పెళ్లికి సిద్ధమవుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు తప్పనిసరిగా తమకు కాబోయే భాగస్వామి చదువు, గుణగణాలు, సంపాదనతో పాటు ఒక ముఖ్యమైన విషయాన్ని పరిశీలిస్తారు. అదే వయసు. తమ ఇద్దరి మధ్య ఎంత ఏజ్‌ గ్యాప్‌ ఉంటుంది.. అనేది తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే ఒక్కొక్కరికి ఏజ్‌ గ్యాప్‌ విషయంలో ఒక్కో ఒపీనియన్‌ ఉంటుంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఎంత ఏజ్‌ గ్యాప్‌ ఉండాలి.. వయసు తేడా ఆధారంగా వారి మధ్య ప్రవర్తన ఎలా ఉంటుందనేదని రిలేషన్‌షిప్‌ ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు.

Advertisement

మూడేళ్ల లోపు వయసు తేడా

Advertisement

భార్యాభర్తలు ఒకే వయసు లేదా వారి మధ్య మూడేళ్ల లోపు ఏజ్‌ గ్యాప్‌ ఉంటే.. ఇద్దిర ఆలోచనలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఒకే జనరేషన్‌ ఫీలింగ్‌ ఉంటుంది. వారి మధ్య ఫ్రెండ్‌షిప్‌, బాండింగ్‌ ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఆసక్తి, ఎనర్జీ లెవెల్స్‌ బాగుంటాయి.

ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.?

కానీ.. అనుభవ లేమి కారణంగా ఒక్కోసారి పరిపక్వత లేని నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గరి వయసు కావడంతో ఇద్దరి మధ్యా ఈగో తలెత్తే అవకాశం, ఫలితంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల పరంగానూ సెటిల్‌ అయ్యే అవకాశం తక్కువ.

Advertisement

మూడు నుంచి ఏడేళ్లు

ఇద్దరి మధ్యా మూడేళ్ల నుంచి ఏడేళ్ల ఏజ్‌ గ్యాప్‌ అనేది ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం. దంపతుల మధ్య ఈ ఏజ్‌ గ్యాప్‌ బ్యాలెన్స్‌డ్‌గా భావిస్తారు. ఇద్దరి మధ్యా మెచ్చూరిటీ, అండర్‌స్టాండింగ్‌ లెవెల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఎమోషనల్‌గా సపోర్ట్‌గా కూడా ఉంటారు.

కానీ జనరేషన్‌ డిఫరెన్స్‌ కారణంగా కొన్ని మనస్పర్థలు రావచ్చు. ఒకరిపై మరొకరికి అంచనాల్లో తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఎనిమిది నుంచి పదిహేనేళ్ల గ్యాప్‌

భార్యాభర్తల మధ్య 8 నుంచి 15 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉంటే పరిపక్వత అనేది స్థిరంగా ఉంటుంది. కుటుంబానికి, వ్యక్తిగతంగా సంబంధించి బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరంగా సెటిల్‌ అయ్యి ఉంటారు.

Advertisement

అయితే జనరేషన్‌ గ్యాప్‌ కారణంగా ఇద్దరి మధ్యా ఆసక్తుల్లో తేడాలు రావచ్చు. ఎనర్జీ లెవెల్స్‌ సరిపోలవు. సమాజంలో స్నేహాలు, సర్కిల్స్‌లోనూ డిఫరెన్సెస్‌ ఉంటాయి.

కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.?

15- 30 ఏళ్ల గ్యాప్‌

దంపతుల మధ్య 15 ఏళ్లకి మించి ఏజ్‌ గ్యాప్‌ ఉంటే ఒకరిపై ఒకరికి మెచ్యూరిటీ గైడెన్స్‌, సపోర్ట్‌ ఎక్కువగా ఉంటుంది. జీవిత అనుభవం ఎక్కువగా ఉన్న కారణంగా ఎమోషనల్‌ సపోర్ట్‌ పొందుతారు. అయితే జనరేషన్‌ గ్యాప్‌లో విపరీతమైన తేడా కారణంగా ఆలోచనలు, ఫ్యూచర్‌ ప్లానింగ్‌లు మ్యాచ్‌ అవ్వవు. కుటుంబీకులు, సమాజం వీరి రిలేషన్‌షిప్‌ను ఆమోదించకపోవచ్చు.

Advertisement

కాగా, నిపుణుల సలహా ప్రకారం దంపతుల మధ్య 3 నుంచి ఏడేళ్ల గ్యాప్‌ ఉన్నట్లయితే దానిని బ్యాలెన్స్‌డ్‌గా భావిస్తారు. ఇద్దరి మధ్యా మంచి అండర్‌స్టాండింగ్‌, ఎమోషనల్‌ కనెక్షన్‌ ఉంటుంది. జీవిత లక్ష్యాల్లో సమతుల్యత పాటిస్తారు. అయితే విజయవంతమైన వివాహానికి ఏజ్‌ గ్యాప్‌ కంటే కూడా గౌరవం, నమ్మకం, కమ్యూనికేషన్‌, అర్థం చేసుకునే విధానం చాలా ముఖ్యం.