శని దేవుడు మీ జీవితం పట్ల నిరాశతో ఉన్నాడా?

శని దేవుడు మీ జీవితం పట్ల నిరాశతో ఉన్నాడా?


శని దేవుడు శని గ్రహానికి అధిపతి. శని దేవుడు, తాను ప్రసాదించే సానుకూల, మరియు ప్రతికూల అసాధారణ ఫలితాల కారణంగా ప్రసిద్ది చెందాడు. అనుకూలంగా ఉన్న ఎడల, మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తాడు, కానీ నిరాశకు గురైనట్లయితే శని దేవుని తృప్తిపరచడం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ దుష్ప్రభావాలు ప్రారంభమైన ఎడల, అవి కనీసం ఏడు సంవత్సరాల పాటు కొనసాగుతుంటాయి.

Advertisement

ఇతర గ్రహాలు కొన్ని నెలల పాటు రాశిచక్రంలో ఉండగా, శని దేవుడు మాత్రం గరిష్టంగా ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం కొనసాగుతాడు. జ్యోతిష్కులు జన్మకుండలి ప్రకారం, శని దేవుని స్థానం గురించి చర్చించేటప్పుడు తరచుగా 'ధయ్యా' మరియు 'సాడే-సాతి' వంటి పదాలను వినియోగించడం మనం చూస్తుంటాము. శని రెండున్నర సంవత్సరాల పాటు ప్రభావాలను చూపిన ఎడల 'ధయ్యా' అని. గరిష్టంగా ఏడు సంవత్సరాలు పాటు కొనసాగితే సాడే సాతి (ఏలినాటి శని) అని పిలవడం జరుగుతుంది.

Advertisement

ప్రభావాలు ప్రయోజనకరంగా ఉంటాయా, లేక దుష్ప్రభావాలతో కూడుకుని ఉంటాయా అన్నది, జన్మ కుండలిలో శని గ్రహం చేరిన స్థానం, మరియు ఇతర గ్రహాలతో ఉన్న సాన్నిహిత్యం, శత్రుత్వం మీద నిర్ణయించబడుతుంది. ఏదేమైనా, దుష్ప్రభావాలు అధికంగా ఉండి, దీర్ఘకాలం కొనసాగుతున్న ఎడల, పరిస్థితులను తృప్తిపరిచేందుకు కొన్ని పాటించడం తప్పనిసరి అవుతుంది. కాబట్టి, మొదటగా మీ జన్మకుండలిలో శని దేవుడు నిరుత్సాహకరంగా ఉన్నాడా అని తెలుసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది. ఇక్కడ శని దేవుడు మీ పట్ల నిరాశతో ఉన్నాడు అని తెలుసుకునేందుకు కొన్ని అంశాలను, సూచనలను ప్రస్తావించడం జరిగింది.

Advertisement

రావి చెట్టు :

మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు పెరుగుతూ కనిపించినప్పుడు, మీరు దాన్ని నరికేసినా కూడా, మరలా ఆప్రాంతంలో కొత్త చెట్టు వస్తున్న ఎడల మీ పట్ల శనిదేవుడు నిరాశతో ఉన్నాడని అర్ధం. క్రమంగా శనిదేవుని శాంతపరచేందుకు, పండితుని సంప్రదించి చర్యలు తీసుకోవలసి ఉంటుంది.


గోడ కూలిపోవడం :
ఇంటిలో గోడలకు బీటలువారడం, లేదా గోడ కూలిపోవడం అనేది అశుభంగా భావిస్తారు. దీనికి కారణం, ఇటువంటివి గొడవలకు దారితీసి ఇంట్లో కుటుంబ సభ్యుల మద్య అశాంతిని నెలకొల్పుతాయని. కావున బీటలు వారడం, లేదా కూలిపోవడం వంటివి సంభవించడం జరిగిన ఎడల, ఏమాత్రం ఆలస్యం చేయకుండా శని దేవుని శాంత పరచేలా సంరక్షణా చర్యలు చేపట్టడం ఉత్తమంగా సూచించబడుతుంది.

Advertisement

సాలీడు గూళ్ళు :

సాలీడు గూళ్ళు, లేదా ఇంట్లో అధికంగా బూజు పట్టడం వంటివి కనిపించిన ఎడల, తగు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఇటువంటివి, మీ శుభ్రతను సూచిస్తుంటాయి. ముఖ్యంగా మీరు పట్టించుకోని ప్రదేశాలు, శుభ్రంగా ఉంచని ప్రదేశాల్లో సాలీళ్ళు ఇటువంటి గూళ్ళను ఏర్పాటు చేస్తుంటాయి. వేదాల ప్రకారం, ఇంటిని శుభ్రం చేసుకోవడం అనేది, గృహంలో సుఖసంతోషాలకు అత్యంత కీలకమైన అంశంగా భావించబడుతుంది. ఇంట్లో సాలీడు గూళ్ళు అధికంగా పెరుగుతున్నాయి అంటే, శని దేవుడు మీ పట్ల సుముఖంగా లేడని అర్ధం. మీరు తొలగిస్తున్నా కూడా, తిరిగి సాలీళ్ళు గూళ్ళు ఏర్పాటు చేస్తున్న ఎడల, మీరు పండితుని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.

Advertisement


నల్లపిల్లి:

మీ ఇల్లు నల్లపిల్లి అడ్డగా మారిన ఎడల, అది ఎన్నటికీ శుభ సూచకం కాదు. ఈ పరిణామం, శని దేవుని కోపాన్ని సూచిస్తుందని చెప్పబడింది.


చీమలు :

ఇంట్లో అధికంగా చీమలు చేరడం, మరొక అసమర్థనీయమైన ప్రవర్తనకు సూచన. చీమలు మీ ఇంటిని ఆక్రమించటం ప్రారంభించినట్లయితే, మీరు శని దేవుని శాంతపరచడానికి చర్యలు తీసుకోవడం తక్షణమే పూనుకోవలసి ఉంటుంది.

ఎంత గొప్ప ప్రయత్నం చేసినా, కోర్టు కేసులు ఓడిపోవడం, మరియు యజమానితో నిరంతర సమస్యలు వంటివి కూడా శనిదేవుని కోపాన్ని సూచిస్తాయి.

రోజువారీ లేదా తరచుగా జీవితంలో అనుకోని సరికొత్త సమస్యలు ఎదురవుతున్న ఎడల, లేదా ఒక సమస్య ఉన్నప్పుడే, మరో కొత్త సమస్య జనిస్తున్న ఎడల, శని దేవుడు మీ పట్ల కోపంతో ఉన్నాడని గ్రహించవలసి ఉంటుంది. క్రమంగా శని దేవుని ఆరాధించడం మొదలుపెట్టి, అతని అనుగ్రహం పొందే మార్గాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. శని దేవుడు న్యాయానికి ప్రభువు. వ్యక్తి యొక్క గత జన్మ కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడని చెప్పబడింది.

Advertisement


గత జన్మలో చేసిన మంచి లేదా చెడు పనులు, ప్రస్తుత జీవితంలోని ఆరోగ్య, అనారోగ్య ప్రభావాలకు కారణాలుగా ఉంటాయి. న్యాయదేవతగా కీర్తింపబడే శని దేవుని పూజించడం ద్వారా, గత జీవితంలో చేసిన తప్పులకు క్షమాపణ కోరుతూ, అతని కృపాకటాక్షాలను పొందడం ద్వారా జీవితంలో తలెత్తిన దుష్ప్రభావాలు మరియు అవరోధాలు తొలగిపోయి సరికొత్త జీవితానికి మార్గం సుగమం అవుతుందని చెప్పబడింది. కావున ఎటువంటి అవరోధాలు ఏర్పడినా, పండితులను సంప్రదించి తక్షణ నివారణా చర్యలలో భాగంగా, గ్రహ శాంతి నివారణా చర్యలు పాటిస్తూ, అదేవిధంగా మీ తీరికలేని సమయాలలో కూడా కొంత సమయం ఇంటి వాతావరణ పరిస్థితులకు కేటాయిస్తూ ఒక నిలకడ మార్గాన్ని అవలంభిస్తుంటే, నెమ్మదిగా కష్టాలన్నీ తొలగి, సరికొత్త జీవితానికి దారులు తెరుచుకుంటాయి.

ముఖ్య గమనిక : నిజానికి మనిషి, తన దైనందిక కార్యకలాపాలలో భాగంగా కొన్నిటికి అధిక ప్రాధాన్యతను ఇచ్చేందుకు కొన్నిటిని విస్మరించడం, సమయాన్ని కేటాయించలేకపోవడం, బద్దకం వంటి అంశాల కారణంగానే కోరి సమస్యలను తెచ్చుకుంటూ ఉంటాడు. కావున సమస్య ఎక్కడ మొదలైందో గమనించి, ఆ సమస్య తీరేందుకుగల మార్గాలను అన్వేషిస్తూ, శ్రేయోభిలాషులను, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను సంప్రదించి నిర్ణయాలను తీసుకున్న ఎడల కొంత లాభం చేకూరగలదు. దేవుడు, సహాయకారి మాత్రమే. మానవ ప్రయత్నంలేని చోట దేవుడు కూడా ఏమీ చేయలేడని వేదాలు, పురాణాలు సైతం చెప్తున్నాయి.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

Shani Dev, the lord of justice, gives the results of karmas from the past life. If you see a Peepal tree growing near your house, or are not able to get rid of ants occupying your house, or if a black cat has started considering your home her abode, etc. then it is high time you start worshiping Shani Dev.