Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ రాశుల వాళ్లు రొమాన్స్ లో కింగులు, క్వీనులు - అలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితం సూపరో సూపర్!
ప్రతీ ఒక్కరూ తమ జీవితంలోకి రాబోయే భాగస్వామి చాలా అందంగా, రొమాంటిక్ గా ఉండాలని భావిస్తుంటారు. ఎప్పుడూ తమపై ప్రేమ కురిపిస్తూ.. ముద్దులు, హగ్గులు ఇవ్వాలనుకుంటారు. అందరి ముందు అన్యోన్యమైన జీవితం గడుపుతున్నట్లుగా కనిపించాలని తెగ ఆరాట పడిపోతుంటారు. అయితే అలాంటి వాళ్లను పెళ్లి చేసుకోవాలనుకునే వారి కోసమే ఈ స్టోరీ. ఈ రాశుల వాళ్లు చాలా రొమాంటిక్. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. వృషభ రాశి
ఈ రాశి వాళ్లు తమ సంబంధాల్లో చాలా నిబద్ధతను కల్గి ఉంటారు. భాగస్వాములకు విశ్వాస పాత్రులు. భాగస్వామిపై విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఎల్లప్పుడూ భాగస్వామిని విడిచి పెట్టకుండా వెన్నంటే ఉంటారు. తమ భార్య లేదా భర్తపై ఎప్పుడూ శారీరక సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఎప్పుడూ రొమాంటిక్ గా ఉంటారు.
2. కర్కాటక రాశి
ఈ రాశి వాళ్లు చాలా ఎమోషనల్. వీరికి సంబంధాల్లో భద్రత ఉంటుంది. భాగస్వామి భావాలను ఎక్కువగా గౌరవిస్తారు. వీరు రొమాన్స్, శృంగారం పట్ల చాలా ఉత్సాహంగా ఉంటారు.
3. తులారాశి
తులారాశి వాళ్లు సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తుంటారు. సంబంధాలను కూడా గౌరవిస్తారు. తమ భాగస్వామితో మానసికంగా చాలా అటాచ్ అయి ఉంటారు. భాగస్వామితో నిరంతరం సాంగత్యం ఉండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు భాగస్వామిపై ఆధారపడతారు.
4. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్లు కూడా భావోద్వేగం ఎక్కువగా కల్గిన వ్యక్తులు. వారు తమ భాగస్వాములతో శారీరకంగా, మానసికంగా చాలా డీప్ గా ఉండాలని కోరుకుంటారు. ఈ కారణంగా వాళ్లు ఎల్లప్పుడూ తమ భాగస్వామితో కట్టుబడి ఉంటారు.
5. మీనరాశి
మీనరాశి వాళ్లు చాలా రొమాంిక్ గా ఉంటారు. భాగస్వామి తమను తిరస్కరిస్తారేమోననే భయం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ భయంతోనే వీరు భాగస్వామిని క్షణం కూడా వదిలిపెట్టరు. ఎప్పుడూ వారి వెంటే ఉంటూ ప్రేమను చూపిస్తారు. రొమాన్స్ చేస్తూ.. తమ సాంగత్యాన్ని పెంచుకుంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications