మీ ఇంట్లో ఇలా జరుగుతుందా? పెద్ద సంక్షోభంలో ఉన్నట్లే..వెంటనే ఈ పరిష్కారం చేయకపోతే డేంజర్!

ఇల్లు అంటే కేవలం గోడలు,పైకప్పు మాత్రమే కాదు. మన ఆనందానికి, ఆరోగ్యానికి, శ్రేమస్సుకి ఇల్లు ప్రతిబింబంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ మన ప్రశాంతతకు భంగం కలిగిసస్తుంటది. ఒక్కోసారి ఇంటిని ఉన్నట్టుంది ఆందోళన, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు చట్టుముడతాయి. అయితే మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉండి ఉండవచ్చు. దీనికి ఏం పరిష్కారం చేయాలో,పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.

మీ ఇంట్లో పెద్ద సంక్షోభం రాబోతుందని సూచించే 5 సంకేతాలు

ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇలా అవుతంటే

ఇంట్లోకి అడుగుపెట్టగానే మీ మనస్సు దిగులుగా, కలవరంగా మారుతోందా? ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముట్టినట్లు అనిపిస్తుందా? అయితే మీ ఇంట్లో బృహస్పతి బలహీనంగా ఉన్నాడని అర్థం. బృహస్పతి గ్రహం..జ్ణానం,ఆనందం, శ్రేయస్సుకి కారకుడు. బృహస్పతి బలహీనంగా ఉంటే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడి మనశ్శాంతి కరువవుతుంది. కాబట్టి రోజూ సాయంత్రం మీ ఇంటి పూజా మందిరంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత, గుగ్గిలం ధూపం లేదా అగర్బత్తిని వెలిగించి ఇంటి మొత్తం చూపించండి. ఇది ప్రతికూల శక్తిని తొలగించి, ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఈ చిన్న మార్పులతో మీ ఇంట్లో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయి.

5 Strange things happening at home this could be a sign of big crisis

ఎలక్ట్రిక్ వస్తువులు పాడవడం

మీ ఇంట్లో ఫ్రిజ్, టీవీ, బల్బులు, ట్యూబ్‌లైట్లు తరచూ పాడవుతున్నాయా? చిన్న చిన్న మరమ్మత్తులు కూడా పెద్ద ఖర్చులతో కూడుకున్నవిగా మారుతున్నాయా? అయితే ఇది రాహువు దుష్ప్రభావాలకు సంకేతం అవొచ్చు. రాహువు గ్రహం.. ఆకస్మిక మార్పులు, ప్రమాదాలకు కారకుడు. రాహువు దోషం ఉంటే ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు తరచూ పాడవుతాయి. అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంట్లోని ప్రతి గది బయట స్వస్తిక గుర్తుని పెట్టండి. ఎరుపు రంగు స్వస్తికను ఉంచడం వల్ల రాహువు ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.

ఎటువంటి కారణం లేకుండా గొడవలు
మీ ఇంట్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు, లేదా ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి కారణం లేకుండా గొడవలు జరుగుతున్నాయా? చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద కలహాలకు దారితీస్తున్నాయా? అయితే ఇది కుజ గ్రహం ప్రతికూల ప్రభావానికి సంకేతం కూడా కావచ్చు. కుజుడు.. కోపం, కలహాలు, విభేదాలకు కారకుడు. కుజుడి దోషం ఉంటే ఇంట్లో అనవసరమైన గొడవలు పెరుగుతాయి, కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లోకి సూర్యకాంతి బాగా వచ్చేలా చూసుకోండి. సూర్యకాంతి ఇంట్లోని ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. ప్రతి శనివారం కుటుంబ సభ్యులందరూ కలిసి సుందరకాండ పారాయణం చేయడం వల్ల కుజుడి ప్రభావం తగ్గుతుంది. ఇలాచేస్తే ఇంట్లో అనవసరమైన గొడవలు తగ్గుతాయి. ఇంట్లో శాంతి,సంతోషం ఉంటుంది.

పిల్లలు ఏడుస్తుంటే..
మీ పిల్లలు పెద్దగా కారణం లేకుండానే ఏడుస్తున్నారా ? రాత్రిపూట భయంతో ఉలిక్కిపడుతున్నారా? సాధారణం కంటే ఎక్కువగా గొడవ చేస్తున్నారా? అయితే ఇది చంద్రుడి బలహీన స్థితికి సంకేతం కావచ్చు. చంద్రుడు.. మనస్సు, భావోద్వేగాలకు కారకుడు. చంద్రుడి దోషం ఉంటే పిల్లలు భయపడతారు, ఏడుస్తారు, గొడవ చేస్తారు. దీనికి పరిష్కారం ఏంటంటే..ఇంటిని శుభ్రం చేయడానికి సువాసనగల ఫినాయిల్ ఉపయోగించడం వల్ల, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని పండితులు తెలిపారు. ఇంట్లో పూలతో అలంకరించాలి. తగినంత వెలుతురు ఉండేలా చూసుకోండి. దీంతో పిల్లల భయం, ఏడుపు, గొడవలు తగ్గుతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

తరచుగా అనారోగ్యం

మీ ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మందుల ఖర్చు తడిసి మోపెడవుతోందా? అయితే ఇది సూర్య గ్రహం యొక్క బలహీన ప్రభావానికి సంకేతం కావచ్చు. సూర్యుడు.. ఆరోగ్యం, శక్తి, తేజస్సులకు కారకుడు. సూర్య దోషం ఉంటే ఇంట్లో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయం గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆహారం వండిన తర్వాత, కొంత ఆహారాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి, ఆ తర్వాత తినడం వల్ల సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Saturday, April 12, 2025, 16:35 [IST]
Desktop Bottom Promotion