మొదటి సంతానం అందేవరకు భార్యాభర్తలకు ప్రైవసీ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వారికంటూ ఏకాంత సమయం ఉంటుంది. ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ఆ తర్వాత ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తదుపరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం సవాలుగా ఉంటుంది. ఈ క్రమంలో మరో సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దంపతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వైద్య నిపుణుల సలహాలు చూద్దాం..
చిన్న పిల్లలు సమాజంలో ఎలా ఉంటున్నారనేది డిసైడ్ చేసేది ముందు వారి ఇంటి పరిస్థితులు, వాతావరణమే. అందుకే పిల్లల ముందు తల్లిదండ్రులు మాట్లాడే విధానం నుంచి చేసే పనుల వరకూ ప్రతిదీ ఒక పద్ధతిగా ఉండాలి. వారు చూడలేని దృశ్యాలు, వినకూడని మాటలు వారి దాకా చేరకూడదు. ఈ క్రమంలో రెండు లేదా మూడో సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.
నిద్రపోయాకే
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారు గాఢంగా నిద్రపోయిన తర్వాత దంపతులు కలవాలి. వాళ్లను ఉయ్యాలలో పడుకోబెట్టిన తర్వాత వారు ఏకాంత సమయాన్ని కేటాయించుకోవాలి.
ఈ వయసు పిల్లలు ఉంటే
మీ ఇంట్లో 1 నుంచి మూడేళ్ల లోపు పిల్లలు ఉన్నట్లయితే భార్యాభర్తలు అప్రమత్తంగా ఉండాలి. వారు ఏ సమయంలోనైనా నిద్ర లేచే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన టైం మీ కలయిక కోసం ఎంచుకోవాలి.
ఈ ఏజ్‌లో జాగ్రత్త
4 నుంచి ఏడేళ్ల లోపు పిల్లలు ఉన్నట్లయితే తల్లిదండ్రులు అలర్ట్‌గా ఉండాలి. ఈ వయసులో పిల్లలు వారి చుట్టూ జరుగుతున్న విషయాలను, పరిసరాలను గమనిస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఈ వయసు లోపు పిల్లలు ఉన్నప్పుడు భార్యాభర్తలు ఏకాంతం కోసం వేరే గది ఉపయోగించుకోవడం మంచిది.
ప్రైవసీ ఏడేళ్లు దాటిన పిల్లలు ఉన్నప్పుడు వారిని సెపరేట్‌గా వేరే గదిలో పడుకోబెట్టడం శ్రేయస్కరం. ప్రైవసీ గురించి వారి వయసుకి తగినట్లుగా సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పడం ద్వారా ఎలాంటి మనస్పర్థలు ఉండవు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఫిజికల్ అఫెక్షన్ లేకుండా చూసుకోవాలి. దంపతులు ప్రేమగా ఉంటూనే ఆరోగ్యకరమైన బౌండరీలు పాటించడం ద్వారా పిల్లల మానసిక పరిస్థితిపై దుష్ప్రభావం పడదు. రెండో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు భార్యాభర్తలిద్దరికీ ప్రైవసీ, కంఫర్ట్ ఉండే సమయాన్ని ఎంచుకోవాలని గమనించాలి. పిల్లల వయసుకి తగినట్లుగా కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ తదుపరి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రశాంతంగా సాగుతుందని గుర్తుంచుకోవడం ముఖ్యం.More Articles