పురుషాంగం క్యాన్సర్ గురించి తెలుసా? అంగాన్ని అలా ఉంచుకోకండి, ఆ విషయంలో చాలా జాగ్రత్త అవసరం

అంగానికి వచ్చే క్యాన్సర్ కు సంబంధించి పెద్దపెద్దవైద్యులకు కూడా సరైనా కారణాలు తెలియవు. పురుషాంగం కొన బాగా నున్నగా సున్నితంగా ఉంటుంది. అయితే దాన్ని క్లీన్ చేసే విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు.


మనం చాలా రకాల క్యాన్సర్ల గురించి విని ఉంటాం. అయితే పురుషాంగం క్యాన్సర్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. పురుషాంగం క్యాన్సర్ చాలా ప్రమాదకరం. అయితే ఇది వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ.

పురుషాంగం క్యాన్సర్ ని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స అందిచవచ్చు. అలాగే రోగం కూడా నయం అవుతుంది. మనదేశంలో పురుషాంగం క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య కాస్త తక్కువే ఉన్నా యూఎస్ లో మాత్రం ప్రతి ఏడాది దాదాపు 2,100 మందికి మనుషులు పురుషాంగం క్యాన్సర్ బారిన పడుతున్నారని తేలింది.

పురుషాంగం క్యాన్సర్ కు కారణాలు

అంగానికి వచ్చే క్యాన్సర్ కు సంబంధించి పెద్దపెద్ద వైద్యులకు కూడా సరైనా కారణాలు తెలియవు. పురుషాంగం కొన బాగా నున్నగా సున్నితంగా ఉంటుంది. అయితే దాన్ని క్లీన్ చేసే విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు.

చిన్నచిన్న కురుపులు

అక్కడ ఒక్కోసారి చిన్నచిన్న కురుపులు వస్తుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే ఒక్కోసారి క్యాన్సర్ కారకాలుగా మారుతాయి. హెచ్ పీవీ (హ్యూమన్ పాపిల్లోమావైరస్) వల్ల కూడా కొందరు వ్యక్తులు పురుషాంగం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది.

వయస్సు ఎక్కువైన వాళ్లు

ఈ రకమైన క్యాన్సర్ బారిన దాదాపు 60 సంవత్సరాలు పైబడిన వారే పడే అవకాశం ఉంది. ఎక్కువగా పొగతాగే వారు, రోగనిరోధక శక్తి సరిగ్గా లేని వారు ఈ రకమైన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

Most Read :అంగం బాగా గట్టిపడి గంటల తరబడి సెక్స్ చేయాలంటే ఏం చేయాలి?

పురుషాంగం క్యాన్సర్ లక్షణాలు

పురుషాంగం మీద ఉండే చర్మం మొత్తం కాస్త మందంగా మారడం లేదంటే రంగు మారుతుంది. అలాగే పురుషాంగం లంప్ మాదిరిగా తయారవుతుంది. అలాగే పురుషాంగపై చిన్నచిన్న గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవి కాస్త నొప్పిగా ఉండే అవకాశం ఉంది. అలాగే పురుషాంగం నీలం గోధుమ రంగులోకి మారుతుంది.

వాసన

పురుషాంగం నుంచి ఒకరకమైన వాసన వచ్చే అవకాశం ఉంది. అలాగే అంగం నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఈ లక్షణాలుంటే మాత్రం మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి.

పరీక్షలు

అలాగే ఎక్స్ రేస్, సీటీ స్కానింగ్స్, అల్ట్రాసౌండ్స్, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ వంటి పరీక్షలన్నీ చేయించుకోండి. దాన్ని బట్టి మీరు క్యాన్సర్ బారిన పడ్డారో లేదో తెలుసుకునే అవకాశం ఉంది.

Most Read :పురుషాంగం పోయింది.. కృత్రిమ అంగం కల్పించుకున్నాడు.. వందలాది మంది సెక్స్ ఆఫర్ ఇచ్చారు

చికిత్స :

ఒక వేళ మీరు పురుషాంగం క్యాన్సర్ మొదటి దశలో ఉంటే కొన్ని రకాల చికిత్సల ద్వారా దాన్ని నయం చేసుకోవడానికి అవకాశం ఉంది.

- పురుషాంగంపై డాక్టర్లు చెప్పే క్రీమ్ ఒకటి పూసుకోవాల్సి ఉంటుంది.

- అలాగే క్రయోథెరపీ ద్వారా కూడా ఈ రోగాన్ని నయం చేయొచ్చు. క్యాన్సర్ కణజాలాలలను ఇది పూర్తిగా నాశనం చేయగలదు.

- మొహ్స్ సర్జరీ ద్వారా కూడా క్యాన్సర్ ప్రభావిత చర్మాన్ని తొలగించుకోవొచ్చు.

- లేజర్ చికత్స ద్వారా పురుషాంగ క్యాన్సర్ ని నయం చేసుకోవొచ్చు. క్యాన్సర్ మరింత భాగానికి వ్యాపించకుండా నివారించొచ్చు.

- క్రిక్యూమ్ షన్ ద్వారా కూడా క్యాన్సర్ ను నివారించొచ్చు.

కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే

ఒక వేళ మీ పురుషాంగం క్యాన్సర్ కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రేడియోధార్మికత లేదంటే కీమోథెరపీ ద్వారా రోగాన్ని నయం చేసుకోవొచ్చు. పెనోక్టమీ అనే చికిత్స ద్వారా కూడా పురుషాంగ క్యాన్సర్ ను తగ్గించుకోవొచ్చు. అయితే ఈ చికిత్స విధానంలో

మీ పురుషాంగం దగ్గర ఉండే కొన్ని భాగాలను కట్ చేసే అవకాశం ఉంది.

నయం చేసేందుకు

చాలా మంది సైంటిస్ట్ లు పురుషాంగం క్యాన్సర్ ని ఎలా నయం చేయాలనే విషయాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పురుషాంగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంగం దగ్గర ఏవైనా కురుపులు లేదంటే వాపు, నొప్పి లాంటిది ఏర్పడినప్పువు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పురుషాంగంతో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఉండడం మంచిది.

Most Read :పురుషాంగం అంత పెద్దగా ఉంటేనే అందులో సంతృప్తి పొందుతారా?

అంగం బాగా గట్టిపడి గంటల తరబడి సెక్స్ చేయాలంటే ఏం చేయాలి?

~

English Summary

We are discussing here, how to started this Penile Cancer and that symptoms, treatments and effects also. you should know this.