నిజంగా ఆధ్యాత్మికం అంటే ఏమిటి?


మీరు ఆధ్యాత్మిక ధోరణితో జీవిస్తున్నారా ? ఈ ప్రశ్నవేసినప్పుడు, వారు తమ విశ్వాసానికి అనుగుణంగా ప్రార్థనా స్థలాలను సందర్శిస్తూ, ఆచారాలను, సంప్రదాయాలను, వేడుకలను కూడా పాటిస్తూ, యోగా మరియు ద్యాన నిబంధనలకు కట్టుబడి ఉంటారు కనుక , సమాధానం అవును అనే వస్తుంది.

Advertisement

ఇవన్నీ జీవితంలో అనుసరించగల మంచి పద్ధతులు అయినప్పటికీ, వీటిని లేదా వీటిలో కొన్నింటిని అనుసరిస్తున్న కారణంగా మాత్రమే, దానిని ' ఆధ్యాత్మికం ' అని అనలేము. అలాంటప్పుడు, ఆధ్యాత్మికతకు గల సరైన నిర్వచనం ఏమిటి? నిజ౦గా ఆధ్యాత్మిక భావ౦ అ౦టే ఏమిటి? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కొన్ని స౦వత్సరాల కాల౦ నుండి, ఇంతకూ ముందెన్నడూ లేని విధంగా మరి౦త ఎక్కువమంది ప్రజలు తమను తాము ఆధ్యాత్మికవాదులుగా పిలుచుకుంటూ ఉన్నారు. వాస్తవంగా, మునుపెన్నడూ లేనివిధంగా ప్రస్తుతం ఆధ్యాత్మిక ధోరణుల వేగం పుంజుకుంది. కాని తరచుగా ప్రజలు ఆధ్యాత్మికత మరియు మతం మద్య గందరగోళానికి గురవుతూ ఉంటారు. అంతేకాకుండా ఒకరి ఆహారపు అలవాట్లను కించపరచేలా మాట్లాడే స్వభావం అలవడుతూ ఉంది. ఒక మతాన్ని పరిపూర్ణంగా అనుసరిస్తే అంతిమంగా, అది మిమ్మల్ని ఆధ్యాత్మిక వ్యక్తిగా తీర్చిదిద్దవచ్చు. క్రమంగా ఏ ఇతర మతానికి చెందిన వ్యక్తి, మిమ్మల్ని ఆధ్యాత్మిక భావనలకు గురిచేయలేకపోవచ్చు. వారి విధానాలు కూడా మీకు నచ్చకపోవచ్చు.

Advertisement

కొందరికి, మతవాదులుగా ఉ౦డడమే, ఆధ్యాత్మికతకు ప్రాథమిక మెట్టుగా పరిగణించవచ్చు. మరియు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఒక నిర్దిష్ట మతాన్ని లేదా విశ్వాసాన్ని అనుసరించవచ్చు. క్రమంగా ఆచారాలు మరియు పద్ధతులను కూడా అనుసరించడం జరుగుతుంది. అయితే ఇదంతా ఎంత వరకు ఆధ్యాత్మిక ధోరణిగా పరిగణించవచ్చు ? పూర్తిగా ఆధ్యాత్మిక ధోరణిని అలవరచుకోవాలంటే, ఏం చేయవలసి ఉంటుంది?

ఆధ్యాత్మికత ధోరణికి నిర్వచనం సెట్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు, ఈ పదం ఆత్మ లేదా స్ఫూర్తితో అనుసంధానమవుతుంది. ఇది అత్యంత సహజసిద్దమైన సుగుణంగా, లేదా ఆత్మకి అనుసంధానంగా ఉండే స్థితిగా చెప్పబడుతుంది. కొ౦దరికి ఆధ్యాత్మిక భావన అనేది, వస్తు స౦పాదనకు, ధనాకాంక్షలకు వ్యతిరేఖ౦గా ఉ౦టు౦ది. కానీ భిన్న స్వభావాల నేపధ్యంలో భిన్న పోకడలు స్పురిస్తూ ఉంటాయి. ఈ కాలంలో కొందరు ఆద్యాత్మికత పేరున ధనాకాంక్షను కూడా కలిగి ఉండడం, ఆద్యాత్మిక చింతనను పక్కదోవ పట్టించేలా తయారైంది అన్నది జగమెరిగిన వాస్తవం.

Advertisement

ఆధ్యాత్మికతలో కూడా భౌతికమైన లోకాన్ని చూసి ఆనందించవచ్చు. స్వీయ విచారణ మరియు స్వీయ నిర్ణయం మరియు జీవితానికి గల నిఘూడ అర్ధాన్ని కనుగొనగలిగే అద్భుతమైన మార్గంగా ఆత్యాత్మికత ఉంటుంది. కావున, ఒక ఆధ్యాత్మిక ధోరణిని కలిగి ఉన్న వ్యక్తికి, ఒక నిర్దిష్ట మతం లేదా సమాజం లేదా సమూహం నుండి మద్దతు అవసరం లేదు. మానసిక ప్రశాంతతను చేకూర్చే స్వచ్చమైన ఆలోచనలే ఆద్యాత్మికత మార్గంగా ఉన్నవారు ఈ ప్రపంచంలో కోకొల్లలు. ఎవరైనా తమ జీవితం అందించే నిజమైన జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందినప్పుడు ఆధ్యాత్మికంగా ఒక స్థితికి చేరుకుంటారు.

Advertisement

ఒక వ్యక్తి నిజమైన ఆధ్యాత్మిక ధోరణిని కలిగి ఉన్నాడని సూచించే కొన్ని లక్షణాల గురించి, క్రింద వివరణ ఇవ్వబడింది.

మానసిక పరిపూర్ణత (సమన్వయ ధోరణి కలిగి ఉండడం) :

బయటి ప్రపంచంలోని అందమైన, ఖరీదైన వస్తువుల గురించిన ఆలోచన చేయక, తమ అవసరాన్ని పరిధులను మించకుండా ఆలోచన చేయగలిగిన వారిగా ఈ ఆధ్యాత్మిక ధోరణి కలిగిన వ్యక్తులు ఉంటారు. బదులుగా, వారు తమలో తామే ఒక అందమైన ప్రపంచాన్ని, ప్రయాణాన్ని కలిగి ఉంటారు.

తమలో తామే దృష్టి కేంద్రీకరించగలిగి, ' బయటి నుంచి గడపటానికి ' ఈ ప్రయాణం ఆధ్యాత్మిక వ్యక్తుల జీవితాల్లో అత్యంత మౌలికమైనదిగా చెప్పబడుతుంది.

Advertisement

ఏకత్వాన్ని గూర్చిన జ్ఞానము :

ఈ ప్రపంచంలో ప్రతి విషయములోనూ, ఒకదానితో మరొకటి అనుసంధానమయ్యే అమూల్యమైన జ్ఞానాన్ని ఆధ్యాత్మిక వ్యక్తులు పొందుతారు. అతడు ఒక వ్యక్తి యొక్క భావనను ఆస్వాదించగలుగుతాడు. మరియు వారికి అపారమైన ఆనందాన్ని మరియు సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు. మరియు సామరస్యాన్ని కలిగి ఉన్న కారణంగా, ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఎటువంటి ఇతర వ్యాపకాలను కలిగి ఉండరు.

సానుభూతిపరులు :

ఆధ్యాత్మిక ప్రజలు ప్రతి విషయములోను దయాహృదయాన్ని కలిగి ఉంటారని, జ్ఞానంతో వ్యవహరిస్తారని నొక్కి చెప్పబడుతుంది. ఈ జ్ఞానం తిరిగి ఏమీ ఆశించకుండానే ప్రజలకు ప్రేమ మరియు సేవను అందివ్వడం జరుగుతుంది. తమను తాము భాగం చేసుకుని, అందరికీ సేవలందించడంలోనే వీరు ఆనందాన్ని చూడగలుగుతారు.

కృతజ్ఞతా దృక్పథం :

కృతజ్ఞతా దృక్పధాన్ని సాధన చేయడం ఆధ్యాత్మిక వ్యక్తులకు ఉండాల్సిన ప్రాథమిక స్వభావం. జీవితం తమకు అత్యుత్తమమైనదిగా భావిస్తూ, విశ్వం తమకు అధిక శక్తిని చేకూరుస్తుందని తెలుసుకోవడం ద్వారా, వారు కృతజ్ఞతా భావాన్ని పొందగలుగుతారు.

అధిక శక్తితో అనుసంధానం కావడం :

ఆధ్యాత్మిక వ్యక్తులు నిరంతరం ఒక ఉన్నతమైన శక్తితో అనుసంధానమై ఉంటారు. ఈ శక్తి వారిని తమ ఆధీనంలో ఉంచుకుంటుందని చెప్పబడుతుంది. ఆత్మ యొక్క ఈ ఉన్నతమైన కొలమానం, ఆధ్యాత్మికత పరాకాష్టకు చేరుకోవడానికి గల మార్గదర్శిగా ఉంటుంది.

అందరిలో సమానత్వాన్ని చూడడం :

ఆధ్యాత్మిక వ్యక్తులు అన్ని సందర్భాలలోనూ, తమ మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ఈ ప్రత్యేకమైన కళపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. అది సంతోషమైనా, బాధైనా , ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనశ్శాంతిని కలిగి ఉండగలరని చెప్పబడుతుంది.

అవగాహన ఉండటం మరియు స్పృహలో ఉండటం

జీవితాన్ని మరింత ఉన్నత దృక్కోణంలో చూడగలిగినవారిగా, పూర్తి అవగాహనతో ఆచరించడం ఆధ్యాత్మిక ధోరణి కలిగిన వ్యక్తుల ప్రధాన లక్షణంగా చెప్పబడుతుంది. వీరు తమ యొక్క అన్ని చర్యలను పూర్తి అవగాహనతో చేయగలుగుతారు. మరియు జీవితాన్ని కూడా అద్భుతంగా మలచగలుగుతారు.

ఇవి కేవలం ఆధ్యాత్మిక వ్యక్తుల లక్షణాల్లో కొన్ని మాత్రమే అయినప్పటికీ, ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించవచ్చు. మరియు ప్రతి ఒక్కరూ వారి ఆత్మ నుండి సంకేతాలను పొందే క్రమంలో భాగంగా ఈ ప్రయాణం సాగించాల్సిన అవసరం ఉంటుందని చెప్పబడుతుంది.

ఆధ్యాత్మిక మార్గంలో నడవడం కూడా ఛాలెంజింగ్ గా ఉండవచ్చు, అయితే, తమ మతపరమైన విశ్వాసాలను మించి, నిరంతర ప్రయాణంలో ఉన్నప్పుడు మాత్రమే పూర్తి స్థాయి జ్ఞానాన్ని ఆస్వాదించగలరని, క్రమంగా ఆ మార్గంలో ప్రయాణించిన అనేకమంది గొప్ప వ్యక్తుల నుండి ప్రేరణ పొందగలరని చెప్పబడుతుంది. అంతేకాకుండా ప్రతిమనిషికి తనకంటూ, ప్రత్యేకమైన భావాలు, అభిప్రాయాలు మరియు అలవాట్లు ఉంటాయి. ఏరోజైతే, వాటన్నిటినీ కూడా ఆహ్వానించి సాధ్యాసాద్యాల పరిణితి సాధించగలిగి, వాస్తవిక ధోరణిని అవలంభించుకుంటారో, అప్పుడే ఆద్యాత్మిక ధోరణికి పరిపూర్ణ అర్ధం ఉంటుందని ఆద్యాత్మిక పెద్దల సూచనగా చెప్పబడుతుందని గుర్తుంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

One might affirm themselves to be spiritual as they are regular visitors of the places of worship as per the faith they belong to, devotedly follow the rituals, practices and ceremonies and are also committed to their Yoga and meditation time. A spiritual person is the one who is tuned inward, compassionate and serving and equanimous.