Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే అద్భుతమైన చిట్కాలివే.. ఓసారి ట్రై చేసి చూడండి, లక్కే లక్కు!
చాలా మంది ఎప్పుడూ కష్టాలు ఎదుర్కుంటూనే ఉంటారు. డబ్బుల్లేక కొందరు అయితే, డబ్బులుండీ సమస్యలు ఎదుర్కునే వారు మరికొందరు. వీటికి తోడు ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రంగా వేధిస్తుంటాయి. ఎన్ని పనులు చేస్తూ.. ఎంత కష్టపడినా అదృష్టం మాత్రం కలిసి రాదు. దేవుడు దయతలిచి ఏమైనా అవకాశాలు ఇచ్చినా దరిద్ర లక్ష్మి మాత్రం వాటిని సద్వినియోగం చేసుకోనివ్వకుండా వెంటాడుతుంది. మరికొందరు పదే పదే ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా.. ఏం లాభం లేదని తమ ప్రయత్నాలను విరమించుకుంటారు.

జాతకంలో దోషాల కారణంగానే దురదృష్టాలు..
అయితే ఇలాంటి పరిస్థితులు అన్నీ జాతకంలో ఉండే దోషాల కారణంగానే ఏర్పడతాయట. అయితే ఈ దోషాలపై ఎక్కువగా ఎవరూ దృష్టి పెట్టరు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన జాతకంలో దోషం ఉంటే... అదృష్టాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కానీ మేము ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటిస్తే దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు. అయితే జాతక దోషాన్ని తప్పించుకొని అదృష్టాన్ని తప్పించుకునే పరిహారాలేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉప్పుతో ఇలా చేస్తే దురదృష్టం దూరమే:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దురదృష్టాన్ని పోగొట్టుకోవాలంటే ఉప్పు ఎంగానో ఉపయోగపడుతుందట. ఇందుకోసం మీ ఎడమ భుజంపై చిటికెడు ఇప్పు వేయండి. అలాగే కుడి భుజం మీద ఉప్పును పొరపాటున కూడా వేయకండి. దీని వల్ల మరింత దృరదృష్టం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేయాలి. అలాగే ఉప్పుతోనే నేలను శుభ్రం చేయాలి. ఇలా చేస్తే దురదృష్టం దూరమై.. అదృష్టం దగ్గరవుతుంది.
2. ఇంట్లో ఎప్పుడూ వెలుతూరు ఉంటే:
ఎక్కువ మంది ప్రజలు విద్యుత్ ను ఆదా చేసేందుకు వాళ్లు ఉన్న చోట మాత్రమే ఓ లైట్ వేసుకుంటారు. మిగతా లైట్లన్నీ ఆఫ్ చేసేస్తారు. కానీ ఇలా ఇంటిని చీకటిగా ఉంచడం మంచిది కాదు. హిందూ పురాణాల ప్రకారం కాంతి శక్తికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇల్లు ఎంత కాంతితో ప్రకాశిస్తే అంత సానుకూల శక్తి ఇంట్లో ప్రవేశిస్తుందని అర్థం. అదే ఎల్లప్పుడూ చీకట్లో ఉండే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించి, మిమ్మల్ని పేదరికంలో తోసేసే అవకాశం ఉంది. డబ్బు లేని వారికి సాయం చేసే వారు కూడా చాలా తక్కువగానే ఉంటారు. రోజంతా ఇంట్లోకి వెలుతూరు వచ్చేలా ఉంచండి. లైట్లు వేయడం మీ వల్ల కాదు అనుకుంటే సంధ్యాసమయంలో ఇంటి ప్రతి మూలలోనూ దీపం వెలిగించండి. విద్యుత్, నూనె దీపాలు కాకుండా కొవ్వొత్తులు, లాంతర్లు కూడా దీపాలుగా వాడవచ్చు.
మీ ఇంట్లో చేస్తేనే అద్భుతమైన ఫలితాలు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నిర్దిష్ట వ్యక్తి తన జన్మస్థలం ఇల్లు, రాష్ట్రం లేదా దేశంతో స్థిరపడిన వారి జాతకంలో పురోగతి అనేదే ఉండదు. ఇలాంటి పరిస్థితిలో వారు తమ సొంత స్థలానికి దూరంగా ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దురదృష్టం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే వారికి పైన చెప్పిన చిట్కాలు పని చేయవు. ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఈ పరిహారాలు పని చేస్తాయి. సో మీ ఇంటి వద్ద ఉన్నప్పుడే ఈ పరిహారాలను పాటించి.. దురదృష్టాలను దూరం చేసుకోండి. అదృష్ట లక్ష్మిని ఇంటికి ఆహ్వానించి.. ఎప్పుడూ మీ వెంట తిరిగేలా చేసుకోండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications