ఫిజికల్ అప్పీరియన్స్.. ఏ మనిషినైనా మొదటగా చూస్తే ఆకట్టుకునేది ఇదే. అయితే అందంగా ఉన్న వాళ్లందరూ ఇతరులను ఆకర్షిస్తారు. లేనివారిని ఎవరూ చూడరు అనేది వాస్తవమేనా.. అంటే కాదు అనే చెప్పవచ్చు. కొందరు అందంగా లేకపోయినా వారి పట్ల చాలా మంది అట్రాక్ట్ అవుతుంటారు. వారితో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. వారు పక్కన లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతుంటారు. ఇందుకు కారణాలేంటంటే..
కొన్ని రిలేషన్‌షిప్స్ అందంతోనే ముడిపడి ఉండవు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు. ఫిజికల్ అప్పీరియన్స్ ఒక్కటే కాకుండా ఆ మనిషిలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఇతరులకు విపరీతంగా నచ్చుతాయి. అవి మొదటి పరిచయంలోనే కనిపించవు. మున్ముందు వారిలో ఈ గుణాలను చూడటం ద్వారా వారితో విడదీయలేని బంధాన్ని పెనవేసుకుంటారు. వారు లేని లోటును భారంగా ఫీలవుతుంటారు. ఇంతకీ మరి ఆ మనిషిలో ఇతరులను అట్రాక్ట్ చేసే లక్షణాలు ఏంటి..
నవ్వించే అలవాటు
ఎప్పుడూ మూడీగా ఉండకుండా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వారి పట్ల చాలా మంది ఆకర్షితులవుతుంటారు. వారిలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇతరులను కట్టిపడేస్తుంటుంది. అలా నవ్వించే వారితో ఎక్కువ సమయం గడపాలని మీ మనసు కోరుకుంటుది. ఫలితంగా ఒత్తిడి తగ్గి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండగలుగుతారు.
డ్రెస్సింగ్ సెన్స్
కొందరిలో సరైన డ్రెస్సింగ్ సెన్స్ మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. ఉన్నంతలోనే నీట్‌గా, స్టైల్‌గా రెడీ అయిన వారి పట్ల ఫస్ట్ లుక్‌లోనే మంచి ఇంప్రెషన్ వస్తుంది. దీనికి అందంతో పని లేదు.
ఎప్పుడూ నవ్వుతూ ఉండటం
ఎన్ని టెన్షన్స్, సమస్యలు ఉన్నా.. వాటిని బయటకు కనబడనీయకుండా కొందరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ముఖం పైన చిరునవ్వు చెదరనివ్వరు. వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. అదే వారి అందాన్ని పెంచుతుంది. ఇలాంటి వారిని చూసి మొదటి చూపులోనే ఇంప్రెస్ కావడం ఖాయం.
నిజాయతీ
కొందరిలో నిస్వార్థం, నిజాయతీ ఇతరులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఎలాంటి లాభాపేక్ష, స్వార్థం లేకుండా సహాయం చేసే గుణం కలిగి ఉన్న వారు అందరిలోనూ ప్రత్యేకంగా కనిపిస్తారు.
ఆత్మవిశ్వాసం
ఫిజికల్ అప్పీరియన్స్‌తో సంబంధం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులు అన్నింటా ధైర్యంగా దూసుకుపోగలరు. ఫలితంగా వారిలో వ్యక్తిత్వం మరింత మెరుగ్గా కనిపిస్తుంది. ఇదే ఇతరులను ఆకట్టుకుంటుంది. మరికొందరు ఎదుటి వారికి తాము నచ్చాలని, వారిని ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇలాంటి వారు అందరిలో ప్రత్యేకంగా కనిపించి ఇతరుల దృష్టిని ఆకట్టుకుంటారు. వారితో స్నేహం చేయాలని కోరుకుంటారు.
More Articles
- మీ భార్యతో ఆ సమయంలోనే ప్రేమగా ఉంటున్నారా.. అది ఎంత పెద్ద తప్పో తెలుసా.?
- సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.!
- శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
- స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే!
- రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
- మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!