Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Numerology: ఈ తేదీల్లో పుట్టినవాళ్లకి పెద్ద కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
ఒక వ్యక్తి భవిష్యత్తు గ్రహాలు,నక్షత్రాల స్థితిగతులపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుండగా.. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా వారి స్వభావం,భవిష్యత్తుని న్యూమరాలజీ అంచనా వేస్తుంది. జోతిష్యశాస్త్రం ఎంత ముఖ్యమైనదో సంఖ్యాశాస్త్రం కూడా అంతే ముఖ్యమైనది. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులు సహజంగా ప్రత్యేక ప్రతిభ,సామర్థ్యాలను కలిగి ఉంటారు. వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధిస్తారని న్యూమరాలజీ నిపుణులు చెబుతారు.
ఏదైనా నెలలోని 1, 3, 5, 9 తేదీల్లో పుట్టిన వాళ్లు ధైర్యంగా ఉంటారు. పుట్టిన తేదీ సంఖ్య ఈ నెంబర్స్ తో సరిపోలితే ఆ వ్యక్తి చాలా సులభంగా సక్సెస్ సాధిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ తేదీలో పుట్టిన వాళ్లు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంటుందో ఇక్కడ చూడండి.

నెంబర్ 1(ఏదైనా నెలలోని 1,19,10,28 తేదీల్లో పుట్టినవాళ్లు)
ఏదైనా నెలలోని 1, 19, 10, 28 తేదీల్లో పుట్టినవాళ్ల రాడిక్స్ నెంబర్ 1 ఉంటుంది. నెంబర్ 1కి అధిపతి సూర్యుడు. ఈ శక్తివంతమైన నెంబర్ ఏదైనా ప్రారంభానికి ప్రతీక. నాయకత్వం,రాజకీయాలు,పరిపాలనా లక్షణాలు ఈ నెంబర్ లో ఉన్నాయి. 1, 19, 10, 28 తేదీల్లో పుట్టిన వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏదైనా క్లిష్టమైన పనిని సులభంగా పూర్తి చేయగలరు.
నెంబర్ 3(3,12,21,30 తేదీల్లో పుట్టినవాళ్లు)
ఏదైనా నెలలోని 3,12,21,30 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 3 ఉంటుంది. నెంబర్ 3 పాలక గ్రహం బృహస్పతి. ఇది అన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణించబడుతుంది. రాడిక్స్ నెంబర్ 3లో జన్మించిన వ్యక్తులు చాలా ఆత్మగౌరవంతో ఉంటారు. ఎవరికీ తలవంచడం వీరికి ఇష్టం ఉండదు. వీరి వ్యక్తిత్వం చాలా బలంగా ఉంటుంది.
సంఖ్య 5(5,14,23 తేదీల్లో పుట్టినవాళ్లు)
ఏదైనా నెలలో5,14,23 తేదీల్లో పుట్టినవారి రాడిక్స్ నెంబర్ 5. న్యూమరాలజీ ప్రకారం 5ని పాలించే గ్రహం బుధుడు. ఈ సంఖ్య చాలా బలంగా పరిగణించబడుతుంది. న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 5 జీవితంలో చాలా మెరుగుదలను తెస్తుంది. ఏం చేసినా పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. ప్రతిదీ స్వయంగా చేయడానికి ఇష్టపడతారు.
Note: నమ్మకాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని పాటించడం వ్యక్తుల ఇష్టాలు,సొంత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications