న్యాచురల్ గా స్పెర్మ్ కౌంట్ ను పెంచుకోవడం ఎలా


పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడమనేది ఈ మద్యకాలంలో అత్యధిక మంది ఎదుర్కొంటున్న, సాధారణ లైంగిక సమస్యగా చెప్పబడుతుంది. పురుష వంధ్యత్వానికి కారణమయ్యే కారకాలు అనేకం ఉన్నప్పటికీ, వాటిలో ప్రధానంగా వీర్యకణాల సంఖ్య తగ్గడం అన్నిటికన్నా ముందువరుసలో ఉంటుందని చెప్పబడుతుంది. ఆరోగ్యం మరియు జీవనశైలి విధానాలు అనేవి ప్రధానంగా, ఒక పురుషుడి వీర్యకణాలపై ప్రభావాన్ని చూపుతాయి. అదేవిధంగా, ధూమపానం, డ్రగ్స్, కొన్ని రకాల మందులు, కండరాల నిర్మాణంలో స్టెరాయిడ్ల వాడకం వంటివి కూడా వీర్యకణాల సంఖ్యను తగ్గించడంలో ప్రధాన కారకాలుగా ఉంటాయని చెప్పబడుతుంది.

Advertisement

ఆహారం మరియు జీవనశైలి ప్రభావాలు :

పురుషునిలో వంధ్యత్వానికి, నిల్వ చేసిన ఆహార పదార్ధాలు, చక్కెరలు మరియు అనారోగ్యకర కొవ్వులు సమృద్ధిగా ఉన్న ఆహర పదార్ధాలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇవన్నీ మీ వీర్యకణాల తగ్గుదలకు దారితీస్తుంది. దానికి అదనంగా, అసంబద్దమైన జీవనశైలి విధానాలు కూడా, మీ వీర్యకణాల సంఖ్యను మరియు నాణ్యతను క్షీణింపజేయడానికిగల కారణాలుగా ఉంటాయి.

Advertisement

ఒకవేళ మీరు మరియు మీ భాగస్వామి గర్భధారణకొరకు ప్రయత్నిస్తున్న పక్షంలో, లేదా తక్కువ వీర్యకణాల సంఖ్యతో బాధపడుతున్న ఎడల, మీ సమస్యను పరిష్కరించడం కొరకు వైద్య పర్యవేక్షణను కోరుకోవడం సర్వసాధారణం. కానీ అదేక్రమంలో భాగంగా, కొన్ని స్పెర్మ్ బూస్టింగ్ ఆహార పదార్ధాలు మరియు వ్యాయామాలను మీ ఆహార మరియు జీవనశైలి ప్రణాళికలలో జోడించి, కొన్ని అవసరమైన మార్పులను చేయడం ద్వారా వీర్యకణాల సంఖ్యను పెంచుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పబడుతుంది. మీ వీర్యకణాల సంఖ్యను పెంచడానికి సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాల జాబితాను ఇక్కడ పొందుపరచడం జరిగింది.

వీర్యకణాల సంఖ్యను మెరుగుపరచడంలో ఉపయోగపడే ఆహార పదార్ధాలు :

1. బచ్చలి లేదా పాలకూర :

ఆకుకూరలలో ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉన్నకారణంగా, వీర్యకణాల ఆరోగ్యం మరియు నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెప్పబడుతుంది. పాలకూరను తరచుగా తీసుకోవడం మూలంగా వీర్యకణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, మరియు వాటి నాణ్యత కూడా రెట్టింపు అవుతుందని చెప్పబడుతుంది.

2. గుడ్లు :

మనిషికి అందుబాటులో అత్యధిక ప్రోటీన్ మూలాలు ఉండి, అత్యంత చౌకగా లభించే ఉత్తమ వనరుగా గుడ్డు ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇందులో మీ వీర్యకణాల సంఖ్యను పెంచే మూలాలు అధికమొత్తాలలో ఉన్నాయని చెప్పబడుతుంది. ప్రోటీన్ ని వీర్యకణాల బిల్డింగ్ బ్లాక్ గా పేర్కొంటారు, క్రమంగా మంచి నాణ్యత కలిగిన ప్రోటీన్ వినియోగించడం మూలంగా మీ వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని చెప్పబడుతుంది.

3. డార్క్ చాక్లెట్ :

మీకు డార్క్ చాక్లెట్ అలవాటు పెద్దగా లేకుండా, దాని షుగర్ వర్షన్ మీద అభిమానం ఎక్కువగా ఉన్నట్లైతే, మీరు మీ ఎంపికలను సవరించుకోవలసినదిగా మేము సూచిస్తున్నాము. చక్కెరలు వీర్యకణాలకు బద్ధ శత్రువుగా ఉన్నప్పటికీ, మరోవైపు డార్క్ చాక్లెట్లో అమైనో ఆమ్లాల నిక్షేపాలు అధికంగా ఉంటాయని చెప్పబడుతుంది. మరియు ఇది మీ వీర్యకణాల సంఖ్యను మరియు నాణ్యతను పెంచడానికి గొప్ప మార్గంగా చెప్పబడుతుంది.

4. వెల్లుల్లి :

వీర్యకణాల సంఖ్యను పెంచే జాబితాలో అత్యంత రుచిగా ఉండే ఆహార పదార్ధం కాకపోయినా, వెల్లుల్లి కొన్ని అద్భుతమైన గుణాలను కలిగి ఉంటుందని చెప్పబడుతుంది., క్రమంగా ఇది మీ వీర్యకణాల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి విటమిన్ B6 మరియు సెలీనియంతో ప్యాక్ చేయబడి ఉన్న కారణంగా వీర్యకణాల నష్టాన్ని నిరోధించడంలో అత్యుత్తమంగా సహాయపడగలదని చెప్పబడుతుంది.

5. అరటి పండు :

అరటిపండు ఖచ్చితంగా ఈ జాబితాకు న్యాయం చేస్తుంది. అంతేకాకుండా, అరటిపండు ఆరోగ్యం విషయంలో ఆల్ రౌండర్ పాత్రను పోషిస్తుంది. విటమిన్ A, B1 మరియు C నిక్షేపాల ఘనమైన వనరుగా ఉన్న కారణంగా, అరటిపండ్లను తరచుగా తీసుకోవడం ద్వారా, మీ వీర్యకణాల సంఖ్యను మరియు నాణ్యతను పెంచడంలో ఉత్తమంగా సహాయపడగలదని చెప్పబడుతుంది.

6. ఆయిస్టర్ :

ఆఫ్రోడిసియాక్ గా ప్రసిద్ది చెందిన ఈ ఆయిస్టర్స్, మీ టెస్టోస్టెరాన్ స్థాయిలను మరియు వీర్యకణాల ఉత్పత్తిని నిర్వహించడానికి సహాయపడగల, అత్యంత ముఖ్యమైన జింక్ వంటి ఖనిజాలతో కూడుకుని ఉంటుంది.

7. వాల్నట్స్ :

మీరు వాల్నట్స్ స్నాక్స్ తీసుకోవడం ఎక్కువగా ఇష్టపడుతున్నట్లైతే, ఇది మీకు అనేకరకాలుగా సహాయం చేయగల ఉత్తమ ఆహారపదార్ధంగా ఉండగలదు. వాల్నట్స్ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి ఉన్న కారణంగా, వృషణాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, ఫలితంగా వీర్యకణాల సంఖ్య పెరగడంలో సహాయపడుతుందని చెప్పబడుతుంది.

8. ఆస్పరాగస్ :

ఈ హెల్తీ గ్రీన్ స్టిక్స్ లో విటమిన్ సి అధిక స్థాయిలు ఉన్న కారణంగా, ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుండి శుక్రకణాలను రక్షించగలుగుతుంది, తద్వారా వీర్యకణాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని చెప్పబడుతుంది.

9. విటమిన్ డి ఘనంగా ఉండే ఆహారపదార్ధాలు :

విటమిన్ డి మరియు కాల్షియం తక్కువ స్థాయిలలో ఉన్న కారణంగా, వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అనేక అధ్యయనాలలో రుజువైంది. అందువలన, మీ శరీరానికి తగిన మోతాదులో విటమిన్ డి మరియు కాల్షియం ఇవ్వడం మూలంగా ఆరోగ్యకరమైన ఎముకపుష్టిని కలిగి ఉండడమే కాకుండా, మీ వీర్యకణాల నాణ్యత మరియు పరిమాణాన్ని పెంచడంలో కూడా సహాయపడలదని చెప్పబడుతుంది.

10. పసుపు :

పసుపులో ఉండే శక్తివంతమైన కుర్కుమిన్, వీర్యకణాల నాణ్యతపై సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పబడుతుంది. ఈ సుగంధ ద్రవ్యాలు వీర్యకణాలు ఉత్పత్తి అయ్యే వృషణాల ప్రాంతానికి రక్తప్రవాహాన్ని మెరుగుపరచడమే కాకుండా, పురుషులలో మొత్తం వీర్యం ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడంలో కూడా సహాయపడగలదు.

11. పుట్ట గొడుగులు :

పుట్ట గొడుగులు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ అవి శక్తి వంతమైన పోషకాలతో కూడుకుని ఉన్న పవర్ ప్యాక్డ్ ఆహార పదార్ధంగా చెప్పబడుతుంది. ఇవి మీ వీర్యకణాల సంఖ్యను పెంచడానికి సరిపడే విధంగా సుమారు 15 రకాల అత్యుత్తమ విటమిన్స్ మరియు మినిరల్స్ కలిగి ఉంటాయని చెప్పబడుతుంది. అంతేకాకుండా, ఇవి శరీరం లోపల, వివిధ కారణాల మూలంగా కూడా వీర్యకణాలను నాశనం కాకుండా కాపాడగలుగుతాయి.

12. ఓట్స్ :

ఓట్స్, ఆరోగ్యకరమైన అల్పాహారంగా మాత్రమే కాకుండా, మీ పునరుత్పత్తి సామర్ధ్యాన్ని ఉత్తమ స్థానంలో ఉంచడానికి సరిపోయే గొప్ప లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో భాగంగా వీర్యకణాల ఉత్పత్తిలో కీలక పాత్రను పోషిస్తుంది.

13. సాల్మన్ ఫిష్ :

సాల్మన్ ఫిష్ అధిక మొత్తాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. క్రమంగా ఇది అత్యంత ఆరోగ్యవంతమైన సీఫుడ్ గా పేర్కొనడం జరుగుతుంది. అంతేకాకుండా, ఇది మీ వీర్యకణాల నాణ్యతను మరియు సంఖ్యను పెంచడంలో సహాయపడగలిగే, విటమిన్ B మరియు D యొక్క అద్భుతమైన మూలంగా ఉంటుందని సూచించబడుతుంది.

14. స్వీట్ పొటాటో (చిలగడ దుంప) :

ఇవి అత్యధిక మోతాదులలో విటమిన్ ఎ నిక్షేపాలను కలిగి ఉంటాయి. విటమిన్ ఎ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా ఉంటుంది, మరియు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి శుక్రకణాలను రక్షిస్తుంది. స్వీట్ పొటాటోలో ఉండే పోషకాలు, వీర్యకణాల ఉత్పత్తిలో సహాయపడుతాయి. మరియు ఈ రెండు కారకాల కారణంగా, మీ వీర్యకణాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంలో ప్రభావాన్ని కలిగి ఉంటాయని చెప్పబడుతుంది.

మీ వీర్యకణాల సంఖ్యను, నాణ్యతను మెరుగుపరచడంలో కొన్ని జీవనశైలి చిట్కాలను అనుసరించడం కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మీరు ఎంత గొప్ప ఆహారప్రణాళికను అనుసరిస్తున్నప్పటికీ, గణనీయమైన జీవనశైలి మార్పులను కలిగిలేని పక్షంలో ఎటువంటి పురోగతిని కూడా సాధించలేరని గుర్తుంచుకోండి.

1. వ్యాయామం :

వ్యాయామం అనేది అనేకరకాల ఆరోగ్య పరిస్థితులకు ఉత్తమమైన సమాధానంగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా, తరచుగా వ్యాయామాన్ని అనుసరించడం మూలంగా, మీ వీర్యకణాల ఉత్పత్తిని పెంచడంలో అత్యుత్తమంగా సహాయపడుతుందని చెప్పబడుతుంది. ఏరోబిక్ వ్యాయామాలు ముఖ్యంగా, మీ వీర్యకణాల పురోగతి మీద సానుకూల ప్రభావాలను చూపుతాయని చెప్పబడుతుంది.

2. ఒత్తిడిని తగ్గించుకోండి :

ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరం సర్వైవల్ మోడ్ లోనికి వెళుతుంది. క్రమంగా ప్రత్యుత్పత్తి అంశాలతో సహా అనేక విధులు రాజీపడుతాయి. ఒత్తిడి మూలంగా, స్వయంచాలకంగా మీ పునరుత్పత్తి అవయవాలుకూడా అనారోగ్య పరిస్థితులబారిన పడుతాయి. కావున ఒత్తిడిని తగ్గించుకునేలా జీవన శైలి ప్రమాణాలను పాటించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. క్రమంగా వీర్యంలో నాణ్యత పెరిగి, ఉత్తమ పనితీరును కలిగి ఉంటాయి. దీనివలన మీ సెక్స్ జీవితంపై కూడా సానుకూల ప్రభావం నెలకొంటుంది.

3. ధూమపానానికి గుడ్బై చెప్పండి :

వీర్యకణాల ఉత్పత్తి తగ్గడానికి గల ప్రధాన కారణాలలో ధూమపానం మొదటి వరుసలో ఉంటుంది. ప్రత్యక్ష మరియు పరోక్ష ధూమపానం కూడా, మీ వంద్యత్వ సమస్యలకు కారణంగా మారవచ్చు. కావున మీ స్నేహితులకు అలవాటు ఉన్నా, కూసింత దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. ధూమపానాన్ని మానెయ్యడం ద్వారా, మీ ఊపిరితిత్తులకు మంచి చేయడమే కాకుండా, దీర్ఘకాలికంగా వంధ్యత్వ సమస్యలు తలెత్తకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

4. ఆల్కహాల్ మానుకోండి :

అనేక శాస్త్రీయ అధ్యయనాలు మద్యం వినియోగాన్ని వీర్యకణాల ఉత్పత్తి తగ్గుదలతో ముడిపెట్టాయి. కావున, మీరు ఏ సమయంలోనైనా తల్లిదండ్రులుగా మారాలని భావిస్తున్నవారైతే, మీరు ఆల్కహాల్ కి వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

5. బరువు తగ్గడం :

25 కు పైగా అధిక బాడీ మాస్ ఇండెక్స్(BMI) ఉన్న వ్యక్తులు తక్కువ వీర్యకణాల సంఖ్యతో బాధపడే అవకాశాలను ఎక్కువగా కలిగి ఉంటారని వైద్యులు చెబుతుంటారు. అందువలన బరువును BMI కి అనుగుణంగా నియంత్రించుకునేలా ప్రణాళికలు చేయడం ఉత్తమం. మరియు మీ వీర్యకణాల ఆరోగ్యకర స్థాయిలను తిరిగిపొందడంలో కూడా మార్పులను గమనించవచ్చు.

6. స్టెరాయిడ్లను తీసుకోవడం మానేయాలి :

మీరు మీ శరీరంలో మీ కండరాలను (మజిల్ బ్లాక్స్) నిర్మించడంలో భాగంగా స్టెరాయిడ్స్ మీద ఆధారపడుతున్నట్లైతే, అవి మీ పునరుత్పత్తి అవకాశాలను మందగింపజేయడంలో ప్రభావాన్ని కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి. టోన్డ్ బాడీని కలిగి ఉండటం లేదా పునరుత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడం అనే అంశాల మధ్య మీరు ఎంచుకోవలసి వస్తే, రెండవదే సముచితమైన ఎంపికగా ఉంటుందని, మీకు కూడా తెలియనిదికాదు.

7. సుదీర్ఘ వేడి నీళ్ళ స్నానాలను మరియు సుదీర్ఘ ఆవిరి స్నానాలను మానుకోండి

వీర్యకణాలు ఉత్పత్తి అయ్యే మీ స్క్రోటమ్ లేదా వృషణాలలో, అవి సమర్థవంతంగా పనిచేయడం కొరకు శరీర ఉష్ణోగ్రత కంటే 1 డిగ్రీ తక్కువగా ఉండవలసి ఉంటుంది. ఎక్కువ సమయంపాటు బిగుతైన ప్యాంట్లను, లేదా బిగుతైన లోదుస్తులను ధరించడం వంటి వాటితో సహా అధిక ఉష్ణోగ్రతలకు గురిచేసే అంశాలు ఏవైనా, వాటిని మీరు పరిహరించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. క్రమంగా సుదీర్ఘ వేడి నీళ్ళ స్నానాలను మరియు సుదీర్ఘ ఆవిరి స్నానాలను మానుకోమని సూచించడం జరుగుతుంది.

8. మరీ తరచుగా సెక్సులో పాల్గొనకుండా చూసుకోవాలి

ప్రతి రోజూ సెక్స్ చేయడం మూలంగా, మీ వీర్యకణాల ఆరోగ్యానికి హానికరంగా ఉండవచ్చు. క్రమంగా వీర్యకణాల ఉత్పత్తి, నాణ్యతమీద ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు. కావున, రోజు దాటి రోజులో ఒకసారి సెక్స్లో పాల్గొనడం ఉత్తమంగా నిపుణులు సూచిస్తున్నారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

A diet rich in processed foods, sugar and unhealthy fats can lead to a significant decrease in your sperm count. Add to that, a sedentary lifestyle can further deplete your sperm count and the quality of your sperm. Making some necessary changes in our diet and lifestyle to include some sperm boosting foods and exercises is certain to do you good.