Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఆగస్టు అశుభ రాజయోగాలు.. ఆగస్టు నెల ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే
వేదజ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక ద్వాదశ రాశుల వారిపై ఉంటుంది. ఏదైనా గ్రహం ఒక చోటు నుంచి మరోచోటుకు సంచరించడం వల్ల కొన్ని రాశుల వారిపై అనుకూల ప్రభావం చూపిస్తే, మరికొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. గ్రహాలం సంచారం, కదలిక, కలయిక, తిరోగమనం, అస్తమయం, ఉదయం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి.

ఆగస్టు నెలలో గ్రహాల సంచారం వల్ల కొన్ని రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. పైగా శ్రావణం కూడా మొదలు కానుంది. ఇది సుమారు 2 నెలల పాటు ఉండనుంది. ఆగస్టులో సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం వల్ల రెండు అశుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. దరిద్ర యోగం, ఖప్పర్ యోగం వల్ల కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రాశులు ఏమిటి, అందులో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు తెలుసుకోండి.
కన్యారాశి
సూర్యుడి సంచారం వల్ల ఏర్పడనున్న అశుభ రాజయోగాల వల్ల కన్యారాశి వారికి అశుభ ఫలితాలు ఎదురుకానున్నాయి. కన్యారాశి వారిపై చెడు ప్రబావం పడనుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వస్తాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. పని ప్రదేశంలో అసంతృప్తి ఎదురవుతుంది. కష్టానికి తగిన ఫలితం రాదు. డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పై శ్రద్ధ ఉంచాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి దరిద్ర యోగం, ఖప్పర్ యోగం ఏమాత్రం కలిసిరాదు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు సమస్యలను ఎదురొంటారు. అనుకోని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. కొత్త పని, వ్యాపారం ప్రారంభించకపోవడమే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త.
మిథునరాశి
దరిద్ర యోగం, ఖప్పర్ యోగం వల్ల మిథున రాశి వారు సమస్యలు ఎదుర్కోబోతున్నారు. ఆరోగ్యంపై చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా పెద్ద సమస్యను ఎదుర్కొంటారు. అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications