Latest Updates
-
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!
సంచులతో సిద్ధంగా ఉండండి..ఈ రాశులకు ఇంట్లో కనకవర్షం..బాబా వంగా సంచలన జోస్యం
ప్రపంచవ్యాప్తంగా తన అద్భుతమైన జోస్యాలతో ప్రసిద్ధి చెందిన బల్గేరియన్ అంధ ప్రవక్త బాబా వంగా.. భవిష్యత్తు గురించి చెప్పిన అనేక విషయాలు నిజమై చరిత్రలో నిలిచిపోయాయి. చిన్న వయస్సులో ఓ ప్రమాదంలో కంటిచూపు కోల్పోయిన బాబా వంగా..తన జ్ణానదృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘనలు చూసే శక్తిని పొందగలిగినట్లు నమ్ముతారు. ఆమె తన మరణానికి ముందే 5079వ సంవత్సరం వరకు జరగబోయే సంఘటనల గురించి జోస్యం చెప్పారు. 9/11 దాడి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రిన్సెస్ డయానా మరణం, బ్రెగ్జిట్ వరకు అనేక విషయాల్లో ఆమె జోస్యం నిజమైంది.
2025 సంవత్సరం గురించి కూడా బాబా వంగా కొన్ని ఆసక్తికరమైన అంచనాలు వేశారు. వీటిలో ముఖ్యంగా 2025 చివరి మూడు నెలలు (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) 3 రాశుల వారికి భారీగా అదృష్టాన్ని, అనూహ్యమైన సంపదను తీసుకురాబోతున్నాయని బాబా వంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2025 చివరి మూడు నెలల కాలంలో 3 రాశుల వారు లక్షాధికారులుగా మారే బలమైన అవకాశాలు ఉన్నాయని ఆమె భవిష్యవాణిలో తెలిపారు. ఆ అదృష్ట రాశులేంటో, వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయో ఇప్పుడు చూద్దాం.

మిథున రాశి
ఈ ఏడాది చివరి క్వర్టర్ లో మిథున రాశి వారి అదృష్టం ఆకాశమే హద్దుగా ఉంటుంది. గ్రహాల అనుకూలత వల్ల ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోరికలు, కలలు నెరవేరుతాయి. ఆర్థికంగా, ఆదాయ మార్గాలు వెల్లువెత్తుతాయి. ఊహించని మార్గాల నుంచి డబ్బు వచ్చి చేతిలోకి నిలుస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు భారీ లాభాలను ఆర్జిస్తారు, ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటు జీతాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సంక్షోభాలు, అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోయి, ప్రశాంతమైన జీవితం లభిస్తుంది.
కన్య రాశి
కన్య రాశి వారికి 2025 చివరి మూడు నెలలు ఆర్థికంగా స్వర్ణయుగమనే చెప్పాలి. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పాత అప్పులు తీరిపోవడమే కాకుండా ఆకస్మిక ధన లాభం పొందే సూచనలు బలంగా ఉన్నాయి. వారసత్వ ఆస్తులు లేదా పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా స్థిరపడటానికి, భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి ఇది సరైన సమయం. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కి, సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వీరి ఆర్థిక విజ్ఞతకు అందరూ ఆశ్చర్యపోతారు.
కుంభ రాశి
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు కుంభ రాశి వారి జీవితంలో ఆనందాన్ని, సంపదను నింపబోతున్నాయి. గతంలో మిమ్మల్ని వెన్నంటిన ప్రతికూల శక్తులు, అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఆగిపోయిన పనులు, పూర్తికాని ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. ఇది వారికి ఆర్థికంగా గొప్ప బలాన్ని ఇస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన కాలం. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంపదతో పాటు సంతోషం కూడా వీరి సొంతమవుతుంది
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











