Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మే 24న కుంభరాశివారి తిరుగు లేదు.. శుభకార్యాలకు మంచి సమయం..!
కుంభ రాశివారికి మే 24న కొన్ని కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయ్. వాటిని మేము మీకు ముందు ఈ ఆర్టికల్ ద్వారా వివరిస్తున్నామ్. జ్యోతిష్యం శాస్త్రీయమైనది. పుట్టిన తేదీ, జాతక చక్రం, రాశుల ఆధారంగా అంతరిక్షంలో వుండే గ్రాహాల ప్రభావం భూమిపైన ఉండే మనపై ఎలాంటి ప్రభావం చూపెడుతుందనేది జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడి వుంది.
కుంభరాశి అధిపతి శనీదేవుడు. ఈ రాశివారు రేపటి జాతకం గురించి భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కుంభరాశి వారికి పరిస్థితులు అనుకూలంగానే వుంటాయ్. ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోరు. మానసికంగా చాలా ఆరోగ్యంగా వుంటారు. ఇతరులకు సంతోషాన్ని పంచుతారు. ఎవరితో గొడవకు దిగే పరిస్థితులు ఏర్పడవు. అలాంటి పరిస్థితులు వచ్చినా కుంభరాశి వారు వాటికి దూరంగానే వుంటారు.

ఇతరులను మాట చేత ఆకట్టుకుంటారు. చేయలేని పనులన్నింటినీ సంతోషంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధువులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీకు ఏవైనా కోరికలుంటే నెరవేరుతాయ్. నూతనంగా ఇల్లు కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయమని చెప్పుకోవచ్చు. శుభకార్యాలకు ఇది మంచి సమయం. వివాహం కాకుండా, పెళ్లి సంబంధాలు సరిగ్గా కుదరకుండా వున్న వాళ్లు ఈ సమయంలో పెళ్లి ప్రయత్నాలు చేస్తే మంచి ఫలతం లభిస్తుంది. ప్రేమ విషయంలో అడ్డంకులు ఎదుర్కుంటున్న వారికి కూడా స్వాంతన కలిగిస్తుంది. ప్రేమికుల పెళ్లిని పెద్దలు అంగీకరిస్తారు.
వ్యాపారం చేసే వారు కూడా చింతించాల్సిన అవసరం లేదు. క్రయ, విక్రయాల్లో మంచి లాభం పొందుతారు. పెట్టిన పెట్టుబడికి మంచి లాభం వస్తుంది. షేర్ మార్కెట్ జోలికి వెళ్లకపోతే బాగుంటుందని జాతక చక్రం చెబుతోంది.
చదువు విషయంలో విద్యార్ధులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆటో ఇమ్యునిటీ డిజార్డర్లు వచ్చే అవకాశాలు వున్నాయ్. కుంభరాశి వారికి రోగనిరోధక శక్తి కొంచం తక్కువగా వుండడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం వుంది. దీని నివారణకు లలితా సహస్రనామాన్ని పఠించాలి. పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. చెడు అలవాట్లకు కుంభరాశి వారు దూరంగా వుండాలి.
కొత్తగా పరిచయమైన స్నేహితుల విషయంలో జాగ్రత్తగా వుండాలి. లేదంటే నష్టపోయే అవకాశం వుంది. కుంభరాశిరు వారికి ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రం చదవాలి.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారమంతా ఇంటర్నెట్ నుంచి, ప్రముఖ జ్యోతిష్యుల నుంచి సేకరించిందని గుర్తుచేస్తూ వేన్నాము. వీటి ఖచ్ఛితత్వంపై మాకు ఎలాంటి సంబంధం
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications