం వాటిల్ బర్డ్ కు సాంకేతిక నామంగా ఉంది. ఇది ఆస్ట్రేలియాకు చెందిన "హనీ ఈటర్స్" కుటుంబానికి చెందిన పక్షులలో ఒకటి.

బమ్ ఫిడ్లర్ :

దేనినైనా నాశనం చేయడం లేదా, కలుషితం చేయడం అన్న భావాలకు ఈ బమ్ ఫిడ్లర్ అనే పదం వాడబడుతుంది. ఏదైనా పత్రాలను రాస్తున్నప్పుడు, లేదా బొమ్మలు గీస్తున్నప్పుడు తప్పిదం జరిగిన పక్షంలో తరచుగా వినియోగించే పదంగా ఈ బమ్ ఫిడ్లర్ ఉంటుంది.

క్లాటర్ ఫార్ట్ :

"క్లాటర్ ఫార్ట్" అనునది గాసిప్ లేదా చర్చలకు దారితీసే అంశాలకు వినియోగించే పదంగా ఉంటుంది. 1552 లో ప్రచురితమైన ఒక ట్యూడర్ నిఘంటువు ప్రకారం, క్లాటర్ ఫార్ట్ అంటే " కాంతికి బహిర్గతం అవడం (గాసిప్)" అని అర్థం.

కాక్-బెల్ :

కాక్-బెల్ అంటే చిన్న హ్యాండ్ బెల్ అని అర్థం. ఇది కూడా వసంత రుతువులో పెరిగే ఒక అడవిపువ్వు రకానికి చెందినదిగా ఉంటుంది. ఈ పదము "కోక్యూ" అనే పదము నుండి ఉద్భవించింది, ఇది సీషెల్(సముద్రపు గవ్వలు లేదా ఆలుచిప్పలు) కు ఫ్రెంచ్ పదముగా చెప్పబడుతుంది.

డిక్ - డిక్ :

ఆఫ్రికాలోని కనిపించే ఒకరకమైన జింకల జాతిని డిక్-డిక్ అని వ్యవహరించడం జరుగుతుంది. అంతేకాకుండా, చూసేందుకు విచిత్రంగా కనిపించే ఈ జంతువులు, సవాన్నా భూములలో, ప్రధానంగా తూర్పు ఆఫ్రికా ప్రాంతాలలో కనిపిస్తుంటాయి.

డ్రీమ్ హోల్ :

డ్రీమ్ హోల్ అనే పదం భవంతి గోడకు ఏర్పాటుచేసిన చిన్న చీలిక లేదా రంధ్రముగా సూచించబడుతుంది. దీనిని సాధారణంగా సూర్యకాంతి లేదా తాజా గాలి, గదిలోనికి వచ్చేందుకుగాను ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంతేకాకుండా ఒకప్పుడు ఈ పదాన్ని రక్షకభటులు ఉపయోగించే వాచ్ టవర్లలోని రంధ్రాలను సూచించడానికి ఉపయోగించేవారు.

సెక్స్ ఫోయిల్డ్ :

సెక్స్ ఫోయిల్డ్ అనే పదం మధ్య ఆంగ్ల కాలం నాటిదిగా చెప్పబడుతుంది. ఇది ఒక ఆకు లేదా రేకులకు పాతకాలపు పేరుగా ఉంది. ఆరు ఆకులు లేదా లోబ్స్ తో కలుపబడిన ఒక ఆరు ఆకుల మొక్క లేదా పుష్పం లేదా ఆభరణంగా ఈ సెక్స్ ఫోయిల్డ్ చెప్పబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~
Read More About: insync

English Summary

According to English dictionary, there are some words which really do sound offensive, but the fact is the actual meaning of the word is something different or it has an entirely innocent definition to it. For example, cockchafer means a breed of the large European beetles from the genus Melolontha.