12 ఏళ్ల తర్వాత బృహస్పతి రాశి మార్పు..విదేశీ అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్..మీకు ఎలా ఉందో చూసుకోండి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బృహస్పతి జ్ణానం, సంతోషం, విస్తరణకు కారకుడిగా పరిగణిస్తారు. ఇది విద్య, సంపద, ఆధ్యాత్మికకు సంబంధించిన విషయాలను ప్రభావితం చేస్తుంది. నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన,దేవతలకు గురువు అయిన బృహస్పతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే తన రాశిని మారుస్తాడు. అంటే ఒక రాశి నుంచి వెళ్లిన తర్వాత మళ్లీ అదే రాశిలోకి బృహస్పతి రావడానికి 12 ఏళ్లు పడుతుందన్నమాట. బృహస్పతి ఏ రాశిలో సంచరిస్తాడో ఆ రాశి వారికి అదృష్టం లభిస్తుంది. ఈసారి బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

దేవగురువు బృహస్పతి ఈ సంవత్సరం మే 14న రాత్రి 11: 20 గంటల సమయంలో మిథునరాశిలో ఎంటర్ అవుతాడు. దీని ప్రభావం అన్ని రాశులపై ఏడాది మొత్తం కూడా ఉంటుంది. అయితే ఏయే రాశులపై దీని ప్రభావం ఏయే విధంగా ఉంటుంది, ఏం పరిహారాలు చేయాలి,జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.

after 12 years jupiter enters into mithun rashi see how it effect on all zodiac signs

మేషం
దేవగురువుగా పిలువబడే బృహస్పతి మిథునరాశిలొకి ప్రవేశించిన తర్వాత మేష రాశి వారి కి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. సోదర సోదీరిమణులతో సంబంధాలు బలపడతాయి. మీ సంభాషణ నెపుణ్యాలు మెరుగవుతాయి. సోమరితనం వల్ల పనుల్లో ఆలస్యం ఉంటుంది. మానసిక ఒత్తడి,అలసటకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశముంది.

పరిహారం: బృహస్పతి మిథునరాశిలో సంచరిస్తున్న సమయంలో గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను దానం చేయాలి.

వృషభం
బృహస్పతి మిథునరాశిలో సంచరిస్తున్న సమయంలో వృషభరాశి వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సంభాషణ నైపుణ్యాలు మెరగవుతాయి. కుటుంబంలో ఆనందం,శాంతి ఉంటుంది. ఫ్యామిలీలో కొన్ని శుభకార్యాలు ఉండొచ్చు. ఆఫీసులో లేదా పని ప్రదేశంలో కొత్త అవకాశాలు లభిస్తాయి.బేరసారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం: గురువారం బృహస్పతి మంత్రాలను జపించి ప్రార్థన చేయడం మంచిది.

మిథునం
మీ కృషికి తగిన ఫలితాలు వస్తాయి. విజయానికి కొత్త డోర్స్ ఓపెన్ అవుతాయి. స్వీయ అభివృద్ధి, కొత్త సంబంధాలను ఏర్పరుచుకోడానికి అనుకూంగా ఉంటుంది. కెరీర్ లో ఎదగడానికి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో లేదా పనిలో ప్రమోషన్,ట్రాన్స్ ఫర్ ఉండొచ్చు. విదేశీ ప్రయాణానికి అవకాశాలు వస్తాయి.

పరిహారం: గురువారం రోజు మూంగ్ దాల్ దానం ఇవ్వడం మంచిది.

కర్కాటకం
ఆథ్యాత్మిక పురోగతి ఉంటుంది. కొత్త రిలేషన్స్ ఏర్పరుచుకోడానికి అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశముంటుంది. నిద్ర సంబంధిత సమస్యలు జీర్ణ సమస్యలు, ఒత్తిడికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు రావొచ్చు.

పరిహారం: గురువారం బృహస్పతి మంత్రాలు జపించండి.

సింహరాశి
కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. డబ్బు సంపాదనకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆథ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆఫీసులో పని ఒత్తిడి ఉంటుంది. మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా ఉంచుకోడానికి ట్రై చేస్తారు.

పరిహారం: గురువారం రోజు గురువు ఆశీర్వాదం తీసుకోవడం మంచిది.

కన్య రాశి

ఆరోగ్యం బాగుంటుంది.ఉత్సాహంగా ఉంటారు. ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విదేశాల్లో పనిచేసే అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్,జీతం పెంపు వంటివి ఉండొచ్చు. అనుకున్న లక్ష్యాలను సధించగలుగుతారు. ఎక్కువ ప్రాజెక్టులు చేపడతారు.

పరిహారం: పసుపు పుష్పరాగం ధరించడం మంచిది.

తుల రాశి
అదృష్టం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భౌతిక సౌకర్యాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కెరీర్ లో ముందుకు వెళ్లడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.ఉన్నత విద్యారంగంలో పురోగతి ఉంటుంది. అయితే ఆర్థికంగా,ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు.

పరిహారం: ప్రతిరోజూ నుదిటిపై కుంకుమ తిలకం పెట్టుకోవడం మంచిది

వృశ్చిక రాశి
ఈసమయం ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యం, వారసత్వం, ఉమ్మడి పెట్టుబడి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సంబంధాలలొ నమ్మకం,పారదర్శతను కాపాడుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి.

పరిహారం: గురువారం 108 సార్లు ఓం అని జపించాలి.

ధనస్సు
ఆదాయం బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. భాగస్వామ్యంతో లేదా ఉమ్మడిగా చేపట్టే పనులు,పెట్టుబడుల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మికంగా,ఎమోషనల్ గా ఉంటారు.

పరిహారం: గురువారం స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పసుపు వేసుకోండి.

మకరం
ఆఫీసులో సహాద్యోగులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెంచుకోడానికి అవకాశాలు అందివస్తాయి. పనిభారం కొద్దిగా పెరిగే అవకాశముంది. సామాజికంగా అంతా బాగుంటుంది.ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలొస్తాయి.

పరిహారం: గురువారం రోజు ఓం గ్రాన్ గ్రీన్ గ్రౌన్ స: గురవే నమ: మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది.

కుంభం
కుంభరాశి ఐదవ ఇంట్లో బృహస్పతి సంచారం ప్రభావం చూపుతుంది. ఈ సమయంలు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్ మార్పులు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంటుంది. ప్రేమికులుకు ఈ సమయం బాగుంటుంది. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుంచి లాభాలు రావొచ్చు.

పరిహారం: గురువారంరోజు వినాయకుడిని పూజించి పసుపు రంగ స్వీట్లు నైవేధ్యంగా పెట్టండి.

మీనం
రియల్ ఎస్టేట్, గృహ సంబంధిత వ్యాపారంలో పెట్టుబడికి ఇది అనుకూలమైన సమయంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కెరీర్ లో ఎదిగేందుకు కొత్త అవకాశాలు వస్తాయి. విలాసాలను కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఒత్తిడి,ఆందోళన ఉంటుంది.

పరిహారం: గురువారం అరటిచెట్టుకి పసుపు కలిపిన నీళ్లుపెట్టడం మంచింది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Wednesday, April 16, 2025, 9:15 [IST]
Desktop Bottom Promotion