పెద్దమనిషయ్యాక ఈ ఫిగర్ భలే తయారైంది, దాని వైపే అందరి చూపు, పుష్పవతి ఫంక్షన్ తో ఇబ్బందులు #mystory232


నాకు అప్పుడు 14 ఏళ్ల వయస్సు. తొమ్మిదో తరగతి చదువుతున్నాను. ఆ రోజు ఉదయం నాకు చాలా నలతగా అనిపించింది. నా శరీరంలో ఏదో కొత్తగా మార్పు వచ్చిందనిపించింది. తర్వాత అమ్మకు అసలు విషయం చెప్పాను. మా అమ్మ నన్ను ఆ రోజు స్కూల్ కు వెళ్లొద్దని చెప్పింది. మా అమ్మ నన్ను ఇంట్లో ఒక మూలన కూర్చోబెట్టింది. ఎక్కడికి వెళ్లకూడదని చెప్పింది.

మొదట నాకు భయం వేసింది. అసలు ఏమైంది నాకు అనిపించింది. మా అమ్మ నాకు ఆ విషయం గురించి పెద్దగా చెప్పలేదు. కానీ నాపై ఎంతో కేర్ తీసుకుంది. తర్వాత తెలిసింది. అది నా మొట్టమొదటి నెలసరి కావడం వల్లే మా అమ్మ అంత కేర్ తీసుకుందని.

పెద్దమనిషిని అయ్యాను

ఆ రోజు నేను పెద్దమనిషిని అయ్యాను. మరుసటి రోజు ఈ విషయాలన్ని మా ఇంట్లో వారు మా బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పారు. మా ఊర్లో వారందిరికీ ఇంటింటికి వెళ్లి చెప్పి వచ్చారు. నాకు అప్పుడు ఏదోలా అనిపించింది. మా వాళ్లకేమైనా పిచ్చా.. అందరికీ ఈ విషయం చెప్పాలా అని అనిపించింది.

సిగ్గుగా అనిపించింది

తర్వాత మా ఇంట్లో పెద్ద వేడుక నిర్వహించారు. చాలా మంది వచ్చారు. వారందరినీ చూస్తే నాకు సిగ్గుగా అనిపించింది. ఈ విషయాన్ని కూడా పది మందికి చెప్పాలా అనిపించింది. నేను పెద్దమనిషిని అయ్యానని ఊరంతా తెలిసింది. తర్వాత రోజు నుంచి నాకు బయటకు వెళ్లాలంటే సిగ్గుగా ఉండేది.

అబ్బాయిలకు తెలిసిపోయింది

దాదాపు పన్నెండు రోజుల పాటు స్కూల్ కు కూడా వెళ్లలేదు. స్కూల్ లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు నేను పెద్దమనిషిని అయ్యాననే విషయం తెలిసిపోయింది. ఇంట్లో నన్ను చాలా రోజుల పాటు స్నానం రోజుల పాటు కూడా చేయనివ్వలేదు. పది రోజుల తర్వాత బంధువులంతా వచ్చాక పెద్ద వేడుక నిర్వహించారు.

ఊరంతా చెప్పాల్సిన అసవరం ఏముంది

అయినా పుష్పవతి అయితే అంత ఆర్భాటం అవసరమా? అనేది నా సందేహం. నేను పెద్ద‌మ‌నిషిని అయిన విషయం ఊరంతా చెప్పాల్సిన అసవరం ఏముంది? అలాగే ఇంట్లో పది రోజుల పాటు నరకంలాగా ఉంటుంది. రోజూ స్కూల్ కు వెళ్లి ఫ్రెండ్స్ తో సరదాగా గడిపే నన్ను అలా బంధించినప్పుడు ఏడ్చాను. కానీ నా బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు.

చాలా డబ్బు ఖర్చు చేశారు

ఆ రోజు మా ఇంట్లో నిర్వహించిన ఫంక్షన్ కు చాలా డబ్బు ఖర్చు చేశారు. ఆ డబ్బునంతా అలా వేస్ట్ చేసే బదులు నా చదువుకు ఉపయోగిస్తే ఎంత మేలు అని అనిపించింది. అసలు ఎందుకంతా ఫంక్షన్ చేస్తున్నారనే విషయం కూడా నాకు ఆ వయస్సులో తెలియదు.

మీ పిల్లకు పెళ్లి ఎప్పుడు

ఇక మా ఇంటి పక్కన అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు ఎక్కువ ఖర్చు చేశారని మా వాళ్లు వాళ్లకు పోటీపడి ఖర్చు చేశారు. పుష్పవతి అయ్యారంటే చాలు బంధువులంతా కూడా మీ పిల్లకు పెళ్లి ఎప్పుడు అంటుంటారు. పెద్దమనిషి అయి తొమ్మిదేళ్లు, పదేళ్లు అవుతుంది ఇంకా పెళ్లి చేయరా మీరు అని వెటకారంగా మాట్లాడుతుంటారు.

పెద్దమనిషయ్యాక భలే తయారైంది

అసలు నాకు ఆ ఫంక్షనే చేయకుండా ఉండి ఉంటే వీళ్లంతా నా గురించి ఇలా మాట్లాడుకునేవారు కాదు కదా అని అనిపిస్తూ ఉంటుంది. పుష్పవతి అయ్యాక ఊర్లోని చాలా మంది పోరంబోకులు నేను స్కూల్ కు వెళ్తుంటే రకరకాల కామెంట్స్ చేసేవారు. ఈ ఫిగర్ పెద్దమనిషయ్యాక భలే తయారైంది అని అనేవారు. నా మెడకింద భాగం వైపునకే అందరి చూపు వెళ్లేది. నాకు ఊర్లోకి వెళ్లాలంటే భయం వేసేది.

నాకు పెళ్లయ్యింది కూతురుంది

నాకు అసలు ఆ ఫంక్షనే ఇష్టం లేదు కానీ ఆ రోజు మా ఇంటికి మా స్కూల్ టీచర్లను, నా క్లాస్ మేట్స్ మొత్తాన్ని పిలిచారు. పెళ్లి చేసినట్లుగా ఆ ఫంక్షన్ చేశారు. అప్పు చేసి మరీ గ్రాండ్ గా వేడుక నిర్వహించారు. నాకు పెళ్లయ్యింది. నాకు ఒక కూతురుంది. కానీ నేను మాత్రం నా కూతురికి ఇలాంటి ఫంక్షన్స్ అస్సలు నిర్వహించను. తనను ఇబ్బంది పెట్టను.

ఇది మన సంప్రదాయం కావొచ్చు. నేను సంప్రదాయాలను తప్పుపట్టను. కానీ ఒక ఆడపిల్లగా నా మనస్సులోని మాటను చెబుతున్నాను.

Read More About: mystory wife husband relationships

Have a great day!
Read more...

English Summary

I hate puberty ceremony it's embarrassing event