Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Vastu: మీ ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉందా? ఈ విషయం తెలియకపోతే ప్రమాదమే
ప్రతి వ్యక్తి జీవితంలో వాస్తు శాస్త్రం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీవితంలో ప్రతిదీ వాస్తు ప్రకారం ఉంటే మంచిదని వాస్తు శాస్త్రం(Vastu shastram) తెలియజేస్తుంది. ఇల్లు ఏ దిక్కున ఉండాలి.. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంచాలి,ఇంటి ముందు ఎలాంటి చెట్లు ఉండాలి,ఎంట్రన్స్ గేట్ దగ్గర ఎలా ఉండాలి ఇలాంటి చాలా విషయాలు వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి. అయితే చాలామంది ఇళ్ల ముందు బొప్పాయి చెట్టు ఉండటం గమనిస్తుంటాం. ముఖ్యంగా పల్లెటూర్లలో ఎక్కువగా ఇళ్ల ముందు బొప్పాయి చెట్లు దర్శనమిస్తుంటాయి.
వాస్తు శాస్త్రంలో ఇంట్లో చెట్లు,మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో చెట్లు,మొక్కలు నాటడం వల్ల పాజిటివిటీ రావడమే కాకుండా వాస్తు దోషాలు తొలగిపోతాయి. అయితే చెట్లను నాటేటప్పుడు కొన్ని చెట్లు లేదా మొక్కలు ఇంటికి మంచివి కావని గుర్తుంచుకోవాలి. అయితే వాస్తు ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండటం మంచిదా కాదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది తమ ఇంటి ముందు లేదా ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో బొప్పాయి చెట్టును నాటుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం బొప్పాయి చెట్టును ఇంటి ఆవరణలో నాటకూడదు. ఎందుకంటే ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఇంటి ప్రాంగణంలో బొప్పాయి చెట్టు ఉంటే అది మీ ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. ఇదే కాకుండా మీ కుటుంబ ఆనందం,శాంతి కూడా ప్రమాదంలో ఉండవచ్చు. కాబట్టి మీ ఇంటి ప్రాంగణంలో బొప్పాయి చెట్టుని ఎప్పుడూ నాటకండి.

పెరట్లో బొప్పాయి చెట్టును నాటవచ్చా?
వాస్తు శాస్త్రంలో బొప్పాయి చెట్టును పెరట్లో నాటడం నిషేధించబడింది. ఇంటి ముందు పొరపాటున అయినా ఈ మొక్క పెరిగితే దానిని తవ్వి వేరే ప్రదేశంలో నాటాలి.
బొప్పాయి చెట్టులో పూర్వీకుల నివాసం
వాస్తు శాస్త్రంలో బొప్పాయి చెట్టు మీ ఇంటి ప్రాంగణంలో ఆర్థిక నష్టాన్ని కలిగించే, సంతోషం, శాంతికి భంగం కలిగించే చెట్టుగా వర్ణించబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వీకులు బొప్పాయి చెట్టులో నివసిస్తారు. అందుకే ఇంట్లో ఈ చెట్టును నాటడం నిషేధించబడింది.
ఇవి ఉంటే మంచిది
ఇంటికి తూర్పు దిశలో గంగరేగి,పనస చెట్లు ఉండటం మంచిది . గంగరేగి చెట్టు దిష్టిని దూరం చేస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండుగ నాడు పిల్లలకు దిష్టి తగలకుండా రేగిపండ్లు పోస్తామనే విషయం తెలిసిందే. ఇక, పనస కాయలో చాలా తొనలు ఉంటాయి. వీటి విత్తనాలు ఉన్న ఇంట్లో సంతాన భాగ్యం బలంగా ఉంటుందని చెబుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications