గర్భం దాల్చినప్పుడు తలెత్తే మైగ్రేన్ సమస్యలు : సురక్షితమైన మందులు, చిట్కాలు, మరియు నొప్పితో వ్యవహరించే విధానాల గురించిన పూర్తి వివరాలు.

గర్భం దాల్చినప్పుడు తలెత్తే మైగ్రేన్ సమస్యలు : సురక్షితమైన మందులు, చిట్కాలు, మరియు నొప్పితో వ్యవహరించే విధానాల గురించిన పూర్తి వివరాలు.


శిశువుకు సరైన పెరుగుదల మరియు అభివృద్ధిపరంగా వారి శరీరాల్లో జరిగే మార్పుల కారణంగా మహిళలు గర్భధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ నొప్పులు ప్రసవం తర్వాతగానీ కొలిక్కిరావు. గర్భధారణ లక్షణాలు కాకపోయినా, కొందరు తల్లులు గర్భంతో సంబంధంలేని నొప్పులను భరించవలసి ఉంటుంది. ఉదాహరణకు మైగ్రేన్-నొప్పి. దీనిని పార్శ్వపుతలనొప్పి అని పిలుస్తారు.

Advertisement

మీరు మైగ్రెయిన్ నొప్పుల కారణంగా బాధపడుతున్నట్లయితే, మీ గర్భధారణ సమయంలో కొన్ని తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఎందుకంటే తరచుగా ఎదుర్కొనే తలనొప్పి, గర్భానికి సురక్షితంకాని తలనొప్పికి తీసుకునే మందులు వంటి అంశాల మద్య గందరగోళం నెలకొంటుంది. కావున ఈనొప్పులను తగ్గించుకునే క్రమంలో భాగంగా సహజనివారణా పద్ధతులనే అనుసరించడమే మేలు. ఇక్కడ ఈ వ్యాసంలో మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు పాటించవలసిన సురక్షిత పద్దతుల గురించిన పూర్తి వివరాలను పొందుపరచడం జరిగింది.

Advertisement

గర్భధారణ సమయంలో మైగ్రేన్ నొప్పి:

పార్శ్వపు తలనొప్పి తగ్గుదలకు సహాయపడే మందులు అనేకం ఉన్నప్పటికీ, ఈ మందులు గర్భధారణ సమయంలో తీసుకోవడం సురక్షితం కాదు. పైగా ఇటువంటి మందుల వాడకం గర్భస్రావ పరిస్థితులకు కూడా దారితీస్తుంది.

మైగ్రెయిన్ తలనొప్పితో బాధపడుతున్న మహిళలు వాటి లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి అనేక చిట్కాలు అందుబాటులోనే వున్నాయని తెలుసుకోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. నొప్పితో భాదపడేవారికి అన్నిమార్గాలు మూసుకుపోయిన భావన కలుగుతుంటుంది. దీనికి కారణం తక్షణ నివారణా చిట్కాల గురించిన అవగాహన తక్కువగా ఉండడమే. కానీ, ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిట్కాలు మీ మైగ్రేన్ సమస్యకు ఉపశమనంగా ఉంటాయి. అయినప్పటికీ, గర్భధారణ సమయంలో మైగ్రెయిన్ యొక్క కారణాన్ని అర్థం చేసుకోవడం అత్యంత కీలకమైన అంశం. మైగ్రేన్ తలెత్తడానికి, అనేక ఇతర అంశాలు కూడా కారణం కావొచ్చు. వీటిని తెలుసుకోవడం ద్వారా, వాటిని నివారించడం సులభం అవుతుంది.

మైగ్రెయిన్స్ తరచూ అనేక కారణాల వలన ప్రేరేపించబడతాయి.

మైగ్రెయిన్స్ తరచూ అనేక కారణాల వలన ప్రేరేపించబడతాయి. కొంతమంది వ్యక్తులు మైగ్రేన్ ప్రేరేపించే కొన్ని కారకాలపరంగా సున్నితత్వాన్ని పుట్టుకతోనే కలిగి ఉంటారని చెప్పబడింది. ఉదాహరణకు, ధ్వని, దుమ్ము కాలుష్యం, కాంతి, వాతావరణ పరిస్థితులు, అధిక వేడి, అధిక చల్లదనం, ఆహార పదార్ధాలు, ఆరోగ్య పరిస్థితులు మొదలైనవి.

గర్భధారణ సమయంలో మైగ్రేన్లను ప్రేరేపించే కొన్ని ప్రాథమిక అంశాలు:

1. హార్మోన్ల హెచ్చుతగ్గులు:

ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను, మైగ్రేన్లను ప్రేరేపించే ట్రిగ్గర్స్ అని వ్యవహరిస్తుంటారు. క్రమంగా ఈ హార్మోన్ హెచ్చుతగ్గుల ఫలితంగా మహిళలు గర్భం, ఋతుస్రావం మరియు రుతువిరతి సమయంలో తరచుగా పార్శ్వపునొప్పిని ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాకుండా, పురుషుల కంటే స్త్రీలలోనే అధికంగా మైగ్రేన్లు కనిపిస్తాయి.

మరొక న్యూరోట్రాన్స్మిటర్ సెరటోనిన్ హార్మోన్ కూడా మైగ్రేన్ల వెనుకగల ప్రధానకారణంగా కనిపిస్తుంది. సెరోటోనిన్ యొక్క తక్కువ స్థాయిలు తరచుగా కలిగే మైగ్రెయిన్ నొప్పితో సంబంధం కలిగి ఉంటుంది. మీరు భావోద్వేగపరంగా హెచ్చుతగ్గులకు గురవుతున్న సమయాల్లో, మైగ్రేన్లు కలగడానికి కారణం అదే.

2. ఒత్తిడి హెచ్చుతగ్గులు:

రక్తపోటులోని హెచ్చుతగ్గులు కూడా మహిళలలో అధికంగా మైగ్రెయిన్లను ప్రేరేపిస్తాయి. రక్తపోటు పెరుగుదల మెదడులోని నరాలను నిరోధిస్తుంది మరియు రక్తప్రవాహాన్ని సైతం నియంత్రిస్తుంది. అంతేకాకుండా, గర్భధారణలో ప్రీక్లాంప్సియా యొక్క హెచ్చరిక గుర్తుగా అధిక రక్తపోటుతో కూడిన మైగ్రేన్ నొప్పి ఉంటుంది. కావున మైగ్రేన్ విషయంలో అజాగ్రత్త తగదు.

Most Read:ఈ 7రకాల రోజూవారీ ఆహార పదార్ధాలు సహజ సిద్దమైన రోగనిరోధకతత్వాలను కలిగి ఉంటాయని తెలుసా?

3. కండరాల నొప్పులు:

గర్భధారణ సమయంలో కండరాల నొప్పులు సర్వసాధారణం. మన శరీరంలోని కండరాలు పెరుగుతున్న శిశువుకు తగినట్లుగా మార్పులు చెందుతూ ఉంటాయి. క్రమంగా కండరాలలో ఒత్తిడి పెరగడం మూలంగా, కండరాల నొప్పి కలుగుతుంటుంది. మన శరీరం కండరాలలో సెరోటోనిన్ను సైతం రహస్యంగా ప్రేరేపిస్తుంది. ఇది మైగ్రేన్ నొప్పికి దారితీస్తుంది.

4. ఇతర ట్రిగ్గర్లు:

మైగ్రెయిన్స్ నొప్పికి గల కారణం వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉన్నప్పటికీ, ఇతర సాధారణ ట్రిగ్గర్లుగా చాక్లెట్, కెఫిన్, వాతావరణం, ప్రాసెస్డ్ ఫుడ్(నిల్వ ఉంచిన ఆహార పదార్దాలు) లేదా ఒత్తిడి వంటి కారకాలు కూడా ఉంటాయి. మీరు ఒక నిర్దిష్ట ఆహారం పట్ల సెన్సిటివిటీ కలిగి ఉన్నట్లయితే, ఆ ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మైగ్రెయిన్ నొప్పిని ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉంటాయి. అధికమైన గాలి లేదా మంచు వంటి వాతావరణ పరిస్థితులు కూడా మైగ్రేయిన్ కారకం కాగలదు.

మీరు గర్భధారణ సమయంలో మైగ్రెయిన్ సంబంధిత ఔషధాలను తీసుకోవచ్చా?

సాధారణంగా, పార్శ్వపు నొప్పి ఎదుర్కొన్న ప్రతిసారీ, ఒక నిర్దిష్టమైన ఔషదాన్ని ఎన్నుకోవడం పరిపాటిగా ఉంటుంది అనేకులకు. ఉదాహరణకు యాస్పిరిన్ లేదా ఇబుప్రోఫెన్ వంటి మందులను ఎక్కువగా అనుసరిస్తుంటారు. కానీ, ఇవి గర్భస్థ పిండానికి తీవ్రసమస్యలను కలిగించేవిగా ఉంటాయి. కావున ఈ నాన్-స్టెరాయిడల్ యాంటీఇన్ఫ్లమేటరీ మందులను తప్పించవలసిన అవసరం ఉంది. ఆస్పిరిన్ గర్భధారణ సమయంలో తీసుకున్న ఎడల గర్భస్రావాలకు కారణమవుతుంది. ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో, ఇది శిశువుకు హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

మరొక వైపు, సాధారణంగా టైలెనాల్ అని పిలవబడే అసిటమినోఫెన్ వంటి మందులు, గర్భధారణ సమయంలో ఉపయోగించడానికి సురక్షితంగా భావిస్తారు. అయితే, మీ వైద్యుడి సలహా ప్రకారమే తీసుకోవడం మంచిది. స్వీయనిర్ణయాలు క్లిష్టపరిస్థితుల్లో ప్రమాదాలకు దారితీస్తాయని మరువకండి.

Most Read:పెళ్లయినా శోభనం కావడం లేదు, ముట్టుకుంటే కందిపోయే పెళ్లాం ఉన్నా ఏమీ చెయ్యలేకపోతున్నా #mystory311

గర్భధారణ సమయంలో మైగ్రెయిన్లను ఎలా నిర్వహించాలి?

మీరు మీ పుట్టబోయే బిడ్డకు హాని కలిగించే మందులను తీసుకోకూడదు అని నిర్ధారించుకున్న ఎడల, మీ మైగ్రేన్లను ఎటువంటి మందులను వినియోగించకుండానే సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఇక్కడ మందులు జోక్యం లేకుండా గర్భధారణ సమయంలో మీ మైగ్రెయిన్స్ నిర్వహించడానికి సూచించదగిన కొన్ని సురక్షితమైన మరియు ప్రభావవంతమైన మార్గాలను పొందుపరచబడినవి.

1. మీ ట్రిగ్గర్ను గుర్తించండి:

పార్శ్వపు నొప్పిని నివారించడానికి మీరు తీసుకోవలసిన మొదటిదశ, దాని ప్రధాన కారణం(ట్రిగ్గర్) గుర్తించడం. కండరాల నొప్పి, లేదా నిలకడలేని రక్తపోటు స్థాయిలు ఏదైనాసరే, మీ ట్రిగ్గర్స్ మూల కారణాన్ని గుర్తించడం ద్వారా మీరు సగం సమస్యను పరిష్కరించిన వారవుతారు. మీ సమస్యల గురించి ఒక డైరీ నిర్వహించడం ద్వారా, మీ మైగ్రెయిన్స్ వెనుక గల ఖచ్చితమైన కారణాలు లేదా పరిస్థితులను కనుగొనడానికి సహాయపడుతుంది.

2. చల్లని టవల్ ఉపయోగించడం లేదా చల్లటి నీటితో షవర్-బాత్:

ఈ పరిష్కారం, ఈ మీతలలోని నరాల విశ్రాంతికి మరియు నొప్పి ఉపశమనానికి మీకు అత్యుత్తమంగా సహాయం చేస్తుంది. నొప్పికి స్పర్శరహిత భావాన్ని అందించగలగడం ద్వారా, ఉపశమనాన్ని ఇవ్వగలదు. మీరు చల్లని నీటిపట్ల అసౌకర్యం భావిస్తున్న ఎడల, గోరువెచ్చని నీటిని అనుసరించవచ్చు. వేడినీటి స్నానం మీ కండరాలకు విశ్రాంతిని ఇవ్వడంతోపాటు, మైగ్రేన్ నొప్పి తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.

Most Read:నా భార్యతో ఇబ్బందిపడుతున్నా, బెడ్రూమ్ లో నాకు చుక్కలు కనపడతాయి, శృంగార కోర్కెలు ఎక్కువ

3. వ్యాయామం:

వ్యాయామం మీ శరీరంలో ఫీల్-గుడ్ హార్మోన్ అయిన ఆక్సిటోసిన్ హార్మోన్ను పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఒక సహజసిద్దమైన పెయిన్-కిల్లర్ వలె పనిచేస్తుంది మరియు పార్శ్వపునొప్పిని తగ్గిస్తుంది. అయితే, గర్భధారణ సమయంలో సురక్షితమైన వ్యాయామ పద్ధతులనే అనుసరించాలి. కావున, వ్యాయామాలు అనుసరించాలని భావిస్తున్న ఎడల మంచి వ్యాయామ నిపుణుని మీవైద్యుని సూచన ప్రకారం సంప్రదించడం మేలు.

4. నిద్ర:

నిద్రలేమి కూడా మైగ్రేన్ నొప్పికి ప్రధాన కారకంగా ఉంటుంది. కావున నిద్రకు సమయం కేటాయించడం, మీ నొప్పిని ప్రేరేపించే ఒత్తిడిని తగ్గించి ఉపశమనాన్ని ఇవ్వడంలో సహాయపడుతుందని మరువకండి.

~

English Summary

Migraines are headaches which are caused due to the blood vessels dilating in our brain. Women experience frequent migraine attacks during pregnancy, menstruation and menopause because of hormonal fluctuations. Taking a cold shower, doing the right form of exercise, having enough sleep can help reduce migraine during pregnancy.