Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నవంబర్ 16 నుంచి ఈ 3 రాశుల వారి జీవితాల్లో వెలుగులు నింపనున్న సూర్యుడు.. మీ రాశి కూడా ఉందా?
నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. మొత్తం సౌర వ్యవస్థకు కారకుడైన సూర్యుడు ప్రతి నెలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. అలా తన రాశిని మార్చుకున్నప్పుడు మిగిలిన 11 రాశులను కూడా ఆయన తీవ్రంగా ప్రభావితం చేస్తాడు. దీని కారణంగా ఆయా రాశుల జాతకం మారనుంది.
అయితే ప్రస్తుతం మకర రాశిలో సంచరిస్తున్న సూర్యుడు.. ఈనెల 16వ తేదీన తన రాశిని మార్చుకోనున్నాడు. మకర రాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా మూడు రాశుల వారి జీవితం మారిపోనుంది. సూర్యుడి అనుగ్రహంతో వారి జీవితంలో వెలుగులు విరాజిల్లనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏంటి? ఏ రాశుల వారిపై సుర్యానుగ్రహం ఉండనుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తులా రాశి:
సూర్యుడు తన రాశిని మార్చుకోవడం వల్ల తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు అనుకూల ఫలితాలు రానున్నాయి. సూర్యుడి అనుగ్రహం కారణంగా తులా రాశి వారి ఆర్ధిక జీవితం మెరుగ్గా ఉండనుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు.. నాలుగు మూలల నుంచి ఆదాయం సమకూరుతుంది. సూర్యుడు అనుగ్రహం కారణంగా ఈ రాశివారికి ఆలోచించి నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మాటల్లో నైపుణ్యం పెరిగి, సమాజంలోని వ్యక్తులను ఆకట్టుకుంటారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు గుర్తింపు లభిస్తుంది.
కర్కాటకం:
మకర రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సూర్యుడి ప్రవేశం కర్కాటక రాశి వారికి కూడా అనుకూలమైన లాభాలను అందిస్తుంది. వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశం వల్ల.. కర్కాటక రాశిలోకి అయిదవ స్థానంలో సూర్యుడు సంచరించనున్నాడు. దీని కారణంగా కర్కాటక రాశి జాతకుల పిల్లలకు సంబంధించిన మంచి విషయాలు జరగనున్నాయి.
ఉద్యోగాల కోసం వెతుకున్న వారికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. మంచి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖరారవుతుంది. ఊహించని విధంగా వ్యాపారంలో ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం సంతృప్తిగా ఉండడంతో పాటు సమాజంలో నలుగురి నుంచి చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు తాము అనుకుంటున్న విధంగా ఫలితాలు రాబట్టుకోగలుగుతారు.
ధనుస్సు రాశి
సూర్య భగవానుడి రాశి మార్పు కారణంగా ధనుస్సు రాశికి చెందిన జాతకులకు చాలా మంచి రోజులను తీసుకురానుంది. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల అదృష్టం చాలా బాగుంటుంది. ఎవరైతే వాహనాలు, ఆస్తులు, భూములు కొనాలని అనుకుంటున్నారో వారికి ఇది అత్యంత మంచి సమయం అని చెప్పుకోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారి ఆదాయం, లాభం పెరుగుతుంది. ధనస్సురాశి జాతకుల ఆర్ధిక స్థిరత్వం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా అనుకున్న స్థాయిలో అనుకున్న విధంగా ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు జోతిష్య శాస్త్రం, పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కైకి ఎలాంటి సంబంధం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications