Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ప్రపంచంలో వీళ్లంతా అదృష్టవంతులు లేరు.. అమావాస్య నుంచి ఈ రాశుల వారి దశ తిరిగినట్టే!
జోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే నవంబర్ 30వ తేదీతో పాటు డిసెంబర్ 1, 2వ తేదీల్లో సంభవించే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది సాధారణ అమావాస్యల అంటే ఎక్కువ ప్రతిఫలాలను అందించనుంది. ఎందుకంటే వృశ్చిక రాశి చంద్రుడికి నీచ స్థానం అవుతుంది. అయితే ఈ రాశిలో రవి చంద్రులు కలిసిపోతున్నారు. వారితో పాటు బుధుడు కూడా కలవడం, పైగా గురువు పూర్ణ దృష్టితో చూడడం వల్ల.. చంద్రుడికి పౌర్ణమి నాటి బలం చేకూరింది. దీని ఈ ఆరు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ రాశులు ఇవే..
వృషభ:
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో రవి చంద్రుల కలయిక ఏర్పడింది. ఈ కలయికను గురువు చూడడం వల్ల.. ఈ రాశి వారికి అంతా అనుకూలమైన రోజులే ఉండనున్నాయి. ఏ పని చేపట్టినా అది విజయవంతమై తీరుతుంది. ఈ మూడు రోజుల పాటు ధన వర్షం కురుస్తోంది. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సత్ఫలితాలను అందిస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగిపోతాయి. దీని కారణంగా ఆర్ధిక అనిశ్చితి తొలిగిపోతుంది.

కర్కాటకం:
ఈ రాశికి అధిపతి చంద్రుడు. అలాంటి చంద్రుడిని లాభ స్థానంలో ఉన్న గురువు వీక్షించడం వల్ల.. చంద్రుడికి నీచభంగం కలుగుతుంది. దీంతో పాటు ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా భారీగా ఆదాయం వచ్చి పడుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వచ్చి పడతాయి. చాలా శుభ పనులు చేపట్టనున్నారు. సమాజంలో ఈ రాశికి చెందిన గౌరవం పెరుగుతుంది. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి.
తుల:
ఈ రాశి వారికి ఈ అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన అమావాస్య రెండో స్థానంలో ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉన్నత స్థానానికి వెళ్తారు. గృహ, వాహన ప్రయత్నాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు భారీగా అభివృద్ధి చెందుతాయి. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవడంతో పాటు ఆస్తుల విలువ పెరుగుతుంది.
వృశ్చికం:
ఈ రాశిలో రవి, చంద్రులు కలవడం అనేది ఒక యోగం. ఈ యోగాన్ని గురువు కూడా వీక్షించడం వల్ల.. మరో విశేషమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఆదాయం భారీగా వచ్చి పడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత, ప్రభావం పెరుగుతుంది. ఉద్యోగంలో లేదా రాజకీయ రంగంలో ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తితో పెళ్లిళ్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. సమాజంలో మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది.
మకరం:
ఈ రాశి వారికి లాభ స్థానంలో రవి చంద్రుల కలయిక ఏర్పడుతుంది. అలాగే ఆ కలయికను గురువు కూడా వీక్షించడం వల్ల.. అనేక విధాలుగా లాభాలు చేకూరనున్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి పదోన్నతి లభిస్తుంది. అలాగే జీత భత్యాలు పెరగనున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు విస్తరించనున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
మీన:
ఈ రాశి వారికి భాగ్య స్థానంలో అమావాస్య ఏర్పడుతుంది. అలాగే ఈ రాశికి అధిపతి అయిన గురువు.. వీక్షించడం వల్ల అనేక శుభపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్, జీతాలు పెరగనున్నాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త గృహ, వాహన యోగం కలుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











