సాధారణంగా ప్రేమ అయినా పెళ్లి అయినా రోజులు గడుస్తున్న కొద్దీ రిలేషన్‌షిప్ పాతబడిపోతుంది. దీంతో కొన్ని బంధాల్లో ప్రేమ క్రమంగా తగ్గిపోతుంది. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ ఉన్నా వ్యక్తపరచలేని పరిస్థితి ఉంటుంది. కానీ అలా కాకుండా మీ భాగస్వామితో ప్రతిరోజూ మీరు ప్రేమలో పడుతూ రొమాంటిక్‌గా ఉండాలనుకుంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి. మీ బంధం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.
నేటి బిజీ లైఫ్‌లో ఎక్కువ శాతం భార్యాభర్తలు ఉద్యోగాలు చేసే వాళ్లే. ఇక భార్య గృహిణిగా ఉన్నా బాధ్యతలు ఎక్కువే. ప్రేమికులు సైతం తమ వృత్తిపరమైన జీవితాల్లో చాలా వరకు బిజీగా గడుపుతూ వ్యక్తిగతంగా సరదాగా గడిపే అవకాశాలు తక్కువ. ఈ క్రమంలో వైవాహిక జీవితం ఆరంభంలో లేదా ప్రేమలో పడ్డాక ఉన్నంత అఫెక్షన్, టైం మున్ముందు ఉండదు. బాధ్యతలు, ఆర్థిక విషయాలు, పని ఒత్తిడి ఇలా వివిధ కారణాల వల్ల ఇద్దిర మధ్యా ప్రైవసీ అనేది కొంచెం తగ్గుతుంది. అయితే ఎంత బిజీగా ఉన్నా భాగస్వాముల మధ్య ప్రేమ అనేది తప్పనిసరి.
ఈ క్రమంలో బిజీ లైఫ్ నుంచి బయటపడుతూ మీ భాగస్వామితో పదే పదే ప్రేమలో పడాలని మీరు అనుకుంటే ముందుగా కొన్ని సలహాలు పాటించాలని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. దీని ద్వారా మీ బాండింగ్ స్టార్ట్ అయి ఎంతకాలమైనా ప్రేమ మాత్రం చెక్కుచెదరదు.
తొలి ప్రేమ
మీరు మీ భాగస్వామిని ముందుగా కలిసినప్పుడు వారిని మీరు ఎలా చూశారు.. వారిపైన మీ అభిప్రాయం, ఉద్దేశం ఏంటి అనేది మీకు ఒక సానుకూల అవగాహన ఉంటుంది. ఆ పాజిటివ్ ఒపీనియన్‌ను మీరు చివరి వరకూ అదే విధంగా చూడగలగాలి. దీంతో ఇద్దరి మధ్యా ప్రేమ పదిలంగా ఉంటుంది.
కలిసి టైం స్పెండ్ చేయడం పెళ్లయిన కొత్తలో లేదా ప్రేమలో పడ్డప్పుడు మీరిద్దరూ సరదాగా ఎలా గడిపారో ఇప్పుడూ అదేవిధంగా ఉండటానికి సమయం కేటాయించండి. కలిసి కాఫీ తాగడం, వంట చేయడం, బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, అలా వాకింగ్‌కి వెళ్లడం, భాగస్వామి చేతిని తాకుతూ దగ్గరకు తీసుకోవడం.. ఇలా చిన్న చిన్న పనుల ద్వారా మీరు మళ్లీ మళ్లీ ప్రేమలో పడొచ్చు.. ప్రేమను వ్యక్తపరచడం కొత్తలో మీరు మీ భాగస్వామికి పదే పదే ఐ లవ్ యూ అని చెప్పడం, సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం, ప్రశంసించడం లాంటివి చేసుంటారు. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్దీ అలా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ మీ పెళ్లయి ఎన్నేళ్లయినా మీరు మీ పార్ట్‌నర్‌కి ప్రేమను వ్యక్తపరిచినట్లయితే అఫెక్షన్ పెరుగుతుందే తప్ప తగ్గదు.More Articles