Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
2025లో ఈ రాశుల వారు వద్దన్నా కోటీశ్వరులు అవుతారు.. ఈ రాశి వారు ఉంటే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతారు!
కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టుకుంటుంది. బిచ్చగాడు సైతం కోటీశ్వరుడయ్యే అవకాశాలు ఉంటాయి. అంతటి శక్తివంతమైన గ్రహాల కలయిక వచ్చే ఏడాది జరగబోతుంది. ఈ కలియిక వల్ల ఏ రాశి వారు బిచ్చగాడు నుంచి కోటీశ్వరుడు స్థాయికి వెళ్ళగలరు, అంతటి శక్తివంతమైన ఆ గ్రహాల కలయిక ఎవరిదీ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయంటే?
వచ్చే సంవత్సరం న్యాయదేవుడైన శని, సుఖ సంతోషాలు, భాగ భోగ్యాలకు కారణమయ్యే శుక్రుడి కలయిక జరగనుంది. ఈ కలయిక అత్యంత శక్తివంతమైనది. ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అనుకోని విధంగా అదృష్టం పట్టుకోనుంది. ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కడంతో పాటు ఇప్పటి వరకు వినని శుభవార్తలు వింటారు. అద్భుతమైన కుటుంబంతో పెళ్లి సంబంధాలు ఖరారవుతాయి. ఇంతకీ ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభ: శనీశ్వరుడు, శుక్ర గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి అనేక లాభాలు కలగనున్నాయి. అనుకోని విధాలుగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీని కారణంగా ఆర్ధిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అనుకోని స్థాయిలో లాభాలు వస్తాయి. దీంతో వ్యాపారాన్ని కూడా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోవడంతో పాటు, దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కొన్ని మంచి స్నేహాలు కుదిరే అవకాశం ఉంది. విహార యాత్రలకు వెళ్లేందుకు కృషి చేస్తారు.
కర్కాటక రాశి: లాటరీ తగిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ రాశి వారి జీవితం 2025. లాటరీ తగిలినా ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు 2025లో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. లేదంటే కొత్త వాహనాన్ని కూడా కొనే అవకాశం కనిపిస్తుంది. కొంత కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు చేతికి అంది వస్తుంది. దీంతో తప్పకుండా భూమి కొనే అవకాశం కనిపిస్తుంది. ఆ భూమి విలువ కూడా అమాంతం పెరిగేందుకు ఛాన్సుంది. కర్కాటక రాశి జాతకులు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే 2025 మీకు మంచి సమయం. ఆ సంవత్సరం మీరు వ్యాపారం ప్రారంభిస్తే కచ్చితంగా లాభపడతారు.
కన్య రాశి: 2025లో ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో పాటు ఈ రాశి వారికి అదృష్టం కూడా పట్టుకోనుంది. దీని కారణంగా ఈ రాశి వారి జీవితం ఇకముందు లేనంతగా మారిపోతుంది. వివాహ జీవితం ఆనందమయంగా మారిపోనుంది. ఆర్థికంగా ఇప్పుడున్న స్థాయి నుంచి మరో స్థాయిలోకి మారిపోతారు. అన్ని రకాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరిగిపోతాయి. దీంతో ఆర్ధిక సమస్యలన్నీ తొలగిపోయి సంపన్నమైన జీవితాన్ని గడుపుతారు.
కాకపోతే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను పెద్దలను సంప్రదించి తీసుకోవాలి. లేకపోతే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి వారు 2025లో ఎంత కష్టపడితే అంతలా పైకి వస్తారు. అంతలా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు జోతిష్య నిపుణులు, పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. జోతిష్య శాస్త్రం, రాశి ఫలాలు మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు మాత్రమే. వాటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications