Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.!
సెప్టెంబర్ 4న శ్రీ కృష్ణ జన్మాష్టమి. మతపరంగా, జ్యోతిష్యపరంగా ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. అంతేకాకుండా కృష్ణాష్టమి రోజు రాత్రి అనేక శుభ గ్రహ, నక్షత్ర స్థానాలు ఒకే చోట కలవనున్నాయి. ద్వాపర యుగం నాటి కాలాన్ని మళ్లీ తీసుకువస్తూ ఈ అరుదైన కలయిక ప్రత్యేకమైన యాదృచ్ఛిక సంఘటనగా పండితులు అభివర్ణిస్తున్నారు. హర్షణ యోగం, సర్వార్థ సిద్ధి యోగంతో పాటు రోహిణి నక్షత్రం కూడా ప్రభావంలో ఉండటంతో ఈ యోగాలు శుభప్రదం కానున్నాయి. ఈ ప్రత్యేక గ్రహ సంయోగం ద్వారా ఐదు రాశుల వారి మరింత ప్రయోజనకరం కానుందని జ్యోతిష్యం చెబుతోంది.

పురాణాల ప్రకారం.. శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన సమయంలో వృశ్చిక రాశిలో రోహిణి నక్షత్రం ఉంది. అందుకే ఈ నక్షత్రానికి, అష్టమి తిథి కలయిక ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. దీంతో హర్షణ యోగం, సర్వార్థ సిద్ధి యోగాలు కూడా సంభవిస్తుండటంతో ఐదు రాశుల వారికి పురోగతి, ఆర్థిక లాభాలు.. ఇలా వారిపై కన్నయ్య కటాక్షం ఉండనుంది. మరి ఆ రాశులేంటి.. వారి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది.. తెలుసుకుందాం..
వృషభ రాశి
ద్వాపర కాలం నాటి ఈ అరుదైన సంఘటన వృషభ రాశి వారికి చాలా విధాలుగా కలిసి రానుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగించనుంది. డబ్బు చిక్కులు తొలగిపోనున్నాయి. బయట వ్యక్తుల వద్ద ఉన్న మీ డబ్బు మీకు తిరిగి దక్కుతుంది. ఉద్యోగం చేసే చోట పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించని లాభాలు, అవకాశాలు రానున్నాయి.
కర్కాటక రాశి
జన్మాష్టమి సందర్భంగా కర్కాటక రాశి వారికి శుభప్రదం కానుంది. ఎంతో కాలంగా వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి తొలగిపోనుంది. ఉద్యోగంలో కొన్ని సందర్భాలు, సంఘటనలు మీకు అనుకూలం కానున్నాయి. ప్రమోషన్లు, జీతం పెంపు, కొత్త అవకాశాలు అందుకోవచ్చు. కుటుంబంలో మనస్పర్థలు తొలగి శాంతియుతంగా మారుతుంది. వారితో సంతోషంగా గడుపుతారు.

సింహ రాశి
అరుదైన యోగాల సంభవం, రోహిణి, అష్టమి తిథుల ప్రభావంతో సింహ రాశి వారికి వివాదాలు పరిష్కారం కానున్నాయి. చట్టపరమైన విషయాల్లో ఉపశమనం పొందే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనుల్లోల వేగం పెరిగి విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట మీ గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. కొత్త బాధ్యతలు అందుకోవచ్చు. దీంతో మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.
తులారాశి
కృష్ణాష్ణమి రోజు జగన్నాధుడి కరుణా కటాక్షాలతో తులా రాశి వారి ఆర్థిక పరిస్థితులు బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆదాయ వనరులు, మార్గాలు పెరగవచ్చు. పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. దీంతో భవిష్యత్తులో దాని ప్రయోజనాలు చూస్తారు. వైవాహిక జీవితంలో ప్రేమ, మాధుర్యం పెరుగుతుంది. కుటుంబీకుల నుంచి శుభవార్త వింటారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారి కృష్ణాష్టమి సమయం అదష్టం, ఐశ్వర్యాన్ని తీసుకురానుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ సంస్థలకు సంబంధించిన ఉద్యోగాల్లో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. అనుకోకుండా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు పొందుతారు. దీంతో ఆర్థికంగా సంతోషంగా ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
