Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Aquarius: 2025లో కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉంటుందంటే?
ఇంకో అయిదు రోజుల్లో 2024వ సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పేసి 2025వ సంవత్సరంలోకి అడుగుపెడతాం. ఈ నేపథ్యంలో చాలా మంది తమ తమ వార్షిక ప్రణాళికలను వేసుకుంటున్నారు. ఇంకొందరు 2025లో తమ జాతకం ఎలా ఉంటుండానికి చూసుకుంటున్నారు. ఈరోజు 2025లో కుంభ రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కెరీర్
కుంభ రాశి వారికి కెరీర్ పరంగా 2025వ సంవత్సరం 2024వ సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ సంవత్సరంలో ఈ రాశి వారు కొత్త ఉద్యోగంలో మారడానికి ప్రయత్నించినట్లైతే కచ్చితంగా వారికి కలిసి వస్తుంది. అలాగే నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. మే నెల వరకు రాహువు కొంత ఇబ్బందులు కలిపించినప్పటికీ, వాటన్నిటినీ ఎదుర్కొని వీరు మంచి జీవితాన్ని గడిపే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎలాంటి ఉద్యోగమంలోనైనా మీకు అప్పగించిన పనిని సమర్ధవంతంగా చేయడానికి ప్రయత్నించాలి. కొత్త కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. జీతం పెరుగుతుంది. అలాగే ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. వ్యాపారవేత్తలకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గతంతో పోలిస్తే మంచి లాభాలను పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం అయితే కనిపిస్తుంది. అలాగే మీరు వ్యాపార విస్తరణ కోసం చూస్తున్నట్లయితే, ఈ సమయం మీకు అనుకూలమైనది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారికి కూడా మంచి లాభం లభిస్తుంది.
ఫైనాన్షియల్ లైఫ్
2025లో కుంభ రాశి వారికి ఫైనాన్షియల్ లైఫ్ కూడా మెరుగవుతుంది. ఈ సంవత్సరం మొదటి అర్థ భాగం కంటే రెండో అర్థ భాగం సంపాదన పరంగా అత్యంత అద్భుతంగా ఉంటుంది. పొదుపు చేయడం కష్టంగా ఉన్నపటికీ, ఖర్చులను మెయింటెయిన్ చేసుకోగలుగుతారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతారు.
ప్రేమ-కుటుంబ జీవితం ఎలా ఉంటుంది?
ఈ 2025వ నూతన సంవత్సరం ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు కూడా ఈ రాశిలో చాలా కాలం పాటు అనుకూలమైన స్థితిలో ఉంటాడు. బృహస్పతి కూడా మే నుండి మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి వివాహ సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. అవాహితులకు వివాహ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఈ సమయం చాలా మంచిది.
కానీ కుటుంబ జీవితంపై దృష్టి పెట్టాలి, మీకు మరియు మీ కుటుంబానికి మధ్య కొంత అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. వైవాహిక జీవితంలో కొంత అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది.
ఆరోగ్య జీవితం
కుంభ రాశి వారు 2025లో కొంత మిశ్రమ ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంది. దీని కారణంగా ఈ రాశి వారు ఎక్కువగా ఆరోగ్యంపై ద్రుష్టి సారించాలి. శని సడేసతి ఉన్నందున ఈ కాలంలో కొంత సవాళ్ళను ఎదుర్కునే అవకాశం ఉంటుంది.
క్రయ విక్రయాలు..
ఈ సంవత్సరం కుంభ రాశి వారు క్రయ విక్రయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భూములపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంటిని నిర్మించుకోవడం కూడా చాలా కష్టం. ఈ విషయాల్లో కచ్చితంగా సవాళ్ళను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. అలాగే వాహనాలు కొనుక్కోవడానికి ఇది అనుకూలమైన సమయం. మంచి లగ్జరీ వాహనం కొనుక్కునే సూచనలు కనిపిస్తున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications