వినాయకుని విగ్రహం కొంటున్నారా, అయితే ఈ విషయాలను మనసులో ఉంచుకోండి


గణేష్ చతుర్ధిని, వినాయక చవితి అని కూడా పిలుస్తారు. ఈ వినాయక చవితి వస్తున్న సందర్భంగా, మార్కెట్లన్నీ వినాయక విగ్రహాలతో నిండిపోయి అందంగా ముస్తాబై ఉన్నాయి. అందంగా తయారు చేయబడిన, ఈ విగ్రహాలు మార్కెట్లని రంగులలో ముంచి లేపినట్లుగా కనిపిస్తూ అలరిస్తున్నాయి అనడంలో ఆశ్చర్యం లేదు. క్రమంగా ఏ విగ్రహం కొనాలా అన్న ఆలోచనలో ప్రజలు మునిగిపోయి ఉన్నారు. ఇక ఉత్సవ విగ్రహాల కిందకు వస్తే, రకరకాల వేష ధారణలలో గణేషుని విగ్రహాలు కొలువుతీరి ఉన్నాయి. వినాయకుడు అంటేనే, మనోరంజకునిగా భావిస్తారు భక్తులు. క్రమంగా, వారికి నచ్చిన రూపాలలో లౌకికవాద స్పూర్తితో గణేశుని ఊహించుకుని పూజలు చేస్తుంటారు.

వినాయక చవితి, ప్రధానంగా హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలో ఒకటిగా ఉంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్షం నాల్గవ రోజు, చవితి నాడు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి నుండి వరుసగా పది రోజులు, పూజ గదిలో వినాయకుని విగ్రహం ఉంచి ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా ఉంటుంది. ఆ తర్వాత విగ్రహాన్ని, నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ పండుగ సెప్టెంబర్ 13, 2018న వస్తుందని చెప్పబడింది..

ఏదిఏమైనా వినాయకుని విగ్రహాన్ని కొనుగోలు చేసేముందు కొన్ని విషయాలను మనస్సులో ఉంచుకోవాలని సూచించబడింది.

కూర్చుని ఉన్న గణేషుని విగ్రహమా లేదా నిలబడి ఉన్న విగ్రహమా ?

అనేక రకాల వినాయకుని విగ్రహాలు, మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి వాటి ప్రయోజనాలను విక్రేతలు రకరకాలుగా చెప్తుంటారు. కొందరైతే పండితుల మాటలను, సూచనలను పరిగణనలోనికి తీసుకుని మరీ విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఏదిఏమైనప్పటికీ, గృహానికి కూర్చుని ఉన్న వినాయక విగ్రహాన్ని సూచించబడింది. కార్యాలయంలో మాత్రం నిలబడి ఉన్న విగ్రహాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కూర్చుని ఉన్న వినాయకుని విగ్రహం, గృహంలో దుబారా ఖర్చులు లేకుండా చేయడంతో పాటు, ఆర్థిక స్థిరత్వం ఉండేలా సహాయం చేయగలదు. నిలబడి ఉన్న వినాయకుని విగ్రహం కార్యాలయాల్లో ఉంచడం ద్వారా, వ్యాపారాభివృద్ది, వృత్తిపరమైన అంశాలలో సహాయంగా ఉంటుంది.

వినాయకుని తొండం ఏ వైపున ఉండాలి. ఎడమా లేదా కుడా ?

వినాయకుని విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఎదురయ్యే గందరగోళంలో ఇది కూడా ఒకటి. తొండం కుడివైపు ఉండాలా, లేదా ఎడమ వైపు ఉండాలా అని. రెండింటిలో వినాయకుడు అందంగానే ఉంటాడు మరి. కానీ ఇందులో ఒకటి పూజకి వినియోగించరాదని సూచించబడింది. వినాయకుని తొండం, ఎల్లప్పుడూ ఎడమవైపునకు వంగి ఉండేలా ఎంచుకోవాలి. కేవలం అటువంటి విగ్రహం మాత్రమే, పూజకు పవిత్రమైనదని భావిస్తారు.

ఎలుక మరియు మోదకం సంబంధించిన అంశాలలో:

వినాయకుడి ప్రతిమ అంటే ఎలుక బొమ్మ లేకుండా ఊహించుకోలేం. నిజజీవితంలో ఇంట్లో ఎలుక కన్పిస్తే, అది బయటకు వెళ్ళే వరకు నిద్రపట్టదు. కానీ ఈరోజు మాత్రం, ఎలుక ఆహారాన్ని తీసుకుంటే దేవుడే వచ్చి నైవేద్యాన్ని స్వీకరించిన అనుభూతికి లోనవుతుంటారు భక్తులు. ఎలుక వినాయకుని వాహనంగా వర్ణించబడింది. అనేక చిత్రాలలో, ఈ ఎలుకను, వినాయకుని పాదాల ఉండి, మోదకాన్ని తింటున్నట్లుగా చిత్రీకరించడం జరుగుతుంది..మోదకం వినాయకుడికి ఇష్టమైన ఆహార పదార్ధంగా ఉంది. కావున ఎలుక మరియు మోదకం కలిగి ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవడం మంచిదిగా సూచించబడింది.

ఏ పదార్ధాలు వాడిన విగ్రహాన్ని ఎంచుకోవాలి ?

వినాయకుని విగ్రహాన్ని మట్టి, "ప్లాస్టర్ ఆఫ్ పారిస్" , కొన్నిరకాల లోహాలు, లేదా పండ్లు, కూరగాయలు, వస్తువులు, డబ్బులు మొదలైన అనేక వస్తువులను ఉపయోగించి చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఎట్టిపరిస్థితుల్లో రసాయన పదార్ధాలు కలపరాదు. ఏది ఏమైనా, ఇంట్లో బంకమట్టి మరియు అనుమతించిన సాధారణ మట్టిని ఉపయోగించి తయారుచేసిన ప్రతిమే అన్నివిధాలా మంచిదిగా సూచించబడుతుంది. ఎక్కువగా "ప్లాస్టర్ ఆఫ్ పారిస్" పదార్ధాలతో తయారుచేసిన విగ్రహాన్ని ఉపయోగిస్తారు. కానీ, అది ఇంట్లో ఉపయోగించరాదని చెప్పబడింది. చెక్కను ఉపయోగించి తయారుచేసిన, వినాయకుడి విగ్రహం పూజించుటకు పనికిరాదని కూడా చెప్పబడింది.

ఏదిఏమైనా పండుగ తర్వాత కూడా ప్రజలు దుష్ప్రభావాలు ఎదుర్కోరాదు, అలా ఎదుర్కొంటే పండుగ ఫలితాన్ని కూడా పొందలేరు. కావున, మట్టివిగ్రహాలను ఎంచుకుని పూజించడమే అన్నివిధాలా శ్రేయస్కరం. ఈరోజు మనం నిర్మించే సమాజమే మన భావితరాలకు స్వేచ్చా వాయువులను ఇస్తుంది. కావున, ఆరోగ్యకరరీతిలోనే పండుగను చేసుకోవలసినదిగా పండితులు సైతం సూచిస్తున్నారు.

వినాయకుని విగ్రహం రంగు :

వినాయకుని విగ్రహాన్ని ఎంచుకునే క్రమంలో, విగ్రహం రంగు కూడా ప్రధాన అంశాలలో ఒకటిగా ఉంది. క్రమంగా వెర్మిలియన్ రంగులు కలిగిన వినాయకుని ప్రతిమను సూచించబడింది. విగ్రహాన్ని తెలుపు రంగుతో కూడా తయారుచేయవచ్చు. క్రమంగా ఉత్తమ ఫలితాలని పొందగలరని సూచించబడింది. ఈ రంగులు ఉపయోగించి పూజలు చేసిన వారింట ఆర్ధికపరసమస్యలు లేకుండా ఉంటాయని చెప్పబడింది.

Have a great day!
Read more...

English Summary

Ganesha Chaturthi this year will be celebrated on September 13, 2018. The preparations for the festival are in full swing. The highly celebrated festival lasts for ten days during which an idol of Lord Ganesha is offered prayers every day. One should check for the colour, design, direction, material etc., while buying an idol of Lord Ganesha for the festival.