భారతీయ వివాహాది శుభకార్యములలో పసుపును విరివిగా వినియోగించుటకు గల కారణాలు

వధూవరులను దుష్ట శక్తుల బారిన పడకుండా కాపాడే క్రమంలో భాగంగా కూడా పసుపును వినియోగించడం జరుగుతుంది. అందుకే నలుగు, మెహెందీ తర్వాత వధూవరులను పొలిమేరలు దాటకుండా చేయడానికి గల కారణాలుగా చెప్పబడుతుంది. నిర


భారతీయ సాంప్రదాయక వివాహ వేడుకలలో పసుపు చందనానికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వబడింది. వీటి వెనుక అనేక నమ్మకాలు విశ్వాసాలు బలంగా ఉన్నాయి, కాని అవేమిటో ఎప్పుడైనా ఆలోచించారా ? ఇక్కడ వివాహాది శుభకార్యాలనందు, పసుపు ప్రాముఖ్యత గురించిన వివరాలను పొందుపరచడం జరిగింది.

Advertisement

పసుపు ప్రధానంగా రక్షణను సూచిస్తుంది; క్రమంగా, వివాహాది సాంప్రదాయక విషయాలలో దీనిని ఉపయోగించడం అత్యంత కీలకంగా ఉంటుంది.

Advertisement

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పసుపు అనేది మానసిక, శారీరిక సంబంధిత అంశాల పరంగా సూచించదగిన అద్భుతమైన ప్రక్షాళనగా భావించడం జరుగుతుంది. ఇది యుక్తవయసులోకి అడుగుపెట్టిన యువతి వైవాహిక జీవితాన్ని స్వాగతించడానికి సూచనగా చెప్పబడుతుంది. అందుకే పసుపు అంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

భారతీయ వివాహాది శుభకార్యాల పరంగా పసుపుకు ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాధాన్యతను ఇవ్వడానికి గల ప్రధాన కారణాల గురించిన మరిన్ని వివరాలకోసం ఈ వ్యాసాన్ని చూడండి.

పసుపు ఆశీర్వాదానికి సంకేతం :

పసుపును దంపతుల ఆరోగ్యకర వైవాహిక జీవితానికి చిహ్నంగా భావించబడుతుంది. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల ప్రకారం, ముత్తైదువులందరూ కలిసి వధూవరులిద్దరికీ పసుపును రాయడం ద్వారా దీవెనలను అందించడం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. దీన్ని పెళ్ళికి ముందు గంధం నలుగు, లేదా నలుగుగా జరుపబడుతుంది. సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఆశీర్వదించడానికి ఇది ఒక మార్గంగా చెప్పబడుతుంది.

Advertisement

ప్రకాశవంతమైన మరియు సహజ సిద్దంగా మెరిసే చర్మం కోసం :

పసుపు, చర్మాన్ని ప్రకాశవంతంగా చేసేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా వ్యక్తి యొక్క చర్మ సౌందర్యాన్ని మరియు ఆరోగ్యాన్ని పెంచేక్రమంలో భాగంగా అనేకరకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మీ పెళ్లి రోజున మీరు తాజా, ప్రకాశవంతమైన మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని కలిగి ఉండేలా పసుపు మీకు ఉపకరిస్తుంది. మరో వైపు, చనిపోయిన మృత చర్మ కణాలను తీసివేయడంలో కూడా మీకు సహాయపడుతుంది, క్రమంగా సహజసిద్దమైన మెరిసే రంగును అందిస్తుంది.


మీ మనసును పరిశుద్ధపరచడంలో :

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పసుపు దాంపత్య జీవితంలోకి ప్రవేశించే వ్యక్తుల మనసును శుద్ది చేయడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. దీనితో పాటుగా, సరికొత్త జీవితానికి పవిత్రమైన ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది.

Advertisement

దుష్ట శక్తులను పారద్రోలుటకు :

వధూవరులను దుష్ట శక్తుల బారిన పడకుండా కాపాడే క్రమంలో భాగంగా కూడా పసుపును వినియోగించడం జరుగుతుంది. అందుకే నలుగు, మెహెందీ తర్వాత వధూవరులను పొలిమేరలు దాటకుండా చేయడానికి గల కారణాలుగా చెప్పబడుతుంది.

నిరాశను దూరం చేస్తుంది :

వేడుకలలో పసుపును ఉపయోగించడం ద్వారా, వివాహాల ముందు ప్రతికూలతలను అరికట్టేందుకు సహాయపడుతుంది. పసుపును హిందీలో హల్ది, ఇంగ్లీష్లో కర్క్యుమిన్ అని పిలవడం జరుగుతుంది. ఇది తలనొప్పి మరియు ఆందోళనలకు సహజ సిద్దమైన నివారణగా పనిచేస్తుంది. అంతేకాకుండా నాడీ ఉద్దీపనను తగ్గించడానికి సూచించదగిన అద్భుతమైన పరిష్కారంగా పనిచేస్తుంది.

Advertisement

పసుపు సాంప్రదాయక పదార్ధంగా పూర్వీకుల కాలం నుండి వారసత్వంగా వస్తూ ఉంది. దీనిలోని శారీరిక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు దృష్ట్యా వంటల నుండి వివాహాది వేడుకల వరకు ప్రతి అంశములోనూ దీనిని విరివిగా వాడడం జరుగుతుంది. పైగా ఎటువంటి దుష్ప్రభావాలు లేనిదిగా, ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రేరేపించేదిలా ఉంటుంది. అందుకే వేడుకల సంపూర్ణత కోసంగా పసుపును వాడడం జరుగుతుంది అని చెప్పబడింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

~

English Summary

Reason Why Haldi Is Used In Indian Weddings