భార్యాభర్తల మధ్య శృంగార జీవితం ఎంత సంతృప్తిగా ఉంటే వారి మధ్య భావోద్వేగ బంధం అంత బలంగా ఉంటుంది. అందుకే పడక గదిలో వారి ప్రత్యేక సమయాన్ని సంపూర్ణంగా, సంతోషంగా ఆస్వాదించాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో ఇద్దరిలో ఏ ఒక్కరూ అసౌకర్యానికి గురైనా, సంతృప్తి చెందకపోయినా ఒకరకమైన మనస్తాపానికి గురవుతారు. ముఖ్యంగా పురుషుల్లో దీనికి సంబంధించి కొన్ని సందేహాలు వారి శృంగార జీవితంపై ప్రభావం చూపిస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు.

సాధారణంగా భాగస్వామితో కలయిక సమయంలో ఎంత సేపు శృంగారం చేయవచ్చు.. స్కలనం ఎంతసేపటికి అవుతుందనే దానిపై పురుషుల్లో చాలా సందేహాలు నెలకొంటాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందే కొన్ని అపోహలను నమ్మి.. భాగస్వామితో సంతోషంగా గడపలేకపోతుంటారు. తమలో ఏదో లోపం ఉందని భావిస్తూ మనస్తాపానికి గురై భార్యతో దూరంగా ఉంటూ లోలోపల కుంగిపోతుంటారు. అయితే పురుషుడు సాధారణంగా ఎంతసేపు శృంగారం చేస్తే ఆరోగ్యకరంగా భావించాలి.. భాగస్వామితో సంతోషంగా ఉండాలంటే ఎలా.. వారిలో నెలకొన్న సందేహాలకు పరిష్కారాలేంటి.. వైద్య నిపుణుల సలహాలు చూద్దాం..

కామసూత్ర రహస్యాలు..శృంగారంలో మీ భాగస్వామికి స్వర్గసుఖాలు పరిచయం చేయండిలా!

శృంగారానికి సగటు సమయం

సాధారణంగా పురుషుల్లో ఆరోగ్యకరమైన శృంగార సగటు సమయం 5 నిమిషాల 24 సెకన్లు మాత్రమే. ఆ తర్వాత వీర్య స్కలనం జరిగినట్లయితే వారిలో ఏ సమస్యా లేనట్లేనని భావించాలి. 10 నుంచి 30 నిమిషాల పాటు కలయికలో ఉండాలనేది అపోహ మాత్రమే. ఈ అపోహను నమ్మి అనవసరంగా ఆందోళన పెంచుకుని మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఇద్దరి మధ్యా అవగాహన, ఒకరినొకరు సంతృప్తిగా గడపాలని భావిస్తే 5 నిమిషాల కంటే ఎక్కువ సమయమూ శృంగారంలో గడపగలరు. ఐదు నిమిషాలు అంతకంటే ఎక్కువసేపు మీరు భాగస్వామితో కలయికలో ఉండగలుగుతున్నారంటే మీరు ఆరోగ్యకరంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి.

శీఘ్ర స్కలనం

ఇక, కొందరిలో శీఘ్ర స్కలనం సమస్య ఉంటుంది. అసలు ఈ శీఘ్ర స్కలనం అంటే సగటు సమయం లోపే వీర్యం బయటకు వచ్చేయడం. కొందరిలో కలయిక ప్రారంభించిన మొదటి రోజు నుంచే ప్రతి నిమిషం లోపు స్కలనం అవుతుంది. మరికొందరిలో మొదట్లో బాగానే ఉన్నా క్రమంగా 3 నిమిషాల లోపు వీర్యం బయటకు వచ్చేస్తుంది. ఈ పరిస్థితి ద్వారా కలయికలో భాగస్వామి కొంచెం అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు!

శీఘ్ర స్కలనానికి కారణాలు

పురుషుల్లో థైరాయిడ్‌, డయాబెటిస్‌, ఇన్‌ఫెక్షన్‌, మానసిక ఒత్తిడి, ఆందోళన ఉన్నట్లయితే శీఘ్ర స్కలనం సమస్యకు దారితీస్తుంది. కలయిక సమయంలో మీరు ఈ సమస్యను పదేపదే ఎదుర్కొంటున్నా, ఇద్దరూ ఇబ్బంది పడుతున్నా, అకస్మాత్తుగా ఇలా జరుగుతున్నా నిర్లక్ష్యం చేయకూడదు. యూరాలజిస్టు లేదా ఆండ్రాలజిస్టును కలిసి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి.

మీరూ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే మనస్తాపానికి, ఒత్తిడికి గురి కాకుండా భాగస్వామితో చర్చించండి. ప్రాబ్లమ్‌ ఎక్కడుందో అర్థం చేసుకుని వైద్య నిపుణుల సలహాలు పాటించి భార్యతో బంధాన్ని మరింత బలంగా మార్చుకోండి. అంతకాని అపోహలు నమ్మి, నకిలీ ప్రొడక్ట్స్‌ వాడుతూ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసుకోకండి.