నాకు స్కూల్ డేస్ నుంచి ఒక అమ్మాయితో మంచి పరిచయం ఉంది. తన పేరు గీత. మా ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో చిన్నప్పటి నుంచీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. మా తల్లిదండ్రులు కూడా మాపై ఎప్పుడూ ఆంక్షలు విధించలేదు. మేము కూడా ఎప్పుడూ మా హద్దులు దాటలేదు.
కాలేజీ రోజుల్లో కూడా గీత నా బైక్ పైనే కాలేజీకి వచ్చేది. అందరూ మమ్మల్ని మంచి ఫ్రెండ్స్ అనేవారు. కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్యలో ఎంత మంచి స్నేహం ఉన్నాకూడా దానికి ప్రేమ అనే పేరు పెడుతుంది ఈ సమాజం.
అలాగే మా ఫ్రెండ్ షిప్ ను కూడా తెలియని వారు తప్పుగా అర్థం చేసుకునేవారు. మీ మధ్య ఏదో లేకుంటే ఎందుకంత చనువుగా ఉంటారనేవారు. వాస్తవానికి మా ఇద్దరి మనస్సుల్లో అలాంటి ఆలోచనలు ఉండేవి కావు.
డిగ్రీ పూర్తికాగానే గీతకు మా ఊర్లోనే ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని మొదట గీత నన్నే అడిగింది. నేను ఆ అబ్బాయి గురించి తెలుసుకున్నా. మంచి కుర్రాడు అని తెలిసింది. చేసుకో.. నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పాను. గీతకు కూడా అతను బాగా నచ్చడంతో అతన్నే చేసుకుంది.
గీత అత్తగారిళ్లు కూడా మా ఊర్లోనే ఉండడంతో పెళ్లయిన కూడా గీత ఊర్లోనే ఉండేది. దీంతో అప్పుడప్పుడు వెళ్లి తనని పలకరించేవాణ్ని. వాల్లింటికి నేరుగా వెళ్లేవాణ్ని. మొదట్లో నన్ను ఎవరూ ఏమీ అనేవాళ్లు కాదు. కానీ గీత మెట్టినింటి వాళ్లకు నాతీరు నచ్చలేదు. దీంతో వాళ్లు నాపై కోప్పడ్డారు.
ఇక ఒక వారం పాటు గీత ఇంటికి వెళ్లలేదు. చిన్నప్పటి నుంచి 365 రోజులు ప్రతి క్షణం నేను గీతతోనే గడిపేవాణ్ని. కష్టమొచ్చినా.. సుఖమొచ్చినా తనకే ఫస్ట్ చెప్పేవాణ్ని.
కానీ ఇప్పుడు తనకు పెళ్లయ్యింది. నేను గతంలో మాదిరిగానే తనతో చనువుగా ఉంటే తన సంసారం నాశనం అవుతుంది. అందుకే దూరంగా ఉండాలనుకున్నాను. కానీ అస్సలు ఉండలేకపోయాను.
ఇక గీత భర్త మాత్రం.. మా ఇంట్లో వారు అనే మాటలను ఏమీ పట్టించుకోకు బాసూ.. నీ గురించి, నా భార్య గురించి నాకు తెలుసు. మీరు మాట్లాడుకుంటూ పట్టించుకోవద్దన్నాడు.
ఆయనకు మాపై ఉన్న నమ్మకంతో నేను గీతతో ధైర్యంగా మాట్లాడేవాణ్ని. అయితే సడన్ గా గీత భర్త కూడా మారిపోయాడు. గీతను నువ్వు కలవడానికి వీల్లేదు అని చెప్పాడు. నాపై కొన్ని ఆరోపణలు కూడా చేశాడు.
దాంతో మళ్లీ గీతకు దూరంగా ఉంటూ వచ్చాను. కానీ అంత అకస్మాత్తుగా ఎందుకు తను మారిపోయాడో నాకు అర్థం కాలేదు.
రోజూ గీత గుర్తొచ్చేది. అయినా తనకు పెళ్లయిపోయింది కదా... తనతో మాట్లాడడం మంచిదికాదని నాకు కూడా అనిపించేది.
అయితే మేమిద్దరం ఎప్పుడూ కూడా హద్దులు దాటి ప్రవర్తించలేదు అయినా ఎందుకు వీళ్లంతా తప్పుగా అర్థం చేసుకున్నారనిపించింది.
ఒక రోజు గీత భర్త మా ఇంటికొచ్చాడు. నీతో కాసేపు మాట్లాడాలన్నాడు. ఇద్దరం మా ఇంటి పైన కూర్చొన్నాం. కాసేపు మా అమ్మ చేసిన బజ్జీలు తింటూ మాట్లాడుతూ కూర్చొన్నాం.
నీకు డ్రింక్ చేసే అలవాటు ఉందా అన్నాడు. లేదు అన్నాను. నాకు కూడా తెలుసు .. నీకు లేదని, ఎందుకంటే గీత రోజూ నీ గురించే చెబుతుంటుంది. నీ అలవాట్లు నీ క్యారెక్టర్ అంతా నాకు గీత చెబుతూనే ఉంటుందన్నాడు.
తర్వాత తను జేబులో నుంచి ఒక చిన్న మద్యం బాటిల్ తీశాడు. ఏం అనుకోవొద్దు బ్రదర్.. నాకు పెగ్ పడితేగానీ మనస్సులోని మాటలు బయటకురావు అంటూ ఒక పెగ్ వేశాడు. నిన్ను, గీతను చూస్తుంటే నాకే జలసీ పుడుతుంది.
నిజంగా మీ ఇద్దరి ఫ్రెండ్ షిప్ చాలా గ్రేట్. నాకు కూడా చాలా మంది అమ్మాయిలతో స్నేహం ఉందిగానీ ఎప్పుడో ఒక్కసారైనా నా మనస్సులో వారిపై తప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది.
కానీ మీ ఇద్దరిదీ స్వచ్ఛమైన స్నేహం.. మీలాగా నేనెవర్నీ చూడలేదు. కానీ నా భయం నాది. నీకు నా భార్యతో నా కంటే ఎక్కువ చనువు ఉంది. నా కంటే నా భార్య నువ్వే ఎక్కువ అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. నేను మీ స్నేహాన్ని తప్పుబట్టను కానీ నా భార్య నన్నే ఎక్కువగా ఇష్టపడాలని నాకు కూడా ఉంటుంది కదా.
మొదట్లో నేను కూడా నిన్ను ఏమీ అనలేదు. కానీ రోజురోజుకు నా భార్య నాకంటే ఎక్కువగా నిన్నే తలుచుకోవడం చూసి నాకు భయం వేసింది. ఎప్పుడు చూసినా నీ గురించే చెబుతూ ఉంటుంది. నీ అంత మంచివాడు ఇంకెవ్వరూ లేనట్లుగా పొగుడుతూ ఉంటుంది.
అందుకే నేను నిన్ను ఆమెకు దూరంగా ఉండమని కోరాను. నా భార్యకు నాకంటే నీపై ఎక్కడ ఎక్కువ ప్రేమ కలుగుతుందేమోనని భయం నన్ను వెంటాడుతుంది. ఈ విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకోకు బ్రదర్ అంటూ అతను వెళ్లిపోయాడు.
అవును.. గీత భర్త చెప్పింది నిజమే. పెళ్లికానంత వరకు ఏ అమ్మాయితోనైనా స్నేహం కొనసాగించొచ్చేమోగానీ.. ఒక్కసారి పెళ్లయ్యాక ఆ అమ్మాయితో అలాగే ఫ్రెండ్ షిప్ కొనసాగించాలంటే మాత్రం చాలా కష్టం.
దీనివల్ల సంసారాలు నాశనం అయ్యే అవకాశం ఉంది. అందుకే బాస్.. ఏ అమ్మాయితోనైనా పెళ్లికానంత వరకే ఫ్రెండ్ షిప్ జర్నీ ఉండాలి. పెళ్లయ్యాక ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా దూరంగా ఉంటేనే మంచిది.
More MYSTORY News
- చరిత్రలో అత్యంత భయంకరమైన రహస్య సమాజాలు... వారు ఏమి చేశారో తెలుసా...!
- కరోనా కన్నా వేగంగా... ఏపీలో వింత వ్యాధికి తెలియని కారణాలు...
- ఇప్పుడన్నీ శారీరక ప్రేమలే, డబ్బు కోసం ఏర్పడే ప్రేమలే, వాలెంటైన్ డేన మాత్రమే ప్రేమనా #mystory407
- తనివితీరా ముద్దాడి గట్టిగా అల్లుకుపోయింది, నా చేతులు తనని నలిపేశాయి
- నా భర్త ఆ విషయంలో బలవంతపెడుతుంటే నో చెప్పలేకపోతున్నా, నన్ను ఆయన దారిలోకి తెచ్చుకున్నాడు
- నా భర్త నా కోర్కె తీర్చడం లేదు, సుఖాన్ని ఇవ్వడం లేదు, పెళ్లయిన కొత్తలో రోజుకు మూడుసార్లు చేసేవాడు #
- మా ఆయన రోజూ అందులోనే లీనమైపోతాడు, నన్ను పట్టించుకోడు, కోరికల్ని అణుచుకోలేకచస్తున్న #mystory403
- ఒక తల్లి కూతురికి సెక్స్ గురించి చెబుతున్న మాటలు, 'సెక్స్ శారీరక అవసరం కాదు, అందుకు పరిష్కారం కాదు