గ్రామ దేవతలను, శక్తి స్వరూపిణిలను భక్తి భావంతో ఆరాధించే ఆషాఢ మాసంలో తెలంగాణ నేల పులకించిపోతుంది. సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ వందల ఏళ్లుగా అమ్మవార్లకు బోనం సమర్పిస్తూ ఆయురారోగ్యాలతో కాపాడమని వేడుకుంటున్నారు. చరిత్రాత్మక గోల్కొండ బోనాలతో ఆషాఢ మాస ఉత్సవాలతో ప్రారంభం కాగా.. ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయిని(లష్కర్‌) మహంకాళి బోనాలు ఘనంగా జరిగాయి. కాగా, ఈ రోజు మాతంగి స్వర్ణలత భవిష్యవాణి ప్రజలను ఒకవైపు సంతోషంతో పాటు మరోవైపు ఆందోళనలో ముంచెత్తింది.

Advertisement

భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాలు మొదలయ్యాయంటే.. ఎక్కువగా ఆకట్టుకునేది గోల్కొండ, బల్కంపేట, లష్కర్‌, లాల్‌ దర్వాజ బోనాలు. చివరి వారం హైదరాబాద్‌ నగరమంతా విస్తరించిన అమ్మవారి ఆలయాల్లో బోనాల. సందడి ఊపందుకుంటుంది. ఇక్కడ జరిగే ఉత్సవాలు, పోతురాజుల విన్యాసాలు, నృత్యాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, భక్తిగీతాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక మరీ ముఖ్యంగా లష్కర్‌ బోనాల మరుసటి రోజు మాతంగి స్వర్ణలత చెప్పే భవిష్యవాణికి ప్రత్యేకత ఉంది.

Advertisement

హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా!

రంగం భవిష్యవాణి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత వినిపించిన భవిష్యవాణి భక్తులను ఆలోచనలో పడేసింది. ఈ ఏడాది రైతుల ఊరట కలిగించేలా కుండపోత వర్షాలు కురుస్తాయని చెప్పారు. కానీ మరోవైపు అగ్ని ప్రమాదాలు, వరదలు ఎక్కువయ్యే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాను ఇక్కడికి సంతోషంగా రాలేదని.. క్రోధంతో వచ్చానని చెప్పడం భక్తులను భయానికి గురిచేసింది. విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని చెప్పి చేయలేదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. దీనికి ఎవరు అడ్డుపడినా ఊరుకోనని హెచ్చరించారు.

Advertisement

ఇటీవల జరుగుతున్న నేరాల నేపథ్యంలో ప్రజల్లో అహంకారం పెరిగిందన్న మాతంగి.. మనుషులు వావివరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం వచ్చినా కాపాడుతున్నానని.. కానీ కొందరు చేసే చర్యలు తనకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు, అగ్ని ప్రమాదాల కారణంగా ఈ ఏడాది భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

అధికారిక పండుగ

ఇక, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత బోనాల ఉత్సవాలు రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ ఏటా రూ. కోట్లలో నిధులు కేటాయిస్తోంది. ఈ ఏడాది రూ. 20 కోట్లు నిధులు కేటాయించింది. పెద్ద ఆలయాలతో పాటు చిన్న ఆలయాలకు నిధులు సమకూరాయి. భక్తులకు ఎలాంటి అసాకర్యం కలగకుండా జీహెచ్‌ఎంసీ, పోలీసు, జలమండలి, విద్యుత్‌, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

Advertisement

కుజ, రాహువుల మధ్య నవపంచమ యోగం.. ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు

వందల ఏళ్ల చరిత్ర

దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బోనాల పండుగకు ఆ కాలంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయ రాజుల కాలం నుంచే ఈ ఉత్సవాలు జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రతి ఏటా తొలి బోనం గోల్కొండలోనే సమర్పించడం ఆనవాయితీ. ఆ రోజుల్లో ప్రజలను పట్టి పీడిస్తున్న తీవ్రమైన మహమ్మారి వ్యాధుల నుంచి అమ్మవార్లు కాపాడుతుండంతో భక్తితో, విశ్వాసంతో ఈ సంప్రదాయం అనాదిగా కొనసాగుతూ వస్తోంది. బ్రిటిష్‌ పాలకులు, ముస్లిం నవాబులు సైతం ఈ పండుగ విశిష్టతను గుర్తించి వేడుకలు నిర్వహించారు. తెలంగాణతో పాటు ఆంధ్రా, రాయలసీమ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోనూ ఈ ఆషాఢ బోనాలు వేడుకలు ప్రసిద్ధి చెందాయి.