Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Akshaya Tritiya 2023: ఈ అక్షయ తృతీయకు ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే
హిందూ క్యాలెండర్ ప్రకారం, అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజును చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఏ పని చేపట్టినా కచ్చితంగా విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.
అంతటి గొప్ప రోజైన అక్షయ తృతీయ 2023 ఏడాదిలో ఏప్రిల్ 22వ తేదీన వచ్చింది. ఈ సమయంలో చాలా మంది బంగారంతో పాటు విలువైన వస్తువులు, కొత్త ఇంట్లోకి ప్రవేశం, కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయను పసిడిరాసుల పర్వదినంగా భావిస్తారు. అక్షయం అంటే తరిగిపోనిదని అర్థం.

ఏప్రిల్ నెలలో బృహస్పతి రాహువుతో కలిగి ఉండగా, బుధుడు, సూర్యుడు మేషరాశిలో ఉంటారు. మేషరాశిలో బృహస్పతి, రాహువు కలయిక కూడా గురు చండాల యోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం 2023, అక్టోబర్ 30 వరకు కొనసాగుతుంది. రాహువు అక్కడి నుండి మీనరాశిలో సంచరిస్తాడు. దీని కారణంగా ఐదు రాశుల వారికి కాలం కలిసిరానుంది.
ఈ అక్షయ తృతీయ కొన్ని రాశుల వారికి విశేషంగా కలిసి రానుంది. వారు ఏ పని మొదలు పెట్టిన అందులో విజయం సాధిస్తారు. అక్షయ తృతీయ రోజు అదృష్టం పొందే రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం:
మేషరాశి వారి అదృష్టం దశ తిరగనుంది. జీవితంలో చాలా మార్పులను గమనిస్తారు. పరివర్తన ఉంటుంది. మానసికంగా కొత్తదనాన్ని అనుభవిస్తారు. నిపుణులు పనిలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఈ సమయంలో కోలుకుంటారు. మేష వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన పెరిగి, సాన్నిహిత్యం మెరుగుపడుతుంది.
మిథునం:
ఈ సమయం మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో సంపదను సృష్టించుకుంటారు. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీతం కూడా పెరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ సమయంలో పొదుపు ఎక్కువ చేస్తారు. ఈ సమయంలో సామాజికంగా చురుకుగా ఉంటారు. ఏదైనా పెట్టుబడి ప్రణాళిక విజయవంతం అవుతుంది.
కన్య:
కన్య రాశి వారి జీవితంలో ఈ సమయం చాలా సానుకూలంగా సాగుతుంది. ఈ సమయంలో మతపరమైన పనుల వైపు మొగ్గు చూపుతారు. మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలకు కూడా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. ఆనందంగా గడుపుతారు. కుటుంబసభ్యులతో అనుబంధం మెరుగుపడుతుంది. కుటుంబసభ్యులు అన్ని నిర్ణయాలకు మద్దతుగా నిలబడతారు. మీరు ఆర్థికంగా సరిగ్గా వ్యవహరించగలిగితే అదృష్టం మీ వశం అవుతుంది.
కర్కాటకం:
ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతీది అనుకున్నట్లుగానే జరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో సౌకర్యవంతంగా ఉంటారు. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో చాలా గౌరవం పొందుతారు. వ్యాపారస్తులు ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో సంతోషంగా, రిలాక్స్ గా ఉంటారు.
మీనం:
ఈ సమయంలో మంచి ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. నిరుద్యోగులకు, ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. కెరీర్ పరంగా, సరైన అవకాశాన్ని ఎంచుకుంటే రాణిస్తారు. ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు ఈ దశ అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి మెలిసి ఉంటారు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications