అరవింద పెళ్లాడతా అని తనకు మాటిచ్చాను, పెళ్లి చేసుకోమంటోంది, నా మైండ్ ఎప్పుడెలా ఉంటుందో #mystory301

అరవిందలాంటి అమ్మాయి నాకు దక్కడం నిజంగా నా అద్రుష్టం. ఆ అమ్మాయి చిటికేస్తే వందమంది క్యూలో ఉంటారు. కానీ ఏ ఒక్కరి వంక కూడా చూడదు. నాకు ఎలా పడిందో నాకే అర్థం కావడం లేదు. బహుశా ఆఫీస్ లో అందరూ నా టాలెంట్ ను


నేను చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్. నాకంటే ఎక్కువ ఒక్క మార్క్ క్లాస్ లో ఎవరికైనా వస్తే నేను అస్సలు తట్టుకోలేకపోయేవాణ్ని. కుమిలిపోయేవాణ్ని. బాగా మార్కులు వచ్చినప్పుడు నాకంటే తోపు ఎవరూ లేరని అనుకునేవాణ్ని.

Advertisement

ఒక్క మార్క్ తగ్గినా అంతే స్థాయిలో నిరుత్సాహానికి గురయ్యేవాణ్ని. అలా చిన్నప్పటి నుంచి నాలో మితిమీరిన ఆత్మవిశ్వాసం.. అలాగే నిరాశ నిస్పృహలతో సతమతం అవుతూ ఉంటాను.

Advertisement

ఒక అమ్మాయితో పరిచయం

నేను ఎంసీఏ చేశాను. క్యాంపస్ సెలక్షన్స్ లోనే జాబ్ కు సెలెక్ట్ అయిపోయాను. ఆఫీస్ లో నా వర్క్ ను చూసి ఫస్ట్ మంత్ లోనే నాకు ప్రమోషన్ వచ్చింది. నన్ను టీమ్ లీడర్ ను చేసేశారు. నా టీమ్ లో ఒక అమ్మాయితో నాకు పరిచయం ఏర్పడింది. తన పేరు అరవింద.

ఇంటలిజెంట్

అరవింద కూడా బాగా వర్క్ చేస్తుంది. తను కూడా నా మాదిరిగానే మంచి ఇంటలిజెంట్. ఆఫీస్ లో మా టీమ్ కు మంచి పేరుంది. ఈ క్రమంలో అరవింద ప్రేమలో పడ్డాను.

కొత్తగా అనిపించేవి

తన నవ్వు, తన మాటతీరు అన్నీ నాకు కొత్తగా అనిపించేవి. తనను చూస్తుంటే... తనతో మాట్లాడుతుంటే ఏదో కొత్త ప్రపంచంలో విహరిస్తున్నట్లు ఉండేది.

ప్రపోజ్ చేశా

దసరాకు తను ఆఫీస్ కు పట్టు లంగావోణిలో వచ్చింది. అంతే తన అందానికి ఫ్లాట్ అయిపోయాను. ప్రపోజ్ చేశాను. తను కూడా ఒకే అంది.

Most Read :ఆమెను కలిసేందుకు భర్తనే సహకరించేవాడు, అతనికి అసలు విషయం తెలిసి కలవకుండా చేశాడు #mystory300

వేరే రాష్ట్రం అమ్మాయి

నా మనస్సులోని మాట చెప్పినప్పటి నుంచి నాలో బుగులుపుట్టుకుంది. తనది వేరే క్యాస్ట్. నాది వేరే కులం. తన భాష, సంప్రదాయాలు కూడా వేరే. పూర్తిగా తను వేరే రాష్ట్రం అమ్మాయి.

నిన్నే పెళ్లాడతా

అలాంటి అమ్మాయితో నేను జీవితాంతం ఉండగలుగుతానా అని నాలో నేను సతమతం అవుతూ ఉన్నాను. మొదట నిన్నే పెళ్లాడతా అని తనకు మాటిచ్చాను. తర్వాత పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నాను.

ప్రాణం పోయినా సరే

ఒక్కోసారి నన్ను నమ్మిన అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయకూడదని అనుకుంటూ ఉంటాను. ప్రాణం పోయినా సరే తననే పెళ్లి చేసుకోవాలనుకుంటాను.

విరుద్దమైన మనుషులు

మరోసారి ఈ అమ్మాయిని కాకుండా మా ఇంట్లో చూసిన సంబంధానికి ఒకే అంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. ఇలా నాలో రెండు రకాల విరుద్దమైన మనుషులున్నారు.

Most Read :పట్టెమంచంపైనే ఫస్ట్ నైట్, నాకు ఏమేమీ కావాలో అన్నీ చేసింది, నన్ను మైమరిపించింది #mystory299

ఎవరికీ లేనంత శక్తి

ఈ విషయంలోనే కాదు నేను ప్రతి విషయంలో ఇలాగే సతమతం అవుతూ ఉంటాను. ఒక్కోసారి ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత శక్తి నాకు ఉంది అన్నట్లుగా ఫీలవుతాను. చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాను. రెండ్రోజుల తర్వాత మళ్లీ నేను ఏమీ చేయలేనని బాధ

పడుతుంటాను.

ఆత్మహత్య చేసుకుంటా

ఒక్కోసారి ఈ జాబ్ కాకుంటే ఊరికెళ్లి వ్యవసాయం చేసుకుని బతుకుతాను అనిపిస్తూ ఉంటుంది. మరోసారి జాబ్ పోతే నేను బతకలేక ఆత్మహత్య చేసుకుంటానేమోనని భయం వేస్తూ ఉంటుంది.

అమ్మాయిని బాధపెడుతున్నా

ఇలా రెండు రకాల మనసత్వాలతో నేను బాధపడటమే కాకుండా, నన్ను నమ్మిన అమ్మాయిని కూడా బాధపెడుతున్నాను. తను నన్ను నమ్మింది. నేను పెళ్లి చేసుకుంటాను అన్నందుకు నేను ఎలా చెబితే అలా చేసింది.

చిటికేస్తే వందమంది క్యూలో

అరవిందలాంటి అమ్మాయి నాకు దక్కడం నిజంగా నా అద్రుష్టం. ఆ అమ్మాయి చిటికేస్తే వందమంది క్యూలో ఉంటారు. కానీ ఏ ఒక్కరి వంక కూడా చూడదు. నాకు ఎలా పడిందో నాకే అర్థం కావడం లేదు. బహుశా ఆఫీస్ లో అందరూ నా టాలెంట్ ను పొగుడుతుంటే నాకు ఫ్లాట్ అయినట్లుంది.

Most Read :నా భార్య బొమ్మలా పడుకుంటుంది, నేను ఏమీ చేసినా తనలో ఎలాంటి ఫీలింగ్స్ రావు

పైట కింద అందాలన్ని

ఒక రోజు తన రూమ్ కు వెళ్లాను. తను అప్పుడే తలస్నానం చేసి జుట్టును టవల్ తో విదుల్చుకుంటుంది. ఎలాగో పెళ్లి చేసుకునేవాళ్లమే కదా అని తనను గట్టిగా హత్తుకున్నాను. ఏమీ అనలేదు. ఛాన్స్ వచ్చింది కదా అని తాను పైట కింద దాచిన అందాలన్ని బలవంతంగా చూశాను. ఏవేవో చేశాను.

చిన్న విషయానికి సతమతం

నేను పైకి చూడడానికి చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాను. ఏదైనా చేసేయను అన్నట్లుగా ఉంటాను. కానీ అంతరంగంలో నేను ప్రతి చిన్న విషయానికి సతమతం అవుతూ ఉంటాను. ఇది మానసిక రుగ్మత అని నాకు తెలుసు. దాని నుంచి బయటపడేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. కానీ నా వల్ల కావడం లేదు.

నా వల్లే నాశనం

నాలో ఉండే రెండు రకాల మనుషుల వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులొచ్చినా సరే నేను తట్టుకోగలను. కానీ నన్నే నమ్మిన అమ్మాయి జీవితం నా వల్లే నాశనం అవుతుంటే ఎలా చూస్తూ ఉండాలో అర్థం కావడం లేదు.

ఆవేశంగా మాటిచ్చాను

తనని పెళ్లి చేసుకుంటానని ఆవేశంగా మాటిచ్చాను. అన్ని రకాలుగా వాడుకున్నా. కానీ ఇప్పుడు చేసకోవాలంటే భయం వేస్తుంది. వణికిపోతున్నా. తను ఫోన్ చేసినా కూడా మాట్లాడలేకపోతున్నా. తను వెంటపడుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. నా సమస్యకు మీరే సమాధానం చెప్పండి.

~

English Summary

I keep changing my mind about everything