మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శక్తి స్వరూపిణిలుగా కొలిచే లక్ష్మీ దేవి పూజకు శ్రావణ మాసంలో ప్రాధాన్యత ఎక్కువ. అదేవిధంగా ఆ మాసంలో శివారాధనకు, శివ పూజకు అత్యంత విశిష్టత ఉంది. ఉపవాసాలు, ప్రత్యేక పూజలతో మహిళలు శివుడిని ఆరాధిస్తారు. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు కెరీర్ కోసం, సరైన జీవిత భాగస్వామి కోసం పరమేశ్వరుడిని పూజిస్తుంటారు. అయితే అవివాహితులు శివ పూజ సమయంలో తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటి.. పూజా నియమాలు ఏంటి తెలుసుకుందాం..
శ్రావణ మాసంలో మంగళ గౌరీ పూజతో పాటు శివారాధనకు భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ శ్రేయస్సు, దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు మహిళలు ఉపవాసాలు చేస్తారు. ఇక అవివాహితులు మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించమని కోరుకుంటూ ఉపవాసం, పూజల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో అవివాహుతులు తెలిసీతెలియక చేసే పొరపాట్ల కారణంగా శివారాధన పూర్తి ప్రయోజనాలు పొందలేరు. సరైన నియమాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం..
వీటిని వాడకండి..
శివారాధనలో శివలింగానికి అభిషేకాలు, పూజలకు విశిష్టత ఉంది. అయితే పూజ చేసేటప్పుడు అవివాహితులు శివలింగానికి పసుపు, కుంకుమ సమర్పించకూడదు. పసుపు, కుంకుమ స్త్రీతత్వానికి చిహ్నం. అందుకే ఈ రెండింటినీ పార్వతీదేవికి, గౌరీ పీఠానికి మాత్రమే సమర్పించాలి. శివలింగానికి ఇవ్వకూడదు. మొగలి, తులసి ఆకులను శివ పూజలో ఉపయోగించకూడదు. ఈ ఆకులు నిషిద్ధం. అవివాహితులు పార్వతీ దేవికి పసుపు, కుంకుమ సమర్పించి.. శివునికి కేవలం నీరు, చందనంతో మాత్రమే పూజించాలి.
ఈ వస్తువులు వద్దు
శివారాధానలో ఉపయోగించే వస్తువులు శుభ్రంగా, చెక్కు చెదరకుండా ఉండాలి. విరిగిన వస్తువులు, చిరిగిన బిల్వ పత్రాలు, విరిగిన బియ్యపు గింజలు పూజలో ఉంచకూడదు. ఇలాంటి వాటిని ఉంచడం ద్వారా పూజలో ఆశించిన ఫలితాలు పొందలేరు. శివలింగానికి సమర్పించే నీరు, పువ్వులు కూడా పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. సంపూర్ణ భక్తితో పూజించడం ద్వారా నిస్వార్థమైన కోరికలు నెరవేరుతాయి.
అర్ధ ప్రదక్షిణ
పరమేశ్వరుడి పూజ అనంతరం శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. శివలింగం చుట్టూ ఎప్పుడూ పూర్తిగా ప్రదక్షిణ చేయకూడదు. అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. శివలింగంపైన నీరు ప్రవహించే ప్రాంతాన్ని దాటకూడదని పండితులు సూచిస్తున్నారు. ప్రదక్షిణ చేసేటప్పుడు జలధారి వద్దకు వెళ్లి అక్కడి నుంచే వెనుదిరగాలి. ఈ నిర్దిష్ట నియమాలు పాటిస్తూ శివుడిని పూజించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మంగళ గౌరీ పూజలోనూ నిష్టగా, నిస్వార్థంగా ఉండి పూజిస్తూ ఉంటే అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారు.
More Articles
- శివాలయ సందర్శన, పాము కలలు.. సోమవారం ఆచారాలు, అర్థాలు
- మహా శివరాత్రి అసలు కథ..సాక్షాత్తు శివుడే పార్వతీ దేవికి చెప్పిన రహస్యం!
- మహా శివరాత్రి 2026.. జాగారం ఎందుకు చేయాలి? ఈ పర్వదినం వెనుకున్న అసలైన రహస్యం ఇదే!
- Maha Shiratri 2025 : మీ రాశి ప్రకారం ఇలా చేస్తే..శివుడు అనుగ్రంతో భారీగా డబ్బు, ఏ పని చేసినా విజయమే
- శివుడి పంచారామ క్షేత్రాల్లో ఒకటి..సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయం స్పెషాలిటీ ఇదే,భారీగా భక్తులు
- Mahashivratri: మహాశివరాత్రి నాడు ఈ పండు నైవేద్యంగా పెడితే..ఐశ్వర్యవంతులైపోతారు