వినాయకుడికి నెమళ్ళ దేవుడు అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?


16 వ శతాబ్దంలో మొర్యా గోసావి అనే వ్యక్తి పూణేలోని మోర్గావ్ అనే ప్రాంతంలో నివసించేవాడు. ఇతడి తల్లిదండ్రులు ( వామన భట్ మరియు పార్వతి భాయ్ ) కర్ణాటక నుండి మహారాష్ట్ర రాష్ట్రానికి తరలి వచ్చారు. వామన భట్, గణపత్య వర్గానికి చెందిన వ్యక్తి. అప్పట్లో హిందూ సమాజాన్ని నాలుగు శాఖలుగా విభజించారు. శైవ మరియు వైష్ణవ వర్గాల గురించి చాలామందికి తెలుసు.

కానీ శక్త మరియు గణపత్య వర్గాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ వర్గాలకున్న పేర్లను బట్టి ఆయా వ్యక్తులు శివుడు, విష్ణువు, శక్తి మరియు గణపతి దేవుళ్లను పూజించే భక్తులని విషయం మనకు అర్ధమవుతుంది.

వినాయకుడి ముందు గుంజీలు తీసే ఆచారం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?

గణపతి దేవుని భక్తులు ఎక్కువగా మహారాష్ట్ర, గోవా మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా నివసిస్తారు. వీళ్ళందరూ గణేశుడ్ని ఒక మహోన్నతమైన శక్తిగా భావిస్తారు. అందుకు కారణం శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని వదిస్తాడు. కానీ ఈ యుద్దానికి బయలుదేరే ముందు, శివుడు వినాయకుడికి తండ్రయినప్పటికీ వినాయకుడిని పూజించి యుద్దానికి బయలుదేరతాడు.

మోర్గావ్ అనే ప్రాంతం చాలా కాలం నుండి గణపతి భక్తులకు, అతి ముఖ్యమైన కేంద్రంగా ప్రజ్వరిల్లుతోంది. కానీ వామన భట్ మరియు పార్వతి భాయ్ ఎన్నో ప్రదేశాలు ఉన్నా మోర్గావ్ కే రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది.

అసలు ఆ ప్రాంతానికి మోర్గావ్ అనే పేరు ఎలా వచ్చింది ? మోర్గావ్ అంటే " నెమళ్ళ గ్రామం " అని అర్ధం. ఈ ప్రదేశం ఎప్పుడూ నెమళ్లతో నిండిపోయి ఉండేది. ఈ గ్రామంలో ఒక వినాయకుడి విగ్రహం ఉండేది.

ఆ విగ్రహానికి మయూరేశ్వరా అని పేరు కూడా ఉంది. "నెమళ్ళ దేవుడు" అని దాని అర్ధం. ఈ ప్రాంతంలోనే కాకుండా మరో ఏడూ ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాన్ని పూజించే వారు. థెర్ , సిద్ధతేక, రంజన్ గావ్, ఓఝార్, లెన్యాద్రి , మహద్ మరియు పాళీ. ఈ ఎనిమిది ప్రదేశాలను కలగలిపి "అష్ట వినాయక" ప్రదేశాలు అని అంటారు.

గణేశ పురాణం ప్రకారం సింధు అనే దానవుడిని సంహరించేందుకు వినాయకుడు నెమలి పై వెళ్లాడంట. మోర్గావ్ లో మయూరేశ్వర అవతారం మనకు కనపడుతుంది. దీనినే మోరేశ్వరా అని కూడా అంటారు.

వామన మరియు పార్వతి, మోరేశ్వరుడిని ప్రార్థించిన తర్వాతనే వాళ్లకు ఒక మగ బిడ్డ జన్మించాడట. అతని పేరు మొర్యా. మొర్యా చిన్నప్పటి నుండి విగ్నేశ్వరుడి భక్తుడు. థెర్ అనే ప్రాంతానికి వెళ్లి ఎంతో భక్తి శ్రద్దలతో అహోరాత్రులు వినాయకుడిని ప్రార్ధించాడు.

దీనితో అతనికి ఆ దేవుడి యొక్క పవిత్రత తెలిసొచ్చింది, ఇతని లో దైవసంబంధమైన విషయం ఎదో ఉంది చాలా మంది భావించారు. ఇక అప్పటి నుండి అతనిని "మోరోబా గోసావి " లేదా సాధారణంగా మొర్యా అని పిలవ సాగారు.

అష్టఐశ్వర్యాలకు అధిపతైన కుబేరుడి ధన అహాంకారం.. చుక్కలు చూపించిన బాల గణేషుడు..!!

వేదాలను, పురాణాలను, ఉపనిషత్తులను మోరోబా ఎంతో శ్రద్ధగా అభ్యసించాడు. వాటిని ఎంతో నిశితంగా పరిశీలించి సర్వం తెలుసుకోవడం మొదలు పెట్టాడు. పూణే దగ్గరలో ఉన్న పవనా నది ఒడ్డున చించవాడ అనే ప్రాంతంలో తన ఆశ్రమాన్ని ఏర్పరుచుకున్నారు. ఎంతో గొప్ప వ్యక్తులైన సమర్థ్ రామదాసు మరియు ముని తుకారాం, ఇతన్ని కలవడానికి ఆశ్రమానికి వచ్చేవారు అని పురాణాలలో లిఖించబడి ఉంది.

ఈ చించవాడ అనే ఆశ్రమంలో సమర్థ్ రామదాసు ఎంతో ప్రసిద్ధి గాంచిన " సుఖఃకర్త దుఖఃకర్త వర్త విఘ్నచి " అనే గణపతి వందనను లిఖించాడు. మొర్యా ఉంటున్న కాలం నుండి మోర్గావ్ గణపతి ఆలయంలో వినాయక చవితిని ఎంతో ఘనంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేవారు. మోరేశ్వరుడు అష్ట వినాయక యాత్రలో భాగంగా, ఇక్కడి నుండే తన యాత్ర మొదలుపెడతారు.

Have a great day!
Read more...

English Summary

According to Ganesha-Purana, Ganesha had ridden onto a peacock to kill a Danava called Sindhu. In Morgaon the same Mayureshwara avtara can be seen, who is also called Moreshwara