వైశాఖ పౌర్ణమి తర్వాత రోజు నుండి ఈ 5 రాశుల వారికి గజకేసరి రాజయోగంతో లక్ష్మీ దేవి ఆశీస్సులుతో అదృష్ట పొందుతారు

ఈ రోజు వైశాఖ పౌర్ణమి రోజు చాలా విశిష్టమైన రోజు ఈ నెల 23తేదిన వైశాఖ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజుగా జోతిష్య రూపంలో తెలియజేస్తున్నారు.

లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి వైశాఖ పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజు. పౌర్ణమి అమావాస్య రోజుల్లో గ్రహాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ పూర్ణిమ మే 23 తేది సాయంత్రం 6.43 నిముషాలకు ప్రారంభమై 23 తేది సాయంత్రం 7.22నిముషాల ముగుస్తుంది.

Gajakesari Rajyog

ఈరోజును వైశాఖ పౌర్ణమి సందర్భంగా సర్వార్ధ సిద్దియోగం మరియు గజకేసరి యోగం కూడా ఏర్పడుతుంది. వైశాఖ పౌర్ణమి రోజున తీసుకుని చర్యల వల్ల జీవితంలో ఇబ్బందులు తొలగిపోయి , సంతోషాన్ని కలిగిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ దేవి ఆశీస్సులు ఈ రాశుల మీద తప్పకుండా ఉన్నాయి.

ఈ రోజు ఏర్పడిన గజకేసరియోగం వల్ల ఈ రాశుల వారి జీవితంలో ఎన్నో యోగాలు కలుగుతాయిని పండితులు తెలియజేస్తున్నారు. మరి ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.

మేషరాశి
గజకేశరి రాజయోగం వల్ల ఈ రాశుల వారికి వివాహ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. వీరికి రావాల్సినటువంటి బకాయిలు వసూలు అవుతాయి.ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. కోర్టు సంబంధిత కేసుల్లో మంచి విజయం సాధిస్తారు. కుటుంభ జీవితం ఆనందంగా ఉటుంది. డబ్బు పొదుపు చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు బారీ లాభాలు వస్తాయి. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య ఉండదు. వీరికి ఈ యోగం చాలా పవిత్రమైనది.

కర్కాటక రాశి
కర్కాటకరాశికి గజకేశరి యోగం అద్భుతంగా ఉంటుంది. ఈ రాశుల వారికి గురుడుతో పాటు చంద్రుడి ప్రత్యేక ఆశీస్సులు కూడా లభించబోతున్నాయి. ఈ రాజయోగంలో కర్కాటకరాశి వారికి పెను మార్పులు రాభోతున్నాయి. దీనితో పాటు కొన్ని లక్ష్యాలను సాధించడంతో విజయం సొంతం చేసుకుంటారు. కొత్త ఉద్యోగాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. విజయం మీదే అవుతుంది.తండ్రి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది.రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. మరియుసమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటినిర్మాణ పనులు అనుకూలిస్తాయి. ఇంటికి అథితుల రాకతో సంతోష వాతావరణం ఏర్పడుతుంది.ఆర్థికంగా ఎంతో అధ్బుతంగా ఉంటుంది.

సింహరాశి:
ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతున్నారు. మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సీనియర్ల మద్దతు పూర్తిగా లభిస్తుంది. ఈ కారణంగా మీరు లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారు. స్నేహితులు కుటుంభ సభ్యులతో తీర్థయార్థలకు వెళతారు. వ్యాపారస్తులు పెట్టుబడిలలో ముఖ్యమైన సంతకం చేయడం వల్ల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. అలాగే పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. వీరి భవిష్యత్తు గురించి మంచి నిర్ణాయాలు తీసుకుంటారు. మీ సోదరీ సోదరుల నుంచి లాభాలను పొందుతారు. కెరీర్ ను మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారు.దాంతో అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయం గతంలో కంటే ప్రస్తుతం పెరుగుతాయి. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గొప్ప వ్యక్తుల నుండి ఆహ్వానాలు అందుతాయి.నిరుద్యోగులకు చాలా కాలం నుండి వేచి ఉన్న పనులు లభిస్తాయి.వినాయకుని సింధూరంతో పూజచేస్తే మంచి ఫలితాలు కలిగితాయి. గోమాతాను పూజిస్తే సింహరాశి వారికి చాలా గొప్ప ఉంటుంది.

మకరరాశి
మకరాశి వారికి గజకేసరి యోగం మీ యొక్క జాతకాన్నే మార్చబోతుంది. మకరాశి జాతకులకు కెరీర్ లో గొప్ప ఫలితాలు రాబోతున్నాయి. ప్రేమలో ఉండేటంటు వ్యక్తులు చాలా సంతోషంగా గడుపుతారు. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ పూర్వీకుల ఆస్తులు పొందుతారు. వాటి గురించి శుభవార్తలు వింటారు. రైతులు వ్యవసాయదారులు మంచి లాభాలు పొందబోతున్నారు.కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఏపని చేపట్టినా సమాయానికి పూర్తి చేస్తారు. ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు. ఈ గజకేసరి యోగతంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగంలో ఎన్నో మార్పులు వస్తాయి. వీరు శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేయాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఏలినాటి శనీ ఉన్నవారు కాకులకు బెల్లంతో తయారుచేసిన రొట్టలు, ఆహారం ఇవ్వడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందుతారు.

ధనుస్సురాశి
గజకేసరి రాజయోగం వల్ల ధనుస్సురాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ పొందే అవకాశం కనబడుతున్నది.ఉన్నతపదవులకోసం ఎదురుచూస్తున్నవారు శుభవార్తలు పొందుతారు. జీవితంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. వీరికి ఇది సువర్ణయోగం. కీర్థప్రతిష్టలు, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంభ సభ్యులు సంతోషంగా గడుపుతారు.ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికం అవుతాయి కాబట్టి, కొంచెం తగ్గించుకోండి. ఉద్యోగుకలు ప్రమోషన్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. అయితే మీరు నియంత్రిచుకోవాలి. నూతన వస్త్ర, వస్తులువు కొనుగోలు చేస్తారు. ఆధిత్య స్త్రోత్రం పారాణం చేసి సూర్యునికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించడం వల్ల శుభఫలితాలు తప్పకుండా వస్తాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Thursday, May 23, 2024, 22:33 [IST]
Desktop Bottom Promotion