Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు రావడం సర్వసాధారణం. శరీరం అలసిపోయి సేదతీరుతున్నా బ్రెయిన్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మనసు లోతుల్లో పేరుకుపోయిన ఎన్నో ఆలోచనలు ఒక్కోసారి కలల రూపంలో మన కళ్ల ముందు తారసపడుతూ మరిచిపోయిన వాటిని మళ్లీ గుర్తు చేస్తుంటాయి. ఇదంతా ఒక వైపు అయితే.. అప్పుడప్పుడూ కొన్ని క్రిమికీటకాలు సైతం కలలో కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని మనకు శుభసంకేతాలను ఇస్తే మరికొన్ని అశుభాలను సూచిస్తుంది. అందులో బొద్దింక ఒకటి. బొద్దింక కలలో కనిపిస్తే ఏమవుతుంది.? దీనిపై స్వప్న శాస్త్రం ఏం చెబుతుంది.? తెలుసుకుందాం.

బొద్దింక అనగానే ముందుగా మహిళలకు గుర్తొచ్చేది కిచెన్. వంట గదిలో కొంచెం శుభ్రంగా లేకపోయినా, దుర్వాసన వస్తున్నా అక్కడ బొద్దింకలు వచ్చి చేరుతాయి. అవి క్రమంగా కుప్పలుగా సంచారం చేస్తుంటాయి. వాటిని పారదోలేందుకు, చంపేందుకు అతివలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆ క్రమంలోనే వాటిని ఎక్కువగా చూస్తుంటారు. రోజులో ఎక్కువసేపు వాటిని చూడటం వల్ల కలలో బొద్దింకలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
కలలో బొద్దింకలు వచ్చే సందర్భాలను బట్టి శుభాశుభాల గురించి స్వప్న శాస్త్రం చెబుతోంది. ఒకటి కంటే ఎక్కువ కాక్‌రోచెస్ కలలో కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణించాలి. మీ రహస్య శత్రువులు మీ వెనకే ఉంటూ మీకు హాని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. అలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.
అశుభ సంకేతాలు
మీ కలలో బొద్దింక ఎగురుతూ కనిపిస్తే మీరు ఏదైనా సమస్యను ఎదుర్కోబోతున్నారని హెచ్చరిక. అలాంటి సందర్భాల్లో మానసికంగా సన్నద్ధంగా ఉండాలని స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలో మీరు భోజనం చేస్తుండగా ఆహారంలో బొద్దింక ఉంటే మీరు చేసే పనులకు ఇతరులు ఆటంకం కలిగిస్తున్నారని అర్థం.

రోజంతా పనిచేసి అలసిపోయి మంచంపై సేదతీరుతాం. కానీ కలలో మంచం మీద మీరు బొద్దింకను చూసినట్లయితే అది మీ దాంపత్య జీవితం, ప్రేమ వ్యవహారాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం చెబుతోంది. మీ పార్ట్‌నర్‌తో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ ప్రశాంతత, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
శుభ సంకేతాలు
కలలో బొద్దింక కనిపించడం ఎప్పుడూ అశుభం కాదు. కొన్ని సందర్భాల్లో శుభానికి కూడా సూచనగా నిలుస్తుంది. ఎలాంటి వాతావరణంలో అయినా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా బొద్దింక పోరాడి జీవించగలదు. కాబట్టి పైన చెప్పిన సందర్భాలు కాకుండా ఇతర సందర్భాల్లో కనిపిస్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. మరోవైపు మీరు కలలో బొద్దింకను చంపినా, తరిమికొట్టినా శుభసంకేతమే. కష్టాలను అధిగమించే ధైర్యం ఉంటుంది. శత్రువులను ఎదుర్కొనే ధైర్యం పొందడంతో పాటు అనారోగ్యం బారి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications