Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Astro tips: గురువారం జస్ట్ ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయ్..పీడకలలు కూడా రావు
సనాతన ధర్మంలో ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఆ ప్రకారంగా గురువారం విష్ణువు రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొన్ని పనులు చేస్తే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. తొలగిస్తాడని నమ్ముతారు. విష్ణువుకు ఇష్టమైన పదార్ధాలలో పసుపు చేర్చబడింది. ఈ రోజున పసుపు తిలకం పూయడం, ఉపవాసం పాటించడం ద్వారా విష్ణువు తన భక్తుల సమస్యలన్నింటినీ తొలగిస్తాడని నమ్ముతారు.
మీరు ఆర్థిక సంక్షోభంలో ఉన్నా లేదా చెడు కలల వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా గురువారం రోజు పసుపుతో చేపట్టే నాలుగు సాధారణ నివారణ చర్యలు మీకు అన్ని కష్టాల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గురువారం ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయ్
సంపద పెరుగుతుంది
గురువారం రోజు 5 మొత్తం పసుపు ముక్కలను తీసుకుని వాటిని ఒక గుడ్డలో కట్టి వాటిని మీ లాకర్ లో, లేదా మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. దీని ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపద పెరుగుతుంది.
మీ పని సక్సెస్
ఏదైనా శుభ కార్యం కోసం బయటకు వెళ్లవలసి వస్తే గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత వినాయకుడిని పూజించి పసుపు తిలకం పెట్టుకోండి. పసుపు తిలకం పూసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లండి. ఇలా చేయడం వల్ల మీ పని విజయవంతంగా పూర్తవుతుంది.
డబ్బు సమస్యలు
డబ్బు మీ దగ్గర ఆగకపోతే లేదా మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే పసుపు,అక్షింతలను తీసుకొని గురువారం విష్ణుసహస్త్రాణం పఠించండి. ఇలా చేస్తే విష్ణువును ప్రసన్నం చేసుకోవచ్చు, ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందచ్చు.
పీడకలలు దూరం
రాత్రిపూట మీకు పీడకలలు వస్తుంటే పసుపు ముడి కట్టి మంచం తలపై ఉంచండి. దీంతో పీడకలలు మిమ్మల్ని బాధించవు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications